MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • New Car: కారు కొనడం మీ కలా.? రూ. 3 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్‌ కారు సొంతం చేసుకోండి..

New Car: కారు కొనడం మీ కలా.? రూ. 3 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్‌ కారు సొంతం చేసుకోండి..

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతోన్న విషయం తెలిసిందే. అన్ని దిగ్గజ సంస్థలు ఈవీ వాహనాలను తయారు చేస్తున్నాయి. అయితే తాజాగా మార్కెట్లోకి సోలార్‌ కారు సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే అధికారికంగా లాంచ్‌ అయిన ఈ కారు ప్రీబుకింగ్స్‌ను మొదలు పెట్టింది. ఈ సోలార్‌ కారుకు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం..  

2 Min read
Author : Narender Vaitla
| Updated : Feb 14 2025, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Vayve Eva Sloar Car

Vayve Eva Sloar Car

మొదట్లో పెట్రోల్‌, డీజిల్‌ కార్లు.. ఆ తర్వాత సీఎన్‌జీ. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ కార్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో రోడ్లపై సోలార్‌ కార్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. కారును కనీసం ఛార్జింగ్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా కాస్త ఎండ తగిలితే చాలు రయ్యిమని దూసుకుపోనున్నాయి. భారతదేశంలో తొలి సోలార్‌ కారు అందుబాటులోకి వచ్చేసింది. 

జనవరి 17 నుంచి 22 వరకు నిర్వహించిన ఆటో ఎక్స్‌పో 2025లో ఈ సోలార్‌ కారును ప్రదర్శించారు. వేవ్ ఈవా (Vayve Eva) పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త కారు ఇంకా రోడ్లపైకి రాకముందే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కారు ప్రారంభ వేరియంట్‌ ధర కేవలం రూ. 3 లక్షలు మాత్రమే కావడం విశేషం. ధర తక్కువ అని ఫీచర్ల విషయంలో అస్సలు రాజీ పడాల్సి అవసరం లేదు.

అన్ని ఇతర కార్లలోలాగే ఇందులో కూడా మంచి ఫీచర్లను అందించారు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ బుకింగ్స్‌ను స్వీకరిస్తున్నారు. ఇక ఈ కారును నోవా, స్టెల్లా, వేగా అనే మూడు వేరియంట్స్‌లో తీసుకొస్తున్నారు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

24
Vayve Eva

Vayve Eva

Vayve Eva Nova:

ఈ కారు బేస్‌ వేరియంట్‌గా చెప్పొచ్చు. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర కేవలం రూ. 3.25 లక్షలుగా ప్రకటించారు. ఒక్కసారి ఫుల్‌ చార్జీ చేస్తే 125 కి.మీలు నాన్‌స్టాప్‌గా దూసుకెళ్లొచ్చు. ఇందులో ఎకో డ్రైవింగ్ మోడ్‌ను ఇచ్చారు. ఈ సోలార్‌ కారు గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ కారులో 9kWh కెపాసిటీ బ్యాటరీని అందించారు. హోమ్‌ ఛార్జర్‌ సహాయంతో కూడా బ్యాటరీ ఛార్జ్‌ చేసుకోవచ్చు. 
 

34
Vayve Eva

Vayve Eva

Vayve Eva Stella:

ఈ సిరీస్‌లో వస్తున్న రెండో వేరియంట్‌ స్టెల్లా కూడా మంచి ఫీచర్లను అందిస్తున్నారు. ఈ కారు గరిష్టంగా గంటకు 60 కి.మీ వేగంతో వెళ్తుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 175 కి.మీల మైలేజ్‌ అందిస్తుంది. ఇందులో ఎయిర్‌ కూల్డ్‌ టెక్నాలజీ ఆధారిత 12.6kWh సామర్థ్యం గల బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే ఈ కారు ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 3.25 లక్షలుగా ఉంది. 

ఇది కూడా చదవండి:  AI ఏజెంట్లు వచ్చేస్తున్నారు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల పని అయిపోయినట్లేనా.? అసలేంటీ AI ఏజెంట్‌

44
Vayve Eva

Vayve Eva

Vayve Eva Vega:

ఇక టాప్‌ వేరియంట్‌ వేగా విషయానికొస్తే ఈ కారు గరిష్టంగా గంటకు 70 కి.మీల వేగంతో దూసుకెళ్తుంది. అలాగే బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే గరిష్టంగా 250 కి.మీల మైలేజ్‌ను అందిస్తుంది. ఇక ఇందులో లిక్విడ్ కూల్డ్ టెక్నాలజీతో కూడిన 18kWh సామర్థ్యం గల బ్యాటరీని అందించారు. 

ఇది కూడా చదవండి: ఆటో కి 3 చక్రాలు ఎందుకు ఉంటాయి, 4 చక్రాలు ఉంటే నష్టం ఏంటి? మూడు చక్రాలవల్ల ఉపయోగాలు తెలుసా?

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
అదే జరిగిందో.. బంగారం ధర టక్కున రెండు లక్షలు..!
Recommended image2
Best months for Car: కొత్త కారు తక్కువ ధరకు రావాలంటే ఈ నెలల్లో కొనడమే బెటర్
Recommended image3
Gold Price: మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు, ఎంత పెరిగిందంటే...?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved