100 గజాల స్థలం ఉంటే చాలు నెలకు రూ. 30 వేలు సంపాదించొచ్చు.. ఆలోవెరతో అద్భుతాలు
Business Ideas: వినూత్న మార్గంలో వ్యాపారాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. అలాంటి బిజినెస్ ఐడియాల్లో ఆలోవెర సాగు ఒకటి. ఇంతకీ సాగు ఎలా చేపడతారు.? లాభాలు ఎలా ఉంటాయంటే.

ఆలోవెర అంటే ఏమిటి? ఎందుకు అంత డిమాండ్?
ఆలోవెర (కలబంద) ఒక సక్కులెంట్ ప్లాంట్. ఇది తక్కువ నీటితో పెరుగుతుంది. ఆరోగ్య, ఔషధ, కాస్మెటిక్ రంగాల్లో దీని డిమాండ్ చాలా ఎక్కువ. ఆలోవెర ఆకులో ఉన్న జెల్ చర్మ సమస్యలు, గాయాలు, కాలిన గాయాలు, జీర్ణ సమస్యలకు ఉపయోగపడుతుంది. అందుకే ఔషధ కంపెనీలు, కాస్మెటిక్ కంపెనీలు భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సహజ ఉత్పత్తులపై ప్రజల ఆసక్తి పెరగడంతో ఆలోవెర మార్కెట్ కూడా వేగంగా పెరుగుతోంది.
ఆలోవెర సాగు ఎలా చేయాలి?
ఆలోవెర సాగు చాలా సులభం. కొత్తగా ప్రారంభించే వాళ్లకు కూడా ఇది మంచి ఆప్షన్. ఇది ఎండ ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. ఇది పెరగడానికి ఇసుక మిశ్రమ మట్టి లేదా లోమ్ సాయిల్ సరిపోతుంది. ఈ సాగుకు ఎక్కువ నీరు అవసరం లేదు. కలబందను రూట్ సక్కర్లు లేదా కట్ చేసిన మొక్కలు నాటాలి. ఒక్కో మొక్కకు 2 అడుగుల దూరం సరిపోతుంది. ఆర్గానిక్ ఫర్టిలైజర్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఒకసారి నాటితే 3–5 సంవత్సరాల వరకు పంట ఇస్తుంది.
ఎకరానికి ఎంత ఉత్పత్తి అవుతుంది.?
ఆలోవెర సాగు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఒక ఎకరానికి సుమారు 15–30 టన్నుల వరకు ఉత్పత్తి వస్తుంది. మార్కెట్‌లో ఒక టన్ను ధర రూ. 15,000 – రూ. 20,000 వరకు ఉంటుంది. పెట్టుబడి తక్కువగా ఉండటం వల్ల లాభం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా రూ. 40,000 పెట్టుబడితో సంవత్సరానికి రూ. 5–6 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. ప్రాసెసింగ్ చేసి జ్యూస్ లేదా జెల్‌గా అమ్మితే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది.
100 గజాల్లో ఆలోవెర పెంచితే లాభం ఎలా?
100 గజాలు అంటే చిన్న స్థలం అయినా కూడా మంచి ఆదాయం పొందొచ్చు. 100 గజాల్లో సుమారు 150–200 మొక్కలు నాటవచ్చు. ఒక్క మొక్క నుంచి ఏడాదికి 3–4 సార్లు ఆకులు కోయొచ్చు. మొత్తం ఏడాదికి సుమారు 300–400 కిలోల ఆకు ఉత్పత్తి వస్తుంది. లాభాల విషయానికొస్తే నేరుగా ఆకులు అమ్మితే రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు పొందొచ్చు. అదే జెల్ తీసి అమ్మితే రూ. 15,000 నుంచి రూ. 25,000 వరకు లభిస్తుంది. జ్యూస్ చేసి అమ్మితే రూ. 30 వేలకిపైగా లాభాలు పొందొచ్చు.
మార్కెటింగ్, వ్యాపార అవకాశాలు
ఆలోవెర బిజినెస్‌లో డబ్బు సంపాదించాలంటే మార్కెటింగ్ ముఖ్యం. ఔషధ కంపెనీలకు సరఫరా చేయొచ్చు. పతంజలి వంటి కంపెనీలతో కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయొచ్చు. లోకల్ మార్కెట్‌లో నేరుగా అమ్మొచ్చు. జెల్, జ్యూస్, క్రీమ్స్ తయారు చేసి బ్రాండ్‌గా అమ్మొచ్చు. ఆలోవెర నుంచి జ్యూస్, క్రీమ్స్, షాంపూలు, లోషన్స్, మెడిసిన్స్ తయారవుతాయి. ఈ కారణంగానే దీనికి డిమాండ్ పెరుగుతోంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఇందులో పేర్కొన్న లాభాలు పరిస్థితులు బట్టి మారుతుంటాయి. ఈ వ్యాపారం మొదలు పెట్టే ముందు ఈ రంగంలో అప్పటికే అనుభవం ఉన్న వారిని సంప్రదించడం ఉత్తమం.

