- Home
- Business
- Silver Price: 2015లో రూ. 2 లక్షల వెండి కొన్న వారి దగ్గర.. ఈరోజు ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?
Silver Price: 2015లో రూ. 2 లక్షల వెండి కొన్న వారి దగ్గర.. ఈరోజు ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?
Silver Price: వెండి భయపెడుతోంది. రోజురోజుకీ పెరుగుతోన్న ధరలు చూస్తుంటే దడ పుడుతోంది. ఒక్కరోజులో కిలో వెండి ధర ఏకంగా రూ. 19 వేలు పెరుగుతోందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే 10 ఏళ్ల క్రితం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా.?

వెండి ధరలో భారీ మార్పులు
2015లో కిలో వెండి ధర సుమారు రూ. 37,800 ఉండేది. దీంతో తులం వెండి దాదాపు రూ. 400కే లభించింది. అయితే ఆ సమయంలో వెండిని ఇన్వెస్ట్‌మెంట్‌గా ఆలోచించే వారు చాలా తక్కువ మందే ఉన్నారు. పదేళ్ల క్రితం చేతిలో రూ. 2 లక్షలు ఉంటే ఏకంగా 5.2 కిలోల వెండి లభించేది. ఆ స్థాయిలో పెట్టుబడి పెట్టిన వారు పది సంవత్సరాల తర్వాత వచ్చిన మార్పును ఊహించలేరు కూడా. కానీ 2025 డిసెంబర్లో వెండి ధర కిలోకు రూ. 2,50,000 పెరిగిపోయింది. ఇది 2015లో ఉన్న ధరతో పోలిస్తే సుమారు 6.6 రెట్లు అధికం.
ఎంత రిటర్న్స్
2015లో రూ.2 లక్షలతో వెండి కొనుగోలు చేస్తే సుమారు 5 కిలోలు వచ్చేవి. అప్పుడున్న మార్కెట్ విలువ ప్రకారం. 5 కిలోల వెండి ధర రూ. 1.89 లక్షలు ఉండేది. అంటే రౌండ్ ఫిగర్‌గా సుమారు రూ. 2 లక్షలు. అయితే ఇప్పుడు అదే 5 కిలోల వెండి విలువ ఏకంగా రూ. 12.5 లక్షలకు చేరింది. అంటే 10 సంవత్సరాల్లో రూ. 2 లక్షల పెట్టుబడి రూ. 12.5 లక్షల వరకు విలువ పెంచింది. ఇది సుమారు 6.25 రెట్లు లాభం. ఇది సాధారణ బాంకు FD వడ్డీ కన్నా చాలా ఎక్కువ. ఇలా వెండి ధర పెరగడం వల్ల పెట్టుబడిదారులు పెద్ద లాభాలను పొందగలిగారు.
అసలు వెండి ధరలు ఎందుకు పెరుగుతన్నాయి.?
వెండి ధర పెరగడానికి కింది ముఖ్య కారణాలు ఉన్నాయి:
1) డిమాండ్-సప్లై అసమతుల్యం
పరిశ్రమల్లో వెండి ఉపయోగం పెరుగుతోంది. ముఖ్యంగా సోలార్ ఉత్పత్తులు, ఈవీ వెహికిల్స్ తయారీలో వాడుతున్నారు. అయితే పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడం వల్ల వెండి ధరలు పెరుగుతున్నాయి.
2) ఆర్థిక, రాజకీయ అస్థిరతలు
అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతలు వచ్చినప్పుడు వడ్డీ తక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు “హెడ్డ్జ్” (నష్ట నివారణ) కోసం వెండి వంటి లోహాల్లో పెట్టుబడి పెడతారు. ఇది వెండి ధర పెరిగేలా చేసింది.
3) ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల
వెండి తవ్వక, ప్రాసెసింగ్ ఖర్చులు పెరగడం కూడా ధరను పుష్కలంగా పెంచుతుంది.
వెండిపై ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు.?
ఇన్‌ఫ్లేషన్‌కు రక్షణ:
కమోడిటీలలో ప్రత్యేకంగా వెండి ధరలు ఇన్‌ఫ్లేషన్ సమయంలో ఎక్కువ పెరుగుతాయి. దాంతో పెట్టుబడిదారులు దీన్ని మంచి రిటర్న్స్‌గా భావిస్తున్నారు.
పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్:
షేర్ల మార్కెట్, బాండ్లతో పాటు వెండి పెట్టుబడి పెట్టడం పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్ చేస్తుంది.
లాంగ్-టర్మ్ విలువ నిలుపుదల:
సంవత్సరాలుగా వెండి ధర పెరుగుదల చూస్తే దీన్ని లాంగ్-టర్మ్ పెట్టుబడిగా కూడా భావించవచ్చు.
2026లో వెండి ధరలపై అంచనాలు
2026లో కూడా వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి పలు కారణాలు చెబుతున్నారు. వీటిలో ప్రధానమైనవి ఇవే..
ధరలు పెరగడానికి కారణాలు
ప్రపంచంలో వెండి ఉత్పత్తిదారుల్లో ఎక్కువ వాటా కలిగిన చైనా.. సిల్వర్ ఎగుమతులపై నిబంధనలు విధించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వెండి ధరలు భారీగా పెరగనున్నాయని అంటున్నారు. దీనికి తోడు రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ వెండి ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ఓ అంచనా ప్రకారం 2026 చివరి నాటికి కిలో వెండి ధర రూ. 3 లక్షలకు చేరే అవకాశం ఉందని అంటున్నారు.

