Meta Layoff: 6 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ఫేస్ బుక్ సిద్ధం..తొలగని అమెరికా ఉద్యోగ సంక్షోభం..
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం అయినటువంటి తాజాగా 6000 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెలలోనే దీనికి సంబంధించిన ఓ కీలకమైన ప్రకటనను సంస్థ అధిపతి మార్క్ జూకర్బర్గ్ తీసుకోనున్నారని నెట్టింట లీకులు వైరల్ అవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ జాబ్స్ చేస్తున్న ఉద్యోగుల మెడపై ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది. ఇప్పటికే ట్విట్టర్ సంస్థ వేలాది మందిని ఇంటికి పంపించగా, అదే బాటలో దిగజా ఐటీ కంపెనీలు అయినా మెటా ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వాటి సంస్థలు లే ఆఫ్స్ పేరిట వేలాది మందిని ఇంటి బాట పట్టిస్తున్నాయి. అయితే తాజాగా మెటా సంస్థ సైతం మరో 6000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఫేస్బుక్ సంస్థలో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.
నిజానికి మెటా సంస్థలో ఇప్పటికే వేలాదిమందిని ఉద్యోగాల నుంచి తొలగించారు అయితే తాజాగా మరో 6000 మందిని సైతం తొలగించనున్నట్లు టెక్ వర్గాల్లో చర్చ మొదలైంది దీనికి సంబంధించిన వివరాలను ధృవీకరిస్తూ పలు పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా కంపెనీ గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ కంపెనీ సమావేశంలో ఉద్యోగులకు ఈ లే ఆఫ్ ల గురించి తెలియజేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Meta CEO మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవలే తదుపరి రౌండ్ తొలగింపులు మే 2023లో ప్రారంభమవుతాయని ప్రకటించనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు, దాని అధికారిక ప్రకటనకు ముందే, దాని సమాచారం ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. అయితే కంపెనీ ఇప్పుడు తొలగింపులకు ఎందుకు తెరలేపింది. ఇంతకు ముందు జరిగిన లే ఆఫ్ లలో ఎంత మంది ఉద్యోగులను మెటా తొలగించవలసి వచ్చిందో తెలుసుకుందాం. గత 2 సంవత్సరాలలో Meta చేసిన తొలగింపుల వివరాలను తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, రాబోయే వారం రోజుల్లో దాదాపు 6,000 మంది ఉద్యోగులను మెటా నుండి తొలగించనున్నారు. కంపెనీ నవంబర్‌లో 11,000 మంది ఉద్యోగులను తొలగించింది , మార్చి 2023లో 10,000 ఉద్యోగాల కోతలను ప్రకటించింది. ఫేస్‌బుక్ , మాతృ సంస్థ అయిన మెటా 4,000 మంది ఉద్యోగులను తొలగించింది, అంటే మేలో నిష్క్రమించమని అడిగే జాబితాలో మరో 6,000 మంది ఉన్నారు.
గతంలో 11 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు..
ముందుగా ఏప్రిల్‌లో, కంపెనీ పనితీరును సరిదిద్దడానికి జట్టులో కొన్ని మార్పులు చేయడానికి అనేక వేల మంది ఉద్యోగులకు మార్గం చూపాలని జుకర్‌బర్గ్ మెటాను కోరారు. మార్చిలో కంపెనీ ఖర్చును తగ్గించడానికి 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించారు. ఇప్పుడు తాజా రిట్రెంచ్‌మెంట్‌లో 6,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతారు. నవంబర్‌లో 2022లో మెటా ద్వారా అతిపెద్ద లేఆఫ్ జరిగింది. కంపెనీ 11,000 మందిని తొలగించింది. అటువంటి పరిస్థితిలో, మెటా వర్క్ ఫోర్స్ 13 శాతం తగ్గింది.