MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • Rahul Gandhi vs BJP: ఇండియాలో ఆర్థిక సంక్షోభం రాబోతోందా? పొలిటికల్ హీట్ పెంచిన రాహుల్ vs బీజేపీ వార్ ! అసలు ఏం జరుగుతోంది?

Rahul Gandhi vs BJP: ఇండియాలో ఆర్థిక సంక్షోభం రాబోతోందా? పొలిటికల్ హీట్ పెంచిన రాహుల్ vs బీజేపీ వార్ ! అసలు ఏం జరుగుతోంది?

Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ ఆర్థిక సునామీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్ కు బీజేపీ గట్టిగానే కౌంటర్లు ఇస్తున్న నేపథ్యంలో అసలు భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి ఏంటి? టాప్ ఎకనామిస్టులు ఏమంటున్నారు? సంక్షోభం రాబోతుందా?

4 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 05 2026, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
2026లో దేశంలో తీవ్ర ఆర్థిక సునామీ? రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Image Credit : Getty

2026లో దేశంలో తీవ్ర ఆర్థిక సునామీ? రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. దేశంలో త్వరలోనే మునుపెన్నడూ చూడని విధంగా ఒక భయంకరమైన ఆర్థిక సునామీ రాబోతోందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి.

దిల్లీలోని ఇందిరా భవన్‌లో ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన నేతల సమావేశంలో రాహుల్ ఈ సంచలన కామెంట్స్ చేశారు. మరో ఏడాదిలోపు మోదీ ప్రధాని సీటులో ఉండరని, ఇప్పటివరకు మోదీ కంట్రోల్‌లో ఉన్న వ్యవస్థలన్నీ లోపల లోపలే కుప్పకూలుతున్నాయని రాహుల్ జోస్యం చెప్పారు. దీనిపై అధికార బీజేపీ అంతే ఘాటుగా రియాక్ట్ అయింది. అసలు దేశంలో ఏం జరుగుతోంది? రాహుల్ ఆరోపణలు ఏంటి? బీజేపీ ఇచ్చిన కౌంటర్లు ఏంటి? ఎకనామిస్టులు ఏమంటున్నారు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వ్యవస్థల నుంచి నాకే లీకులు వస్తున్నాయి: రాహుల్ గాంధీ
Image Credit : ANI

వ్యవస్థల నుంచి నాకే లీకులు వస్తున్నాయి: రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న ధరలు కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని హెచ్చరించారు.

"ఒకవైపు భయంకరమైన ఆర్థిక సంక్షోభం రాబోతోంది, దాన్ని ఎవరూ ఆపలేరు. మరోవైపు దేశంలోని కీలక వ్యవస్థలలో అంతర్గత తిరుగుబాటు నడుస్తోంది. ఎన్నికల సంఘం, ఇంటెలిజెన్స్ చీఫ్‌లు, న్యాయవ్యవస్థలోని సీనియర్లు అంతా లోపల జరుగుతున్న పరిణామాలపై స్వయంగా నాకే సమాచారం అందిస్తున్నారు" అని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు ప్రధాని మోదీ ఘనంగా నియంత్రించిన వ్యవస్థలే ఇప్పుడు అదుపు తప్పుతున్నాయని, రేపు రాబోయే ప్రజా ఆగ్రహాన్ని తట్టుకోలేక ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.

भयंकर आर्थिक सुनामी आ रही है और नरेंद्र मोदी इसके बारे में न कुछ कर रहे हैं, न कर सकते हैं।

समझिए क्यों? pic.twitter.com/h2HKeh7Jp0

— Congress (@INCIndia) June 3, 2026

36
రాహుల్ పగటికలలు కంటున్నారు: బీజేపీ ఫైర్
Image Credit : ANI

రాహుల్ పగటికలలు కంటున్నారు: బీజేపీ ఫైర్

రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. బీజేపీ నేత ప్రదీప్ భండారీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ఒక అరాచకవాదిగా అభివర్ణించారు. జార్జ్ సోరోస్‌తో కలిసి రాహుల్ దేశంలో ప్రజాస్వామ్య సంక్షోభాన్ని సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మనసులు గెలవలేక, ఇలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్‌కులే మాట్లాడుతూ.. రాహుల్ పగటిపూట కూడా పీడకలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. సంపన్న కుటుంబంలో పెరిగిన రాహుల్‌కు పేదరికం తెలియదని, ప్రధాని మోదీ ఉన్నంత కాలం దేశానికి ఎలాంటి ఢోకా లేదని, రాహుల్ తన సొంత పార్టీని కాపాడుకుంటే మంచిదని హితవు పలికారు.

