MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • ATM కార్డు పోగొట్టుకున్నారా.? వెంట‌నే చేయాల్సిన ప‌ని ఇదే. లేదంటే అంతే సంగ‌తులు..

ATM కార్డు పోగొట్టుకున్నారా.? వెంట‌నే చేయాల్సిన ప‌ని ఇదే. లేదంటే అంతే సంగ‌తులు..

ATM: షాపింగ్, హోటల్ బిల్లులు, ఆన్‌లైన్ కొనుగోళ్లు, ట్రావెల్ బుకింగ్‌లు వంటి అనేక చెల్లింపులు కార్డుల ద్వారానే జరుగుతున్నాయి. అయితే కార్డు పోయినా, వేరే వారి చేతిలో ప‌డ్డ ఇబ్బందులు త‌ప్ప‌వు. మ‌రి అలాంట‌ప్పుడు ఏం చేయాలంటే.?

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 05 2026, 02:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కార్డు పోయిన బ్లాక్ చేయాలి
Image Credit : Gemini AI

కార్డు పోయిన బ్లాక్ చేయాలి

డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పోయిన‌ వెంటనే దాన్ని బ్లాక్ చేయడం అత్యంత ముఖ్యమైన పని. ఎందుకంటే కార్డు వివరాలు, CVV నంబర్ వంటి సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ లావాదేవీల కోసం కార్డు వివరాలు ఉంటే స‌రిపోతుంది, అలాంటి సంద‌ర్భంలో మోసగాళ్లు మీ ఖాతాలోని డ‌బ్బులు ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంటుంది. అలాగే ATM పిన్ కూడా తెలిసిపోయినట్లయితే నేరుగా నగదు విత్‌డ్రా చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కార్డు పోయిందని గుర్తించిన వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వడం లేదా స్వయంగా కార్డును బ్లాక్ చేయడం తప్పనిసరి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కార్డు దుర్వినియోగం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి?
Image Credit : Asianet News

కార్డు దుర్వినియోగం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి?

కార్డు తప్పు వ్యక్తుల చేతికి వెళ్తే ఆన్‌లైన్ షాపింగ్, సర్వీసుల కొనుగోలు, ఇతర ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు కూడా కార్డును ఉపయోగించే ప్రమాదం ఉంది. ఇలాంటి లావాదేవీలు మీ పేరుతో నమోదవుతాయి కాబట్టి తర్వాత వాటిని నిరూపించుకోవడం ఇబ్బందిగా మారవచ్చు. అందువల్ల కార్డు పోయిన వెంటనే చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక నష్టంతో పాటు ఇతర సమస్యలను కూడా నివారించవచ్చు.

35
మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా కార్డును ఎలా బ్లాక్ చేయాలి?
Image Credit : Asianet News

మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా కార్డును ఎలా బ్లాక్ చేయాలి?

ప్రస్తుతం దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులు తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా కార్డు బ్లాక్ చేసే సదుపాయాన్ని అందిస్తున్నాయి. ముందుగా మీ బ్యాంక్ యాప్‌లో లాగిన్ కావాలి. తర్వాత "Cards" లేదా "Card Services" విభాగంలోకి వెళ్లాలి. అక్కడ మీ ఖాతాకు లింక్ అయిన‌ అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులు కనిపిస్తాయి. చివరి నాలుగు అంకెల ఆధారంగా సంబంధిత కార్డును ఎంపిక చేసుకోవాలి. అనంతరం "Manage Card", "Block Card" లేదా "Support" వంటి ఆప్షన్లలోకి వెళ్లి "Permanent Block" ఎంపికను ఎంచుకోవాలి. అభ్యర్థనను ధృవీకరించిన వెంటనే కార్డు బ్లాక్ అవుతుంది. ఆ తర్వాత కొత్త కార్డు కోసం కూడా అదే యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కార్డు బ్లాక్ అయినట్లు SMS లేదా ఈ-మెయిల్ ద్వారా బ్యాంకు నుంచి నిర్ధారణ సందేశం వస్తుంది.

45
ఇంటర్నెట్ లేకపోతే SMS ద్వారా కూడా బ్లాక్ చేయొచ్చు
Image Credit : our own

ఇంటర్నెట్ లేకపోతే SMS ద్వారా కూడా బ్లాక్ చేయొచ్చు

స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా SMS ద్వారా కార్డును బ్లాక్ చేసే అవకాశం చాలా బ్యాంకులు కల్పిస్తున్నాయి. అయితే ప్రతి బ్యాంకుకు వేర్వేరు SMS ఫార్మాట్, ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. ముందుగా బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్ ద్వారా సరైన ఫార్మాట్ తెలుసుకోవాలి. తర్వాత మీ కార్డు చివరి నాలుగు అంకెలతో కూడిన సందేశాన్ని నిర్దేశిత నంబర్‌కు పంపాలి. బ్యాంకు నుంచి కార్డు విజయవంతంగా బ్లాక్ అయినట్లు క‌న్ఫామ్‌ మెసేజ్‌ వస్తుంది.

55
కార్డు పోయినప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
Image Credit : our own

కార్డు పోయినప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

కార్డు పోయిన వెంటనే సమయం వృథా చేయకుండా బ్లాక్ చేయాలి. అలాగే బ్యాంకు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఘటనను నమోదు చేయడం మంచిది. కార్డు బ్లాక్ అయిన తర్వాత ఇటీవల జరిగిన లావాదేవీలను పరిశీలించి ఏవైనా అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు ఉన్నాయో లేదో చెక్‌ చేయాలి. అవసరమైతే బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. డిజిటల్ యుగంలో కార్డులు సౌకర్యవంతమైన చెల్లింపు సాధనాలే అయినప్పటికీ, వాటి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image2
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Recommended image3
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Related Stories
Recommended image1
Train: రైలు ఇంజన్ అద్దానికి ఇనుప జాలిని ఎందుకు ఏర్పాటు చేస్తారో ఆలోచించారా.?
Recommended image2
Youtube: 15 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌.. తండ్రి ప్రేమ‌ను ఇంత‌కంటే గొప్పగా వ‌ర్ణించగ‌ల‌మా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved