MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • Remote: ఏసీ రిమోట్ ఎందుకు తెల్లగా ఉంటుంది, టీవీ రిమోట్ ఎందుకు నల్లగా ఉంటుంది?

Remote: ఏసీ రిమోట్ ఎందుకు తెల్లగా ఉంటుంది, టీవీ రిమోట్ ఎందుకు నల్లగా ఉంటుంది?

Remote: చాలా మంది ఇళల్లో టీవీ, ఏసీ కామన్‍గా ఉంటాయి. కానీ ఎప్పుడైనా గమనించారా? టీవీ రిమోట్లు నల్లగా ఉంటాయి, ఏసీ రిమోట్లు తెల్లగా, లేదా క్రీమ్ కలర్ లో ఉంటాయి. అసలు దీని వెనుక కారణమెంటో తెలుసా? 

2 Min read
Author : Nandini Arava
Published : May 25 2026, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రిమోట్ల డిజైన్ల వెనుక కారణం
Image Credit : chatgpt

రిమోట్ల డిజైన్ల వెనుక కారణం

ఎలక్రానిక్ పరికరాల డిజైన్‍లో ప్రతి దాని వెనుక ఒక కారణముంటుంది. దాని ఆకృతైనా, దాని కలరైనా ఏదైనా సరే..ఒక సైన్స్ ఉంటుంది. కేవలం డిజైన్ కోసం చేసిన ఎంపిక మాత్రమే కాదు. ఏసీ రిమోట్ గురించి చూస్తే.. ఎక్కువ శాతం ఎయిర్ కండీషనర్లు తెలుపు రంగులోనే తయారవుతాయి. గోడకు అమర్చే ఇండోర్ యూనిట్ కూడా తెల్లగా ఉంటుంది. అందుకే దానికి సరిపోయేలా రిమోట్‌ను కూడా అదే రంగులో డిజైన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మొత్తం ఉత్పత్తి ఒకే స్టైల్‌లో కనిపిస్తుంది. ఇది ఇంటీరియర్ డిజైన్‌కు కూడా బాగా సరిపోతుంది. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లు, ఆఫీస్ గదుల్లో లైట్ కలర్స్ ప్రశాంతతను కలిగిస్తాయని డిజైనర్లు భావిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏసీ రిమోట్ తెల్లగా ఉండటం వల్ల వేడెక్కదు
Image Credit : Pixabay

ఏసీ రిమోట్ తెల్లగా ఉండటం వల్ల వేడెక్కదు

మరో ముఖ్యమైన కారణం వేడి. తెలుపు రంగు వేడిని తక్కువ లాగుతుంది. బ్లాక్ అయితే వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. ఏసీ రిమోట్లు ఎక్కువసేపు గదిలోనే ఉన్నా, కొన్ని సందర్భాల్లో కిటికీ దగ్గర లేదా వెలుతురు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వేడి పడే అవకాశం ఉంటుంది. తెల్ల రంగు ఉండడం వల్ల రిమోట్ ఎక్కువగా వేడెక్కకుండా సహాయపడుతుంది.

Related Articles

Related image1
Gold Rate Hike: హైదరాబాద్‌లో పసిడి రేట్ల జోరు.. మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్
Related image2
Garlic Chicken: మీకిష్టమైన వాళ్లకి ఈ చికెన్ రెసిపీ చేసి పెట్టండి..తిన్న వెంటనే ఫిదా అయిపోతారు
34
బ్లాక్ అయితే నంబర్స్ త్వరగా కనిపిస్తాయి
Image Credit : chatgpt

బ్లాక్ అయితే నంబర్స్ త్వరగా కనిపిస్తాయి

ఇక టీవీ రిమోట్‌ల విషయానికి వస్తే.. అవి సాధారణంగా బ్లాక్ కలర్ లో ఉంటుంది. దీనికి మెయిన్ కారణం వాడే విధానం. టీవీ రిమోట్‌ను రోజుకు ఎన్నోసార్లు చేతితో తాకుతాం, ఇంట్లో ఉండేవాళ్లంతా ఎక్కడెక్కడో తిరిగొచ్చి పట్టుకుంటారు. దాంతో చేతిలోని దుమ్ము, చెమట, ఆయిల్ మరకలు రిమోట్‍పై త్వరగా పడతాయి. బ్లాక్ కలర్ అయితే ఇవి అంతగా కనిపించవు. అందుకే కంపెనీలు ఎక్కువగా డార్క్ కలర్స్‌ను ఎంచుకుంటాయి. 

44
కంపెనీల స్ట్రాటజీ
Image Credit : Gemini AI

కంపెనీల స్ట్రాటజీ

అలాగే టీవీ రిమోట్‌లు ఎక్కువ బటన్లు ఉంటాయి. వాటిపై అక్షరాలు, నంబర్లు స్పష్టంగా కనిపించడానికి బ్లాక్ కలర్ పెడతారు. దీంతో బటన్లు గుర్తించడానికి సులభమవుతుంది. బ్లాక్ కలర్ సాధారణంగా టెక్నాలజీ, పవర్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను సూచిస్తుంది. అందుకే టీవీలు, సౌండ్ సిస్టమ్‌లు, సెటాప్ బాక్స్‌లు ఎక్కువగా నల్ల రంగులో కనిపిస్తాయి. వాటికి మ్యాచ్ అయ్యేలా రిమోట్‌లను కూడా అదే కలర్‌లో తయారు చేస్తారు. అన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ రంగులను ఎంపిక చేస్తుంటాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: అమెరికా-ఇరాన్ మధ్య ట్యాంకర్ వార్....కుప్పకూలిన పసిడి, వెండి..ఎంతంటే?
Recommended image2
PM Viksit Bharat Rozgar Yojana: ఉద్యోగులకు ఫ్రీగా 15 వేలు.. ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్.. వెంటనే ఇలా చేయండి
Recommended image3
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Related Stories
Recommended image1
Gold Rate Hike: హైదరాబాద్‌లో పసిడి రేట్ల జోరు.. మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్
Recommended image2
Garlic Chicken: మీకిష్టమైన వాళ్లకి ఈ చికెన్ రెసిపీ చేసి పెట్టండి..తిన్న వెంటనే ఫిదా అయిపోతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved