మరో కొత్త ఫీచర్.. ఇకపై వాట్సాప్‌లోనే మొబైల్ రీఛార్జ్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
WhatsApp: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లు తీసుకురావడమే దీనికి కారణం. కాగా తాజాగా వాట్సాప్‌లో మరో ఆసక్తికర ఫీచర్ వచ్చేసింది.

వాట్సాప్‌లో రీచార్జ్ సదుపాయం
ఇప్పటి వరకు రీచార్జ్ కోసం వేరే యాప్‌లు లేదా వెబ్‌సైట్లకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వాట ద్వారా నేరుగా మొబైల్ రీచార్జ్ చేసుకునే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు వాట్సాప్ యాప్‌లోనే ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం కోసం వాట్సాప్, పేయూ అనే పేమెంట్ కంపెనీతో కలిసి పనిచేస్తోంది.
ఏయే టెలికం కంపెనీలంటే
వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ సహాయంతో జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి ప్రముఖ టెలికాం నెట్‌వర్క్‌ల ప్రీపెయిడ్ వినియోగదారులు తమ ప్లాన్లను సులభంగా ఎంచుకుని రీచార్జ్ చేసుకోవచ్చు. ఇది రోజువారీ అవసరాన్ని మరింత వేగంగా పూర్తి చేసేలా చేస్తుంది.
సులభమైన యాక్సెస్
వాట్సాప్ హోమ్ స్క్రీన్‌లో కనిపించే ఇప్పుడు ₹ (రూపాయి) సింబల్‌ను క్లిక్ చేయాలి. దానిపై ట్యాప్ చేస్తే పేమెంట్స్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచే మొబైల్ రీచార్జ్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. కేవలం రీఛార్జ్ మాత్రమే కాకుండా మెట్రో వంటి పలు టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు.
రీచార్జ్ చేసే విధానం
* వాట్సాప్‌లో రీఛార్జ్ చేయడం కోసం ముందుగా ₹ ఐకాన్‌పై ట్యాప్ చేయండి.
* తర్వాత మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* రీఛార్జ్ చేయాలనుకుంటున్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
* ఆ తర్వాత సంబంధిత టెలికాం ఆపరేటర్‌ను కన్ఫర్మ్ చేయండి.
* మీకు కావాల్సిన ప్లాన్ ఎంచుకోండి.
* చివరికిగా UPI లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయండి.
* పేమెంట్ కన్ఫర్మ్ చేయండి, కొన్ని సెకన్లలోనే రీచార్జ్ పూర్తవుతుంది.

