MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Stock Market: 8 రోజుల్లో రూ. 6 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ప్ర‌మాదంలో ఉన్నాయా.?

Stock Market: 8 రోజుల్లో రూ. 6 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ప్ర‌మాదంలో ఉన్నాయా.?

Stock Market: దేశీయ షేర్ మార్కెట్‌లో ఐటీ రంగం భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనలు, ప్రపంచ మార్కెట్లలో అస్థిరత కారణంగా ఐటీ స్టాక్స్‌లో వరుసగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 13 2026, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
8 రోజుల్లో రూ.6 లక్షల కోట్ల ఆవిరి
Image Credit : Gemini AI

8 రోజుల్లో రూ.6 లక్షల కోట్ల ఆవిరి

ఐటీ రంగం మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పడిపోయింది. సుమారు 250 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ రంగంలో ఒక్కసారిగా అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (TCS) మార్కెట్ విలువ 2020 స్థాయిల కంటే దిగువకు చేరి రూ.10 లక్షల కోట్లకు దిగువకు చేరింది. ఇది పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచింది.

25
TCS, Infosys, HCL షేర్ల పతనం
Image Credit : AI

TCS, Infosys, HCL షేర్ల పతనం

గత ఎనిమిది రోజుల్లో TCS దాదాపు 19 శాతం పడిపోయింది. Infosys షేర్లు 21 శాతం వరకు క్షీణించగా, HCL Technologies షేర్లు సుమారు 17 శాతం తగ్గాయి. ఒక్క శుక్రవారం రోజే TCS దాదాపు 6 శాతం క్షీణించింది. నిఫ్టీ ఐటీ సూచీ కూడా సుమారు 5 శాతం పడిపోయింది.

Related Articles

Related image1
RGV: పిచ్చోడు అనుకుంటాం కానీ మాములోడు కాదు భ‌య్యో.. వ‌ర్మ కొటేష‌న్స్ చ‌దివితే మైండ్ బ్లాంకే
Related image2
Real estate: ఏపీలోని ఈ ప్రాంతం మ‌రో సైబ‌ర్ సిటీ కావ‌డం ఖాయం.. ఇవే సాక్ష్యాలు
35
AI భయం ఎందుకు?
Image Credit : Stock Market\Twitter

AI భయం ఎందుకు?

ఈ పతనం ఏదో ఒక‌ కంపెనీ ఫలితాల కారణంగా కాదు. వేగంగా అభివృద్ధి చెందుతున్న AI టెక్నాలజీ సంప్రదాయ ఐటీ సేవల వ్యాపార మోడల్‌ను మార్చవచ్చనే భయం పెరిగింది. అమెరికాకు చెందిన AI స్టార్టప్ ఆంథ్రోపిక్‌ విడుదల చేసిన కొత్త టూల్ కూడా మార్కెట్‌లో ఆందోళన కలిగించింది. భవిష్యత్తులో ఐటీ ఉద్యోగాలు, ప్రాజెక్టులు తగ్గవచ్చనే భావన పెట్టుబడిదారులను వెనక్కు నెడుతోంది.

45
అమెరికా వడ్డీ రేట్ల ప్రభావం
Image Credit : Stock Market\Twitter

అమెరికా వడ్డీ రేట్ల ప్రభావం

అమెరికా నుంచి వచ్చిన బలమైన ఉద్యోగ గణాంకాలు అక్కడ వడ్డీ రేట్లు త్వరగా తగ్గకపోవచ్చనే సంకేతాలు ఇచ్చాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే గ్రోత్, టెక్నాలజీ స్టాక్స్‌పై ఒత్తిడి పెరుగుతుంది. భారత ఐటీ కంపెనీల ఆదాయంలో పెద్ద భాగం అమెరికా క్లయింట్ల నుంచే వస్తుంది. అమెరికాలో టెక్నాలజీ ఖర్చులు తగ్గితే భారత కంపెనీల ఆదాయం కూడా ప్రభావితం అవుతుంది. దీంతో కంపెనీలు స‌హ‌జంగానే ఉద్యోగుల‌ను త‌గ్గించుకునే అవ‌కాశం ఉంటుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

55
ముందున్న సవాళ్లు
Image Credit : Google

ముందున్న సవాళ్లు

AI వేగంగా మారుతున్న పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు తమ వ్యాపార విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా సేవలను అభివృద్ధి చేస్తేనే దీర్ఘకాలంలో నిలదొక్కుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న భయాలు తాత్కాలికమా, లేక దీర్ఘకాల ప్రభావమా అన్నది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది. మొత్తంగా చూస్తే, AI ప్రభావం, అమెరికా ఆర్థిక పరిస్థితులు, గ్లోబల్ అనిశ్చితి అన్నీ కలిసి భారత ఐటీ స్టాక్స్‌పై భారీ ఒత్తిడిని తెచ్చాయి. దీంతో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
స్టాక్ మార్కెట్
ప్రపంచం
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రైళ్లలో మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు..
Recommended image2
Check Bounce: చెక్ లేదా ఈఎంఐ బౌన్స్ చేస్తే రెండేళ్ల జైలు శిక్ష.? చట్టం ఏం చెబుతోందంటే.!
Recommended image3
Zomato: మాజీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జొమాటో సీఈవో, ఊహించని స్పందన
Related Stories
Recommended image1
RGV: పిచ్చోడు అనుకుంటాం కానీ మాములోడు కాదు భ‌య్యో.. వ‌ర్మ కొటేష‌న్స్ చ‌దివితే మైండ్ బ్లాంకే
Recommended image2
Real estate: ఏపీలోని ఈ ప్రాంతం మ‌రో సైబ‌ర్ సిటీ కావ‌డం ఖాయం.. ఇవే సాక్ష్యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved