MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ప్రపంచంలోని టాప్ 10 అందమైన నగరాలు ఇవే.. ఇండియాలో ఏ సిటీ ఉంది?

ప్రపంచంలోని టాప్ 10 అందమైన నగరాలు ఇవే.. ఇండియాలో ఏ సిటీ ఉంది?

Beautiful Cities: ప్రపంచంలో చాలా అందమైన నగరాలున్నాయి. వాటిల్లో టాప్ లో నిలిచేవి మాత్రం.. పారిస్, న్యూయార్క్, లండన్ మొదలైనవి. ఎందుకంటే అవి వాటి అందాలతో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. మరి టాప్ 10లో ఉన్న నగరాలు, వాటి స్పెషాలిటీలు తెలుసుకుందామా? 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 28 2025, 07:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పారిస్, ఫ్రాన్స్

ప్రపంచంలోని టాప్ 10 నగరాల్లో ముఖ్యమైనది పారిస్. ఇక్కడున్న ఎఫిల్ టవర్, లౌవర్ వంటి ప్రదేశాలు చూడటానికి దేశదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. పారిస్ దాని ఆర్కిటెక్చర్, రొమాంటిక్ వాతావరణం వల్ల ఫేమస్ అయ్యింది. 

న్యూయార్క్ నగరం, యూఎస్ఏ

అందమైన నగరాల్లో న్యూయార్క్ నగరం కూడా ఒకటి. అమెరికాలో అతిపెద్ద, ముఖ్యమైన నగరం ఇది. అమెరికాలోని ఈశాన్య భాగంలో ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

లండన్, యునైటెడ్ కింగ్‌డమ్

లండన్ ఒక అద్భుతమైన నగరం. ఇక్కడి ఆర్కిటెక్చర్ చాలా ప్రత్యేకమైనది. ఈ నగరంలో పార్కులు, టవర్ ఆఫ్ లండన్, బకింగ్‌హామ్ ప్యాలెస్ వంటి ప్రదేశాలు చూడటానికి రెండు కళ్లు చాలవు. 

వెనిస్, ఇటలీ

వెనిస్ ఒక అందమైన నగరం. ఎందుకంటే ఇక్కడ కాలువలు కూడా చాలా క్లీన్ గా, అందంగా ఉంటాయి. ఇక్కడ కనిపించే ఆర్కిటెక్చర్ చక్కటి రొమాంటిక్ ఫీల్ ని ఇస్తుంది. దానికోసమే ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. 

 

35

వాంకోవర్, కెనడా

వాంకోవర్ నగరంలో ఉన్న పర్వతాలు, బీచ్‌లు చాలా బాగుంటాయి. ఈ నగరంలో లైఫ్‌స్టైల్‌ చాలా భిన్నంగా ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ అనుభవించడానికే పర్యాటకులు ఎక్కువ ఈ నగరాన్ని విజిట్ చేస్తుంటారు. 

కేప్‌టౌన్, సౌత్ ఆఫ్రికా

ఈ నగరం ప్రాచీన సంస్కృతికి ఫేమస్. ఇక్కడ టేబుల్ మౌంటెన్, అందమైన సముద్ర తీరాలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. 

45

బార్సిలోనా, స్పెయిన్

స్పెయిన్ దేశానికి ఈశాన్య తీరంలో బార్సిలోనా నగరం ఉంది. ఇది స్పెయిన్‌లోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన నగరం. నైరుతి ఐరోపాలో బార్సిలోనా ఒక సాంస్కృతిక, ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా పేరు పొందింది.

శాన్ ఫ్రాన్సిస్కో, యూఎస్ఏ

శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూడటం చాలామందికి ఒక లక్ష్యం. ఈ పట్టణంలో 50 కొండలు ఉన్నాయి. ఈ కొండలను అందమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఇవికాక పర్యాటక కేంద్రాలైన అనేక దీవులు కూడా ఉన్నాయి.

55

సిడ్నీ, ఆస్ట్రేలియా

సిడ్నీలో తప్పకుండా చూడాల్సినవి ఒపెరా హౌస్, షిపింగ్ హార్బర్. ఇక్కడున్న అందమైన ఓడరేవు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. ఇది అర్బన్ నేచర్ లవర్స్‌కి బెస్ట్ ప్లేస్.

రోమ్, ఇటలీ

రోమ్ కొలోసియం, వాటికన్ సిటీ వంటి పురాతన కట్టడాలు కలిగిన నగరం రోమ్. ఈ నగర చరిత్ర చాలా పురాతమైనది. ఈ నగర ఆర్కిటెక్చర్ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. 

నోట్: ఇండియాలో 5000 ఏళ్ల క్రితం నిర్మించిన వారణాసి నగరం లాంటి పురాతన నగరాలు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాయి కాని.. టాప్ 10 లో అందమైన నగరం లేదు. జైపూర్, మైసూర్, వంటి నగరాలు టాప్ 100 లిస్టులో ఉన్నాయి. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ప్రపంచం
విద్య
ఏషియానెట్ న్యూస్
ప్రయాణం
Latest Videos
Recommended Stories
Recommended image1
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !
Recommended image2
Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో
Recommended image3
Post Office MIS: ఈ పోస్టాఫీస్ పథకంలో చేరితే ప్రతీ నెల మీ ఖాతాల్లోకి రూ. 16,650 వస్తాయి.. ఏం చేయాలంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved