MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • EPFO: ఈపీఎఫ్‌లో మ‌రో కొత్త ఆప్ష‌న్‌.. రిటైర్మెంట్ త‌ర్వాత SWP విధానం అమ‌లు

EPFO: ఈపీఎఫ్‌లో మ‌రో కొత్త ఆప్ష‌న్‌.. రిటైర్మెంట్ త‌ర్వాత SWP విధానం అమ‌లు

EPFO: EPF చందాదారులకు ప్రయోజనం కలిగించేలా EPFO కీలక మార్పులకు సిద్ధమవుతోంది. రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్‌ మొత్తాన్ని ఒకేసారి కాకుండా విడతలవారీగా పొందేలా సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) తీసుకురావాలని ప్రతిపాదించింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 19 2026, 03:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
EPFO కొత్తగా తీసుకురానున్న SWP అంటే ఏంటి?
Image Credit : Gemini AI సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

EPFO కొత్తగా తీసుకురానున్న SWP అంటే ఏంటి?

సాధారణంగా ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత తమ పీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని ఒకేసారి తీసుకుంటారు. అయితే పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వచ్చినప్పుడు దానిని ఎలా వినియోగించుకోవాలో తెలియక కొందరు ఇతర పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటున్నారు. వీటిలో రిస్క్ ఉండే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈపీఎఫ్‌వో కొత్త విధానాన్ని పరిశీలిస్తోంది. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా రిటైర్మెంట్ సమయంలో ఉన్న పీఎఫ్ నిధిని ఒకేసారి కాకుండా కొంతకొంతగా తీసుకోవచ్చు. దీనివల్ల పదవీ విరమణ తర్వాత నెలవారీ ఖర్చులకు అవసరమైన డబ్బును క్రమం తప్పకుండా పొందే వీలుంటుంది. అదే సమయంలో ఖాతాలో మిగిలిన మొత్తంపై ఈపీఎఫ్ వడ్డీ కొనసాగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నెలకు, మూడు నెలలకు లేదా ఏడాదికోసారి డబ్బులు తీసుకోవచ్చు
Image Credit : Asianet News

నెలకు, మూడు నెలలకు లేదా ఏడాదికోసారి డబ్బులు తీసుకోవచ్చు

ఈ ప్రతిపాదిత పథకంలో చందాదారులకు ఉపసంహరణ విషయంలో వెసులుబాటు కల్పించనున్నారు. తమ అవసరాలను బట్టి ఎంత మొత్తాన్ని, ఎప్పుడు తీసుకోవాలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ప్రతి నెలా కొంత మొత్తం విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. మూడు నెలలకు ఒకసారి డబ్బులు పొందవచ్చు. ఆరు నెలలకు ఒకసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏడాదికి ఒకసారి నిర్ణీత మొత్తాన్ని తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో తన పీఎఫ్ ఖాతాలో రూ.30 లక్షలు ఉన్నాయని అనుకుందాం. ఆ మొత్తాన్ని పూర్తిగా తీసుకోకుండా, తన అవసరాలకు అనుగుణంగా విడతలవారీగా పొందవచ్చు. ఇలా డబ్బులు తీసుకున్న తర్వాత ఖాతాలో మిగిలిన నిధిపై వర్తించే ఈపీఎఫ్ వడ్డీ కొనసాగుతుంది. అయితే ఉపసంహరణ పరిమితులు, ఇతర నిబంధనలపై తుది నిర్ణయం రావాల్సి ఉంది.

35
మధ్యలోనే పథకం నుంచి బయటకు వచ్చే అవకాశం
Image Credit : chatgpt

మధ్యలోనే పథకం నుంచి బయటకు వచ్చే అవకాశం

SWP విధానంలో చేరిన తర్వాత తప్పనిసరిగా నిర్ణీత కాలం వరకు కొనసాగాల్సిన అవసరం ఉండదని ప్రతిపాదనలో పేర్కొంటున్నారు. చందాదారుడు ఎప్పుడైనా ఈ పథకం నుంచి వైదొలగి, ఖాతాలో మిగిలిన మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించనున్నారు. అంతేకాకుండా, పథకం ద్వారా డబ్బులు పొందుతున్న సమయంలో సభ్యుడు మరణిస్తే మిగిలిన నిధిని జీవిత భాగస్వామి లేదా నామినీకి అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీనివల్ల ఉద్యోగి మరణించినా పీఎఫ్ పొదుపులకు సంబంధించిన ప్రయోజనాలు కుటుంబ సభ్యులకు అందే అవకాశం ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన తుది నిబంధనలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

45
పీఎఫ్ ఖాతాలో అదనపు డబ్బులు జమ చేసుకోవచ్చా?
Image Credit : Google

పీఎఫ్ ఖాతాలో అదనపు డబ్బులు జమ చేసుకోవచ్చా?

ఈ ప్రతిపాదనలో మరో ఆసక్తికరమైన అంశం స్వచ్ఛంద అదనపు చందాలు. ప్రస్తుతం ఉద్యోగి, యజమాని తమ నిబంధనల ప్రకారం పీఎఫ్‌కు కంట్రిబ్యూషన్ చెల్లిస్తారు. అయితే కొత్త విధానంలో ఉద్యోగులు తమకు వీలైనప్పుడు అదనపు మొత్తాన్ని నేరుగా పీఎఫ్ ఖాతాలో జమ చేసుకునే అవకాశాన్ని కూడా ఈపీఎఫ్‌వో పరిశీలిస్తోంది. దీనికోసం ప్రత్యేక డిజిటల్ చెల్లింపు విధానాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ విధంగా ఉద్యోగి తన సొంత డబ్బును అదనంగా జమ చేసుకోవచ్చు. ఈ మొత్తానికి యజమాని కూడా సమానంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీర్ఘకాలంలో తమ రిటైర్మెంట్ పొదుపును పెంచుకోవాలనుకునే వారికి ఈ వెసులుబాటు ఉపయోగపడే అవకాశం ఉంది.

55
ప్రస్తుతం PF డబ్బుల ఉపసంహరణ నిబంధనలు ఎలా ఉన్నాయి?
Image Credit : Asianet News

ప్రస్తుతం PF డబ్బుల ఉపసంహరణ నిబంధనలు ఎలా ఉన్నాయి?

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఉద్యోగులు తమ వయసు, పదవీ విరమణ పరిస్థితులను బట్టి పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. 55 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసులో రిటైర్ అయ్యే సభ్యులు తమ ఖాతాలోని పూర్తి మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉంది. 55 ఏళ్లలోపు ఉద్యోగ విరమణ చేసినవారు వెంటనే 75 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 25 శాతాన్ని 12 నెలల తర్వాత పొందవచ్చు. మరోవైపు, సాధారణంగా 58 ఏళ్ల వయసు నుంచి ఈపీఎస్ పెన్షన్ ప్రయోజనాలు అందుతాయి.

కొత్త SWP విధానాన్ని అమలు చేయడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ స్కీమ్‌లో సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో చర్చించనున్నారు. బోర్డు నిర్ణయం, తదుపరి అధికారిక ఆమోదాల తర్వాతే ఈ పథకం అమలు, ఉపసంహరణ పరిమితులు, ఇతర నిబంధనలపై స్పష్టత రానుంది. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
 
27th T20 • WBBLT20
Live
BH-WBH-W
(20.0 ov)225/3
ST-WST-W
(7.0 ov)62/2
ST-W need 164 runs in 78 balls
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Stumps
NZNZ
(82.0 ov)243/5
INDIND
-
Day 1
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Live
PAKPAK
325
SLSL
(79.0 ov) 98 & 262/6
Day 3 - Session 3
Schedule ›
28th T20 • WBBLT20
AS-WAS-W
Fri, 20 Nov, 2026
MR-WMR-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Petrol Bunk: ఒక పెట్రోల్ బంక్ నెలకు ఎంత సంపాదిస్తుంది? కోట్లలో లాభాలు నిజమేనా?
Recommended image2
Gold Silver Price Crash: అమెరికాలో ముదురుతున్న ద్రవ్యోల్బణం..కుదేలవుతున్న పసిడి, వెండి
Recommended image3
Gold: బంగారం ఎలా కొంటే లాభం? గోల్డ్ ETF నుంచి జ్యువెలరీ స్కీమ్స్ వరకు.. అసలు లెక్క ఇదే!
Related Stories
Recommended image1
రాహుల్ గాంధీ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఆమెనా.? మొద‌టిసారి ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఓపెన్ అయిన రాహుల్
Recommended image2
మొన్న‌టి వ‌ర‌కు సైబ‌ర్ నేరాల‌కు ప్ర‌సిద్ధి.. నేడు జీడిప‌ప్పుకు కేరాఫ్ అడ్ర‌స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved