Money Saving Tips : కేవలం రూ.20 వేల శాలరీతో రూ.2.5 కోట్లు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?
Money Saving Tips : నెలనెలా కేవలం రూ.2,800 ఇన్వెస్ట్ చేయడంద్వారా ఏకంగా 2.5 కోట్లు సంపాదించవచ్చు. అతి తక్కువ సేవింగ్స్ తో అత్యధిక ఆదాయం పొందడం ఎలాగంటే…

తక్కువ శాలరీతోనే అద్భుతాాలు
Money Saving Tips : ఎంత చెట్టుకు అంత గాలి అంటుంటారు... ఇలాగే ఎంత సంపాదనకు అంత సేవింగ్. నెలనెలా లక్షలు సంపాదించేవారి ఖర్చులు అందుకు తగ్గట్లుగా ఉంటాయి... సేవింగ్స్ కూడా అలాగే ఉంటాయి. అయితే చాలిచాలని జీతం, సంపాదన కలిగినవారికి వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అవుతుంది. ఇలాంటివారు కాస్త తెలివిగా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే నెలనెలా కొంత డబ్బు సేవ్ చేయవచ్చు... ఈ డబ్బులే భవిష్యత్ వారిని లక్షాధికారులు, కోటీశ్వరులను చేస్తాయి.
రూ.20 వేల శాలరీతో కోట్లు సంపాదించవచ్చు
నెలకు కేవలం రూ.20 వేల శాలరీ కలిగినవారు కూడా జాగ్రత్తగా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే 30 ఏళ్లలో రూ.2.5 కోట్లు సంపాదించవచ్చు. అతి తక్కువ ఆదాయంతో వ్యక్తిగతంగా ఏలోటు లేకుండా జీవిస్తూనే కొంత డబ్బు పొదుపు చేయవచ్చు. ఇలా నెలకు కేవలం రూ.2800 ఆదాచేసి సరిగ్గా ఇన్వెస్ట్ చేయడంద్వారా 30 ఏళ్లలో రూ.2.5 కోట్లు సంపాదించవచ్చు. బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? సేవింగ్ డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
బడ్జెట్ ఇలా ప్లాన్ చేసుకొండి
మీరు జాబ్ చేస్తుంటే నెలనెలా శాలరీ, వ్యాపారం చేస్తుంటే ఆదాయం రూ.20,000 వస్తుందనుకుందాం. దాన్ని వ్యక్తిగత అవసరాలకు జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటే కొంతడబ్బు మిగిలించుకోవచ్చు. మంత్లీ ఖర్చులు ఇలా ప్లాన్ చేసుకొండి.
రూమ్ రెంట్ - రూ.5000
ఇతర ఇంటి ఖర్చులు (ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్లు వంటివి) - రూ.800
పెట్రోల్ ఆండ్ ట్రాన్స్ పోర్ట్ (బస్సు, ఆటో ఛార్జీలు) రూ.1200
ఫుడ్ ఆండ్ గ్రాసరీ - రూ.3000
వైఫై బిల్లు, ఫోన్ రీచార్జ్ కి - రూ.600
ఓటిటి సబ్ స్క్రిప్షన్ కు - రూ.300
బట్టలు - రూ.1400
హెల్త్ ఆండ్ టెర్మ్ ఇన్సూరెన్స్ - రూ.900
ఎమర్జెన్సీ ఫండ్ (సడన్ గా వచ్చే ఖర్చులు) - రూ.2800
పార్టీ ఆండ్ ఫన్ (వీకెండ్ ఎంజాయ్ కోసం) - రూ.1200
ఇలా వ్యక్తిగత అవసరాలకు రూ.20000 ఆదాయంలో రూ.17,200 ఖర్చు అవుతుంది. ఇలా నెలనెలా రూ.2,800 లు సేవ్ చేసుకోవచ్చు. ఖర్చులు పోగా మిగిలిన డబ్బులను జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్ లో కోట్లు కళ్లజూడవచ్చు.
సేవింగ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
రూ.20000 వేలలో ఖర్చులు పోగా మిగిలిన రూ.2800 లను ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇలా 12 శాతం రిటర్న్ వచ్చే ఫండ్స్ లో 10 శాతం స్టెప్ అప్ చేసి పెడితే 30 ఏళ్లలో 2.5 కోట్ల రూపాయలు అవుతాయి. ఇలా తెలివిగా ఆలోచిస్తే తక్కువ ఆదాయం కలిగినవారు కూడా అద్భుతాలు చేయవచ్చు.
గమనిక :
ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్ ఆధారంగా అందిస్తున్నాం. కాబట్టి డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలనేది వ్యక్తిగత నిర్ణయం. ఆర్థిక నిపుణుల సూచనలను బట్టి ఇన్వెస్ట్ చేస్తే మంచిది.

