MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Careers
  • Best Courses : ఇంటర్ తర్వాత ఈ కోర్సులు చేశారో పక్కా జాబ్... లక్షల్లో శాలరీ..!

Best Courses : ఇంటర్ తర్వాత ఈ కోర్సులు చేశారో పక్కా జాబ్... లక్షల్లో శాలరీ..!

త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ (12వ తరగతి) పలితాలు రానున్నాయి. కెరీర్‌లో త్వరగా సెటిల్ అవ్వాలంటే ఏ కోర్స్ చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ కథనం మీకోసమే. ఇంటర్ తర్వాత చేయగలిగే 10 బెస్ట్ కెరీర్ ఓరియెంటెడ్ కోర్సుల గురించి తెలుసుకోండి. 

3 Min read
Author : Arun Kumar P
Published : Apr 01 2026, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇంటర్ తర్వాత చేయాల్సిన కోర్సులివే..
Image Credit : Getty

ఇంటర్ తర్వాత చేయాల్సిన కోర్సులివే..

పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ లో ఏ కోర్సులో చేయాలనే కన్ఫ్యూజన్. ఇంటర్ పూర్తయ్యాక కూడా ఈ కన్ఫ్యూజన్ చాలామంది విద్యార్థుల్లో ఉంటుంది. అయితే ఇంటర్ తర్వాత తీసుకునే స్టెప్ చాలా కీలకమైంది. ఈ క్రమంలో ఇంటర్ తర్వాత చేయగలిగే 10 బెస్ట్ కెరీర్ ఓరియెంటెడ్ కోర్సులు ఇవే…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్‌మెంట్
Image Credit : Getty

డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్‌మెంట్

1. డిజిటల్ మార్కెటింగ్ కోర్సు

ఆన్‌లైన్ ప్రపంచంలో కెరీర్ కావాలంటే డిజిటల్ మార్కెటింగ్ బెస్ట్... ఇది వేగంగా ఎదుగుతున్న రంగం. SEO, సోషల్ మీడియా, గూగుల్ యాడ్స్ నేర్చుకుంటే కేవలం 3-6 నెలల్లోనే జాబ్ కొట్టొచ్చు. NIIT లేదా UpGrad వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఈ కోర్సు చేయొచ్చు. ఫీజు సుమారు రూ.30,000 నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది. మొదట్లో నెలకు రూ.15-30 వేల జీతం వస్తుంది. కానీ 2-3 ఏళ్లలో ఇది రూ.60 వేలకు పైగా పెరుగుతుంది.

2. వెబ్ డెవలప్‌మెంట్

కోడింగ్ నేర్చుకుని వెబ్‌సైట్లు తయారు చేయడం ఇప్పుడు గోల్డెన్ స్కిల్. 6-12 నెలల్లో మీరు ఫ్రంటెండ్ లేదా ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వొచ్చు. Coursera, Udemy లాంటి చోట్ల ఈ కోర్సు చేయొచ్చు. ఫీజు రూ.20,000 నుంచి రూ.1.5 లక్షల వరకు ఉంటుంది. ప్రారంభ జీతం రూ.20-40 వేలు, అనుభవంతో రూ.1 లక్ష దాటుతుంది.

36
గ్రాఫిక్ డిజైనింగ్, ఎయిర్ హోస్టెస్
Image Credit : Getty

గ్రాఫిక్ డిజైనింగ్, ఎయిర్ హోస్టెస్

3. గ్రాఫిక్ డిజైనింగ్

క్రియేటివ్‌గా ఆలోచించేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. లోగోలు, పోస్టర్లు, యాడ్స్ డిజైన్ చేయడం నేర్చుకుని ఫ్రీలాన్సింగ్ లేదా కంపెనీలో జాబ్ చేయొచ్చు. 3-6 నెలల కోర్సుకి ఫీజు రూ.15,000-80,000 వరకు ఉంటుంది. మొదట్లో రూ.15-25 వేలు, ఫ్రీలాన్సింగ్‌లో ప్రాజెక్ట్‌ను బట్టి రూ.50 వేలకు పైగా సంపాదించొచ్చు.

4. ఎయిర్ హోస్టెస్ / ఏవియేషన్ కోర్సు

ట్రావెలింగ్, గ్లామరస్ కెరీర్ ఇష్టమైతే ఏవియేషన్ అద్భుతమైన ఆప్షన్. Indira Gandhi Institute of Aeronautics లాంటి సంస్థల్లో 1-2 ఏళ్ల కోర్సు చేయొచ్చు. ఫీజు రూ.1-2 లక్షల వరకు ఉంటుంది. ఎయిర్‌లైన్స్‌లో జాబ్ వస్తే ప్రారంభ జీతమే రూ.40,000-80,000 వరకు ఉంటుంది.

46
హోటల్ మేనేజ్‌మెంట్, నర్సింగ్
Image Credit : Getty

హోటల్ మేనేజ్‌మెంట్, నర్సింగ్

5. హోటల్ మేనేజ్‌మెంట్

హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. 3 ఏళ్ల డిప్లొమా లేదా డిగ్రీ చేస్తే హోటల్, రిసార్ట్ లేదా క్రూజ్‌లో జాబ్ వస్తుంది. Institute of Hotel Management లాంటి చోట్ల కోర్సు చేస్తే ఫీజు రూ.1–3 లక్షల వరకు ఉంటుంది. ప్రారంభ జీతం రూ.20–35 వేలు, ఇంటర్నేషనల్ జాబ్స్‌లో లక్షల్లో సంపాదించొచ్చు.

6. ANM/GNM (నర్సింగ్)

మెడికల్ ఫీల్డ్‌లో త్వరగా జాబ్ కావాలంటే నర్సింగ్ బెస్ట్. ANM (2 ఏళ్లు), GNM (3 ఏళ్లు) కోర్సులు ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు రూ.50,000 నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. హాస్పిటల్స్, క్లినిక్స్‌లో జాబ్ వస్తుంది. జీతం రూ.20–40 వేలతో మొదలవుతుంది.

56
డేటా ఎంట్రీ, ఫ్యాషన్ డిజైనింగ్
Image Credit : Getty

డేటా ఎంట్రీ, ఫ్యాషన్ డిజైనింగ్

7. డేటా ఎంట్రీ/ఆఫీస్ అడ్మిన్ కోర్సు

తక్కువ టైంలో జాబ్ కోసం ఇది సులువైన ఆప్షన్. 3–6 నెలల్లో కంప్యూటర్, ఎక్సెల్, టైపింగ్ నేర్చుకోవచ్చు. ఫీజు రూ.10,000–30,000 వరకు ఉంటుంది. ప్రారంభ జీతం రూ.12–20 వేలు, అనుభవంతో రూ.30 వేల వరకు పెరుగుతుంది.

8. ఫ్యాషన్ డిజైనింగ్

మీకు బట్టలు, ట్రెండ్స్‌పై ఆసక్తి ఉంటే ఇది సూపర్ కెరీర్. National Institute of Fashion Technology (NIFT) లాంటి చోట్ల కోర్సు చేస్తే మంచి ఎక్స్‌పోజర్ వస్తుంది. ఫీజు రూ.1–3 లక్షల వరకు ఉంటుంది. జీతం మొదట్లో రూ.20–40 వేలు, సొంత బ్రాండ్ పెడితే లక్షల్లో సంపాదించొచ్చు.

66
ఎలక్ట్రీషియన్, ఫార్మసీ
Image Credit : X/tomcom_gmts

ఎలక్ట్రీషియన్, ఫార్మసీ

9. ఎలక్ట్రీషియన్ / టెక్నికల్ ITI కోర్సు

టెక్నికల్ స్కిల్స్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ITIలో 1–2 ఏళ్ల కోర్సు చేసి త్వరగా జాబ్ సంపాదించొచ్చు. ఫీజు రూ.10,000–50,000 వరకు ఉంటుంది. ప్రారంభ జీతం రూ.15–25 వేలు, అనుభవంతో రూ.40 వేలకు పైగా సంపాదించొచ్చు.

10. ఫార్మసీ (D.Pharm)

మీరు మెడికల్ లైన్‌లో వెళ్లాలి కానీ డాక్టర్ చదివేంత స్తోమత లేదు అనుకుంటే D.Pharm మంచి ఆప్షన్. ఇది 2 ఏళ్ల కోర్సు. ఫీజు రూ.1–2 లక్షల వరకు ఉంటుంది. మెడికల్ స్టోర్, హాస్పిటల్స్‌లో జాబ్ వస్తుంది. జీతం రూ.20–35 వేలతో మొదలవుతుంది.

ఈ రోజుల్లో స్మార్ట్ స్టూడెంట్ అంటే త్వరగా స్కిల్స్ నేర్చుకుని, సంపాదన మొదలుపెట్టేవాళ్లే. ఈ 10 కోర్సులు మిమ్మల్ని ఎక్కువ కాలం చదువులో ఇరికించవు. పైగా త్వరగా జాబ్, మంచి జీతం వచ్చే దారి చూపిస్తాయి. ఇంటర్ తర్వాత సరైన దారి ఎంచుకుంటే, 2-3 ఏళ్లలోనే మీ కాళ్లపై మీరు నిలబడి మంచి కెరీర్ నిర్మించుకోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
విద్య
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విశాఖపట్నం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే
Recommended image2
Free Education: ఉచిత విద్యను అందించే దేశాలు.. ఇక్కడ ఫ్రీగా చదువుకోవచ్చని మీకు తెలుసా?
Recommended image3
Indian IT jobs Australia vs Switzerland: మనోళ్లకు జాబ్స్, లైఫ్ సెటిల్‌మెంట్ కోసం ఏ దేశం బెస్ట్?
Related Stories
Recommended image1
Railway Jobs : తెలుగు యువతకు బంపరాఫర్... పదో తరగతి పాసైతే చాలు ప్రభుత్వ ఉద్యోగం
Recommended image2
Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... 2,929 ఉద్యోగాల భర్తీ, అర్హతలుంటే ఓ ఉద్యోగం మీదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved