Today Gold: బంగారం, వెండి ధరలపై భారీ బంపరాఫర్...గ్రాముపై ఎంత తగ్గిందో తెలుసా?
Today Gold: బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నవారికి ఈరోజు గొప్ప గుడ్ న్యూస్. పసిడి, సిల్వర్ రెండు కుప్పకూలిపోయాయి. ముఖ్యంగా వెండి అయితే భారీగా పతనమైంది. మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్
ఇంకా పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి టైంలో బంగారం ధరలు తగ్గడం రిలీఫ్ ఇస్తోంది. కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు తగ్గుముఖం పట్టింది. దీంతో కొనుగోలుదారుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అంతర్జాతీయంగా వచ్చిన మార్పుల వల్లే దేశీయంగా ధరలు పతనం దిశగా కొనసాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
రూ. 1,55,730 కి చేరిన పసిడి
అయితే హైదరాబాద్ మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయంటే...24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధరపై రూ. 380 తగ్గి, ప్రస్తుతం రూ. 1,55,730 కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.350 తగ్గి రూ. 1,42,750 వద్ద కొనసాగుతోంది. దీంతో పాటే 18 క్యారెట్ల గోల్డ్ రేట్ కూడా గణనీయంగా తగ్గింది.
నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం
ఇక చూస్తే బంగారం ధరలు కొంత మేర తగ్గితే...వెండి మాత్రం బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే కిలో వెండిపై ఏకంగా రూ.10వేలు తగ్గింది. ఇవాళ ఒక్కరోజే రూ.5వేలు పతనమైంది. బంగారం, వెండి కొనాలనుకునేవారు మార్కెట్లు గమనించి కొనుగోలు చేయడం ఉత్తమం. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

