రాబోయేది ఆర్థిక సంక్షోభమే.. హైదరబాదీలు ఈ జాగ్రత్తలు పాటించండి..
లక్షా రెండులక్షల జీతాలతో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం పొతే..? కారు లోన్ , హోసింగ్ లోన్ ఎలా కట్టగలరు? అందుకే ఆర్థిక సంక్షోభం, ఏఐ ఎఫెక్ట్ తో ఉద్యోగాలు పోయినా ఇబ్బందులు ఉండొద్దంటే ఈ జాగ్రత్తలు పాటించండి.

రానున్నది ఆర్థిక సునామి...
రాకపోతే సంతోషం !
వస్తే...గిస్తే ?
25- 30 ఏళ్లుగా మన దేశ ఆర్థిక వ్యవస్థకు రైలు ఇంజిన్, చోదక శక్తి .. సాఫ్ట్ వేర్ .
టిసిఎస్ , ఇన్ఫోసిస్ , విప్రో .. ఇంకా ఎన్నో కంపెనీలు .
మాదాపూర్ , సైబరాబాద్ , బెంగళూరు , పూణే ... . ఇంకా ఎన్నో నగరాలు .
ప్రతి పది ఇళ్లల్లో కనీసం అయిదు మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు .
ఇండియాలో ..
అమెరికా , ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా , కెనడా .. ఇంకా ఎన్నో చోట్ల
లక్షలాది కుటుంబాలు బువ్వ తింటున్నాయి అంటే సాఫ్ట్ వేర్ .
సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ఆదాయం మీద ఎన్నో రంగాలు .. రియల్ ఎస్టేట్ , బ్యాంకింగ్ , ట్రావెల్ , టూరిజం , హోటల్స్ , మాల్స్ , ఫుడ్ కోర్ట్స్ , బ్యూటీ ప్రొడక్ట్స్ .. ఇంకా ఎన్నో .
ఇప్పుడు కృతిమ మేథ వచ్చేసింది .
సాఫ్ట్వేర్ ఇంజినీర్లు .. ముఖ్యంగా కొత్తగా చేరిన వారు చేసే కోడింగ్ లాంటి పనులను కృతిమ మేథ చేసేస్తోంది .
ఉద్యోగులను తొలగించి కృతిమ మేథకు పని అప్పచెబితే కంపెనీలకు భారీగా లాభాలు .
ఇలాంటప్పుడు టీసీఎస్ , విప్రో ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ లకు విదేశాలనుండి కాంట్రాక్ట్ లు ఎలా వస్తాయి ?
కాంట్రాక్ట్ లు లేకుంటే అవి ఉద్యోగులను తొలగించవా ?
ఉన్న పనిని కృతిమ మేథ తో పని చేయించవా ?
కృతిమ మేథ అనేక రంగాలను ప్రభావితం చేయనుంది .
కానీ ముందుగా దాని ప్రభావం పడేది సాఫ్ట్ వేర్ రంగం పైనే .
సాఫ్ట్ వేర్ కాంతులు మసక బడితే .. మన ఆర్థిక వ్యవస్థ సంగతి ఊహించండి .
ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ , ఇంకా దక్షిణ భారత దేశం .
సాప్ట్ వేర్ ఉద్యోగులూ జాగ్రత్త..
మంచో చెడో ఉత్తరాది వారి సాఫ్ట్ వేర్ పై మన దక్షిణాది వారి స్థాయిలో ఆధారపడలేదు .
రెండు లక్షల జీతంతో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం పొతే ?
కారు లోన్ , హోసింగ్ లోన్ ఎలా కట్టగలరు ?
వేలాది మంది ఇలా దెబ్బతింటే దాని ప్రభావం రియల్ ఎస్టేట్ మొదలు అన్ని రకాల వ్యాపారాలపై పడదా ?
ప్రపంచం ఇప్పుడు సంధి కాలంలో ఉంది .
ప్రభుత్వాలు రంగంలో దిగి చట్టాలు చేయకపోతే జనాభాలో తొంబై శాతం ఉద్యోగాలు లేక ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలపై ఆధారపడి బతకాలి .
యూనివర్సల్ ఇన్కమ్ బిచ్చగాళ్ళు అయిపోయే అవకాశం.
ఎవరో వస్తారని ఏదో చేసారని కాదు .
మీరు కనీసం ఇది చేయండి.
1 . 2028 కల్లా భారతదేశంలో ఆర్థిక సంక్షోభం అని సిట్రిని రిపోర్ట్ . ఇదే మాట నేను 15 నెలలుగా చెబుతున్నా. రూపాయి విలువ ఇంకా దారుణంగా పడిపోతుంది అని రిపోర్ట్ . అందుకే బంగారం కొనండి. అప్పు చేసి కొనొద్దు . ఉన్న బంగారం అమ్మొద్దు .
2 . ఇల్లు కట్టుకోవాలి అంటే ఓకే. లేకపోతే ఖాళీ ఫ్లాట్స్, అపార్ట్ మెంట్ లో ప్లాట్స్ కొనద్దు. లక్షలాది మందికి ఉద్యోగాలు పొతే రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయి. బ్యాంకు రుణాలు కట్టలేక అనేక ఫ్లాట్స్, కార్లు బ్యాంకుల ద్వారా అమ్మకానికి వచ్చే పరిస్థితి.
3. పొదుపు చెయ్యండి.
కసిగా పొదుపు చెయ్యండి. తిండి, ఆరోగ్యం, బట్టలు.. పిల్లల చదువులు .. మిగతా అన్నీ ముఖ్యంగా వినియోగ వస్తువులు లగ్జరీ గూడ్స్ కొనొద్దు.
ఐదేళ్లు ఆదాయం అడుగంటి పోయినా బతకాలి.
క్యాష్, బంగారం, వెండి .. వీటికే విలువ.
ఇల్లు అమ్ముతాము అంటే కొనేవారు తక్కువయి పోతారు.
సంధి యుగంలో దిక్సూచి...
4. 15 నెలలుగా కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరుగుతూ చెబుతున్నా .
రాబొయ్యే రోజుల్లో కృత్రిమ మేథను నడిపేవారు, కృతిమ మేథ చేయలేని పనులు చేసేవారికే ఉద్యోగాలు.
కృతిమ మేథ చేయలేని పనులు ఏవి ? ఇలాంటి స్కిల్స్ పిల్లలలో ఎలా పెంచాలి ?
పైసా ఖర్చు లేకుండా వారిని స్కూల్ మార్చకుండా ఇంట్లోనే ఏమి చేయొచ్చో చెబుతున్నా.
బాలమిత్ర క్లాసులు.
ఇప్పటికి 65 చోట్ల .
త్వరలో మరికొన్ని చోట్ల . హాజరు కండి . ఉచితంగా నేర్చుకోండి . పిల్లల్ని కృతిమే మేథ యుగ ఛాంపియన్స్ గా నిలపండి .
ఎన్నో పోస్ట్లు పెడుతున్నా .
దేనికి నా పేరు పెట్టుకోను .
కానీ ఇది స్పెషల్ .
సంధి యుగంలో దిక్సూచి .
కాదనుకొంటే భవిష్యత్తు అంధకారం .
ఆనక మీ ఇష్టం .

