- Home
- Technology
- Tech News
- IT Jobs: AI ఏజెంట్లు వచ్చేస్తున్నారు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పని అయిపోయినట్లేనా.? అసలేంటీ AI ఏజెంట్
IT Jobs: AI ఏజెంట్లు వచ్చేస్తున్నారు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పని అయిపోయినట్లేనా.? అసలేంటీ AI ఏజెంట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. దీంతో ఏఐతో ఉద్యోగాలు ప్రమాదంలో పడడం ఖాయమనే చర్చ గత కొన్ని రోజులుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏఐ ఏజెంట్స్ అనే పేరు బాగా వినిపిస్తోంది. ఇంతకీ ఈ ఏఐ ఏజెంట్ అంటే ఏంటి.? నిజంగానే ఉద్యోగులను భర్తీ చేయనున్నాయా.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
artificial intelligence
చాట్‌జీపీటీ, డీప్‌సీక్, గూగుల్ జెమిని.. ఇటీవల ప్రపంచమంతా ఇవే పేర్లు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసించడం ఖాయమమే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ఏఐ కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఐటీ ఉద్యోగుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏఐ ఏజెంట్లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను భర్తీ చేయనున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారి తీశాయి. ఏళ్ల అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు చేసే పనులను AI ఏజెంట్స్ చేయగలరని ఆల్టామాన్ తెలిపారు.
ఇంతకీ ఏంటీ AI ఏజెంట్.?
ఒకే రకమైన పనులను రిపీట్‌గా చేసేందుకు రూపొందించిన సాధనాలే ఈ ఏఐ ఏజెంట్స్. ఓపెన్ ఏఐ ఇటీవల రెండు ఏఐ ఏజెంట్లను రూపొందించింది. సింగిల్ కమాండ్‌తో టికెట్ బుకింగ్, ఆన్‌లైన్ ఆర్డర్ వంటి పనులను చేసే విధంగా వీటిని అభివృద్ధి చేశారు. అలాగే ఇంటర్నెట్‌లో సమాచారాన్ని సెర్చ్ చేసేందుకు మరో టూల్ ఉపయోగపడుతుంది.
ఈ ఏఐ జెంట్స్ భవిష్యత్తుల్లో ఒక సాధారణ ఉద్యోగిలాగా పనిచేస్తాయని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ తెలిపారు. ఈ ఏజెంట్లు ఈ సంవత్సరం వర్క్‌ఫోర్స్‌లో చేరతారని, వీటితో కంపెనీల ఉత్పత్తి భారీగా పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఏఐ ఏజెంట్స్ కోడింగ్‌ను కూడా సమర్థవంతంగా చేయగలవు.
artificial intelligence
మనుషులను భర్తీ చేస్తాయా.?
అయితే ఈ ఏఐ ఏజెంట్స్ మనుషులను పూర్తిగా భర్తీ చేస్తాయా అంటే లేదని తెలిపారు ఆల్ట్‌మాన్. ఈ ఏజెంట్లు మనుషులు చేసే పనులు చేసినప్పటికీ నాణ్యత, ఆవిష్కరణలకు సంబంధించి పర్యవేక్షించేందుకు మానవులు అవసరమవుతారన్నారు. అయితే ఇవి మనుషులతో కలిసి పనిచేస్తాయని తెలిపారు. కానీ వీటి ప్రభావం కచ్చితంగా ఉద్యోగాలపై పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Artificial Intelligence
ఇదిలా ఏంటే ఉంటే ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐ ఏజెంట్స్‌ను ఉపయోగించుకుంటున్నాయి. గూగుల్, మెటా వంటి పెద్ద కంపెనీలు తమ వర్క్ ఫోర్స్‌లో వీటిని ఉపయోగించుకుంటున్నాయి. గూగుల్ తన కోడ్ నిర్మాణంలో ఎక్కువ భాగాన్ని ఏఐతోనే రూపొందిస్తుంది. అదే విధంగా మెటా కూడా ఏఐ ఏజెంట్స్‌తో కలిసి పనిచేస్తుంది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కూడా AI మిడ్-లెవల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను భర్తీ చేస్తుందని అన్నారు.