BJP leader Pradeep Bhandari slams LoP Rahul Gandhi for his absurd statement on India's economy:

"Rahul Gandhi is an anarchist man. He wants to spread anarchy in the country at the direction of George Soros. The entire toolkit of India is anti-India and wants to create a… pic.twitter.com/OjaaQQXo8B

— Megh Updates 🚨™ (@MeghUpdates) June 4, 2026

46
ఆర్థిక సునామీ 2013లోనే వచ్చింది.. ఇప్పుడు కాదు: అమిత్ మాలవీయ
Image Credit : Getty

ఆర్థిక సునామీ 2013లోనే వచ్చింది.. ఇప్పుడు కాదు: అమిత్ మాలవీయ

బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఎక్స్ లో రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు. ప్రజలను భయపెట్టి రాజకీయం చేయవద్దంటూ చురకలు వేశారు. 2011 నుంచి 2013 మధ్య కాంగ్రెస్ పాలనలోనే రూపాయి విలువ 36 శాతం కుంగిందని, విదేశీ మారక నిల్వలు 294 బిలియన్ డాలర్ల నుంచి 256 బిలియన్ డాలర్లకు పడిపోయాయని, అసలైన ఆర్థిక సునామీ అప్పుడే వచ్చిందని ఆయన కౌంటర్ ఇచ్చారు.

కోవిడ్ సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల షాక్‌లు తగిలినా తట్టుకునేలా మోదీ ప్రభుత్వం దేశాన్ని బలోపేతం చేసిందన్నారు. ప్రస్తుతం జీఎస్‌టీ ఇ-వే బిల్లులు, విద్యుత్ వినియోగం, వాహనాల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయని, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు.

56
గొంతు మారుస్తున్న మోదీ అనుకూల ఆర్థికవేత్తలు?
Image Credit : Getty

గొంతు మారుస్తున్న మోదీ అనుకూల ఆర్థికవేత్తలు?

అయితే, రాజకీయ పార్టీల మాటలు పక్కన పెడితే.. దేశ ఆర్థిక పరిస్థితిపై కొందరు ప్రముఖ ఆర్థికవేత్తలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. విశేషం ఏంటంటే.. ఒకప్పుడు మోదీ ప్రభుత్వ విధానాలను గట్టిగా సమర్థించిన వారే ఇప్పుడు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

పీఎం ఆర్థిక సలహా మండలి మాజీ సభ్యుడు సుర్జిత్ భల్లా మే 21న 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికలో లో "బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోంది కానీ ఆర్థిక వ్యవస్థను కోల్పోతోంది" అంటూ వ్యాసం రాశారు. ప్రస్తుతం ఎకానమీ మేనేజ్‌మెంట్ అల్పస్థాయికి చేరిందని విమర్శించారు.

మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్.. రూపాయి విలువ నిరంతరం పడిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఇరాన్ యుద్ధ ప్రభావం మాత్రమే కాదని, భారత ఆర్థిక భవిష్యత్తుపై వస్తున్న సందేహాలకు అద్దం పడుతోందని మే 26న ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన కథనంలో పేర్కొన్నారు.

ఒకప్పుడు మోదీని ప్రశంసించిన మీడియా సలహాదారు సంజయ్ బారు.. ప్రస్తుతం దేశంలో ఇన్వెస్టర్లకు నమ్మకం లేని వాతావరణం ఉందన్నారు. మీడియా కూడా నిజాలు చెప్పడానికి భయపడుతోందని, భారత్ ఆర్థిక ర్యాంకింగ్స్‌లో వెనుకబడుతున్నా ఎవరూ ప్రశ్నించడం లేదని విశ్లేషించారు.

66
గ్రౌండ్ రియాలిటీ ఏంటి?.. అసలు ఏం జరుగుతోంది?
Image Credit : freepik

గ్రౌండ్ రియాలిటీ ఏంటి?.. అసలు ఏం జరుగుతోంది?

ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న ఇరాన్ యుద్ధ పరిణామాలు గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత్‌ను కూడా గట్టిగానే ప్రభావితం చేస్తున్నాయి. ముడి చమురు ధరలు పెరగడంతో, మే నెలలోనే ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను నాలుగు సార్లు పెంచాల్సి వచ్చింది. కమర్షియల్ సిలిండర్లు, సీఎన్‌జీ ధరలు కూడా పెరిగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా రూ.95.83 కు క్షీణించి సరికొత్త రికార్డులకు చేరింది.

ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగి.. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి ప్రజా రవాణాను వాడాలని, అనవసర విదేశీ ప్రయాణాలు చేయవద్దని, ఏడాది పాటు బంగారం కొనడం ఆపేయాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే మాజీ ఆర్థిక కార్యదర్శి అశోక్ ఝా లాంటి నిపుణులు మాత్రం.. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కోసమే ప్రధాని అలా అన్నారని, పరిస్థితి మరీ అంత భయానకంగా ఏమీ లేదని చెప్తున్నారు. ఏదేమైనా.. స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో భారత్.. తైవాన్, దక్షిణ కొరియా కంటే వెనుకబడి 7వ స్థానానికి పడిపోవడం గమనార్హం.

మొత్తానికి, ఆర్థిక సునామీ రాబోతోందన్న ప్రతిపక్షాల విమర్శలు.. అంతా సవ్యంగానే ఉందన్న అధికార పక్షం వాదనల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ ఒక కీలకమైన పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటోందనేది మాత్రం వాస్తవమని నిపుణులు పేర్కొంటున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
రాజకీయాలు
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
Mobile Photography Tips: ఇన్ స్టాలో లైకుల వర్షం గ్యారెంటీ.. నార్మల్ ఫోన్‌లోనే ప్రొఫెషనల్ ఫోటోలు తీసే 5 మైండ్ బ్లోయింగ్ టిప్స్
Recommended image2
IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved