- Home
- Business
- Stock Market: రూ.7 షేరుతో ఏడాదినాటికే కోటీశ్వరులయ్యారు.. రూ.1 లక్ష ఇన్వెస్ట్మెంట్ రూ.80 లక్షలైంది !
Stock Market: రూ.7 షేరుతో ఏడాదినాటికే కోటీశ్వరులయ్యారు.. రూ.1 లక్ష ఇన్వెస్ట్మెంట్ రూ.80 లక్షలైంది !
Stock Market: డిఫెన్స్ సెక్టార్‌కి చెందిన జేటీఎల్ డిఫెన్స్ షేరు కేవలం ఏడాదిలోనే రూ.7 నుంచి రూ.570 దాటి, రూ.1 లక్ష పెట్టుబడిని రూ.80 లక్షలకు పైగా మార్చింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్స్ వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఒక్క ఏడాదిలో 8,000% రిటర్న్స్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన బుల్లి షేరు
స్టాక్ మార్కెట్లో భారీగా లాభాలు ఇచ్చే మల్టీబ్యాగర్ స్టాక్స్ జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మాత్రమే కాకుండా, స్వల్పకాలంలోనే ఇన్వెస్టర్ల భాగ్యాన్ని మార్చేసే స్టాక్స్ కూడా మార్కెట్లో ఉంటాయి.
డిఫెన్స్ సెక్టార్‌కు చెందిన ఒక చిన్న స్మాల్‌క్యాప్ కంపెనీ షేరు తన ఇన్వెస్టర్లపాలిట కామధేనువులా మారింది. కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే ఈ స్టాక్ ఇన్వెస్టర్లను శ్రీమంతులను చేసింది. అతి తక్కువ ధరలో లభించిన రూ.7 పెన్నీ స్టాక్, ఏకంగా రూ.570 మార్కును దాటేసి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఏడాదిలోనే రూ.7 నుంచి రూ.570 మార్కు పైకి
జేటీఎల్ డిఫెన్స్ షేరు తన ఇన్వెస్టర్లకు ఏ స్థాయిలో రిటర్న్స్ ఇచ్చిందో దీని ప్రైస్ హిస్టరీ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఏడాది క్రితం, అంటే 2025 అక్టోబర్ 27న జేటీఎల్ డిఫెన్స్ ఒక్కో షేరు ధర కేవలం రూ.7.14 వద్ద ట్రేడ్ అవుతోంది. కానీ, పోయిన వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం లోయర్ సర్క్యూట్ నమోదు చేసినప్పటికీ రూ.583.10 వద్ద ముగిసింది. ఆ తర్వాత సోమవారం మార్కెట్ ఓపెనింగ్ సమయంలో స్వల్పంగా తగ్గి రూ.571 వద్దకు చేరింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.924గా నమోదు కావడం గమనార్హం.
రూ.1 లక్ష పెట్టుబడితో రూ.81 లక్షల రాబడి
గత ఒక సంవత్సర కాలంలో జేటీఎల్ డిఫెన్స్ షేరు ఇచ్చిన రిటర్న్స్ లెక్క చూస్తే ఇన్వెస్టర్లకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ స్టాక్ గత ఏడాది కాలంలో ఏకంగా 8,066 శాతం మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. ఉదాహరణకు, ఏదైనా ఒక ఇన్వెస్టర్ ఏడాది క్రితం రూ.7 ధరకు ఈ కంపెనీలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి, ఆ షేర్లను అలాగే హోల్డ్ చేసి ఉంటే.. నేడు ఆ లాభం ఏకంగా రూ.81,66,000 అయి ఉండేది.
6 నెలల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల డబ్బు డబుల్
జేటీఎల్ డిఫెన్స్ ఒక స్మాల్‌క్యాప్ కంపెనీ. దీని మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ.613.79 కోట్లుగా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాప్ చిన్నదే అయినా ఇన్వెస్టర్లకు అందించిన రాబడి మాత్రం చాలా పెద్దది. కేవలం గత ఆరు నెలల వ్యవధిలోనే ఈ స్టాక్ ప్రైస్ 151 శాతం పెరిగింది. అంటే కేవలం అర్ధ సంవత్సరంలోనే ఇన్వెస్టర్ల డబ్బు రెట్టింపు కంటే ఎక్కువ లాభాన్ని తెచ్చిపెట్టింది.
కంపెనీ పేరు మార్పు.. ఇతర వివరాలు
ఈ జేటీఎల్ డిఫెన్స్ లిమిటెడ్ కంపెనీకి గతంలో 'ఆర్సీఐ ఇండస్ట్రీస్ అండ్ టెక్నాలజీస్ లిమిటెడ్' (RCI Industries & Technologies Limited) అనే పేరు ఉండేది. ఈ ఏడాద ఏప్రిల్ మొదటి వారంలో కంపెనీ పేరును జేటీఎల్ డిఫెన్స్‌గా మార్చారు. ఈ కంపెనీ ప్రధానంగా రాగి, ఇత్తడితో పాటు ఇతర ప్రత్యేక లోహ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ ఉత్పత్తులను డిఫెన్స్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు.

