MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • 1980 త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడే.. వెండి ఇంత‌లా ప‌త‌న‌మ‌వ్వ‌డానికి కార‌ణాలేంటో తెలుసా.?

1980 త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడే.. వెండి ఇంత‌లా ప‌త‌న‌మ‌వ్వ‌డానికి కార‌ణాలేంటో తెలుసా.?

Silver Price Crash: వెండి ధరలు కొనుగోలుదారులకు భారీ ఊరటనిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఆకాశాన్నంటిన వెండి ధరలు ఇప్పుడు అనూహ్యంగా పడిపోతున్నాయి. వెండి ధ‌ర‌లు ఇంత‌లా త‌గ్గ‌డానికి కార‌ణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

3 Min read
Author : Narender Vaitla
Published : Nov 18 2026, 04:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రికార్డు స్థాయికి చేరిన వెండి.. ఆ తర్వాత భారీ పతనం
Image Credit : Gemini AIతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

రికార్డు స్థాయికి చేరిన వెండి.. ఆ తర్వాత భారీ పతనం

2026 ప్రారంభంలో వెండి మార్కెట్‌లో ఊహించని ర్యాలీ కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర జనవరి 29న సుమారు 121 డాలర్ల గరిష్ఠాన్ని తాకింది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర కూడా రూ.4 లక్షల మార్కును దాటింది. అయితే ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నవంబర్ 18 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర సుమారు 46 డాలర్లకు పడిపోయింది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర కూడా రూ.1.70 లక్షల దిగువకు చేరింది.

అంటే కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే వెండి తన గరిష్ఠ ధర నుంచి 60 శాతానికి పైగా విలువను కోల్పోయింది. గతంలో వెండి ధరలు 1980 జనవరి 18న ఔన్సుకు 49.45 డాలర్లు, 2011 ఏప్రిల్ 20న 48.44 డాలర్ల గరిష్ఠాలను నమోదు చేశాయి. అయితే 2026 జనవరిలో నమోదైన 121 డాలర్ల స్థాయి ఈ రెండు చారిత్రక గరిష్ఠాలను అధిగమించింది. ప్రస్తుతం ధరలు మళ్లీ 50 డాలర్ల దిగువకు పడిపోవడంతో మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అమెరికా డాలర్ బలపడటం.. వడ్డీ రేట్ల భయాలు
Image Credit : Getty

అమెరికా డాలర్ బలపడటం.. వడ్డీ రేట్ల భయాలు

వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణాల్లో అమెరికా డాలర్ బలపడటం ఒకటి. అంతర్జాతీయ మార్కెట్లో వెండి కొనుగోళ్లు ఎక్కువగా డాలర్లలోనే జరుగుతాయి. డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర దేశాల కరెన్సీలతో వెండి కొనుగోలు చేయడం ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. దీంతో అంతర్జాతీయంగా కొనుగోళ్లపై ప్రభావం పడుతుంది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు కూడా వెండి ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి.

సాధారణంగా వెండి వంటి విలువైన లోహాలపై పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ ఆదాయం లభించదు. అదే సమయంలో ప్రభుత్వ బాండ్లు, ఇతర స్థిర ఆదాయ పెట్టుబడులపై అధిక రాబడులు వచ్చే అవకాశం ఉంటే పెట్టుబడిదారులు వాటివైపు మొగ్గు చూపుతారు. దీంతో వెండి నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తోడు అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం కూడా వెండి ఆకర్షణను తగ్గిస్తోంది. రూపాయితో పోలిస్తే డాలర్ కదలికలు, దేశీయ కరెన్సీ మారకం విలువలో మార్పులు కూడా భారత్‌లో వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి.

35
పారిశ్రామిక రంగంలో తగ్గుతున్న డిమాండ్
Image Credit : X

పారిశ్రామిక రంగంలో తగ్గుతున్న డిమాండ్

బంగారంతో పోలిస్తే వెండికి ప్రత్యేకత ఉంది. ఆభరణాల తయారీతో పాటు సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, సెమీకండక్టర్లు వంటి అనేక పరిశ్రమల్లో వెండిని ఉపయోగిస్తారు. అందుకే పారిశ్రామిక రంగంలో డిమాండ్ తగ్గినా వెండి ధరలపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చైనాలో సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగాల్లో మందగమనం కనిపించడం వెండికి ప్రతికూలంగా మారింది. సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి కీలకమైన ముడిసరుకు. అయితే అధిక ధరల కారణంగా కొన్ని పరిశ్రమలు వెండికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఉత్పత్తుల్లో వెండి వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాయిటర్స్ నవంబర్ 13న ప్రచురించిన నివేదిక ప్రకారం.. 2026లో ప్రపంచవ్యాప్తంగా వెండి డిమాండ్ 5 శాతం తగ్గవచ్చని మెటల్స్ ఫోకస్ అంచనా వేసింది. పారిశ్రామిక రంగంలో డిమాండ్ 3 శాతం తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా సోలార్ రంగంలో వినియోగం తగ్గడం, చైనాలో తయారీ కార్యకలాపాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి.

45
లాభాల స్వీకరణ.. పెట్టుబడిదారుల అమ్మకాలతో మరింత ఒత్తిడి
Image Credit : X

లాభాల స్వీకరణ.. పెట్టుబడిదారుల అమ్మకాలతో మరింత ఒత్తిడి

వెండి ధరలు ఏడాది ప్రారంభంలో అనూహ్యంగా పెరగడంతో పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు మార్కెట్‌లోకి ప్రవేశించారు. ధరలు రికార్డు స్థాయికి చేరడంతో అప్పటికే పెట్టుబడులు పెట్టినవారికి భారీ లాభాలు వచ్చాయి. దీంతో కొంతమంది తమ పెట్టుబడులను విక్రయించి లాభాలను స్వీకరించడం ప్రారంభించారు. దీనినే ప్రాఫిట్ బుకింగ్ అంటారు.

మరోవైపు ఫ్యూచర్స్ మార్కెట్‌లో అధిక రుణ పరపతితో (Leverage) ట్రేడింగ్ చేసిన కొంతమంది పెట్టుబడిదారులు ధరలు పడిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెండి ధరలు తగ్గినప్పుడు మార్జిన్ మనీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా చెల్లించలేని ట్రేడర్లు తమ పొజిషన్లను విక్రయించాల్సి వస్తుంది. దీనివల్ల మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి మరింత పెరుగుతుంది.

అంతేకాకుండా కమోడిటీ ఎక్స్ఛేంజీలు ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై మార్జిన్ అవసరాలను పెంచడం కూడా కొంతమంది ట్రేడర్లకు భారంగా మారింది. దీంతో వారు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. 2025లో భారీగా పెరిగిన వెండి ధరల నేపథ్యంలో ఈ ఏడాది పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడం ప్రస్తుత పతనానికి మరో ముఖ్యమైన కారణంగా మారింది.

55
వెండి ధరలు మళ్లీ పెరుగుతాయా?
Image Credit : X

వెండి ధరలు మళ్లీ పెరుగుతాయా?

వెండి ధరలు భారీగా పెరిగినప్పుడు ఆభరణాలు, వెండి వస్తువుల కొనుగోళ్లపై కూడా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా భారత్‌లో ధరలు ఎక్కువగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలుదారులు వెండి ఆభరణాలు, వస్తువుల కొనుగోళ్లను తగ్గిస్తున్నారు. గతంలో కొనుగోలు చేసే పరిమాణంతో పోలిస్తే ఇప్పుడు తక్కువ బరువున్న వస్తువులను ఎంచుకుంటున్నారు. చైనా, అమెరికా మార్కెట్లలోనూ వెండి ఆభరణాల డిమాండ్ బలహీనంగా ఉంది.

మెటల్స్ ఫోకస్ అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా వెండి ఆభరణాల డిమాండ్ 22 శాతం, వెండి వస్తువుల డిమాండ్ 17 శాతం తగ్గే అవకాశం ఉంది. వెండి ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ప్రొడక్ట్స్ (ETPs) నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లడం కూడా మార్కెట్లో ఒత్తిడిని పెంచుతోంది. 2025లో ఈ ఉత్పత్తుల్లోకి భారీగా పెట్టుబడులు రాగా.. 2026లో మాత్రం నికరంగా 4.5 కోట్ల ఔన్సుల మేర పెట్టుబడులు బయటకు వెళ్లవచ్చని అంచనా.

అయితే వెండికి దీర్ఘకాలంలో పారిశ్రామిక అవసరాలు కొనసాగుతూనే ఉంటాయి. సోలార్ విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వెండి వినియోగానికి ప్రాధాన్యం ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సరఫరా, డిమాండ్ మధ్య సమతుల్యత కూడా ధరలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ప్రస్తుత పతనం కొనసాగుతుందా? మళ్లీ ధరలు పుంజుకుంటాయా? అనేది అమెరికా వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ కదలికలు, పారిశ్రామిక డిమాండ్ పుంజుకోవడం, పెట్టుబడుల ప్రవాహంపై ఆధారపడి ఉంటుంది. సమీప కాలంలో వెండి ధరల్లో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ధరలు తగ్గాయని మాత్రమే చూసి తొందరపడి పెట్టుబడి పెట్టకుండా మార్కెట్ పరిస్థితులను పరిశీలించడం అవసరం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బంగారం
 
3rd ODI • AUS vs ENG 2026
Live
AUSAUS
(45.5 ov)224/9
ENGENG
328
AUS need 105 runs in 25 balls
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Live
PAKPAK
325
SLSL
(14.3 ov) 98 & 43/3
Day 2 - Session 3
Schedule ›
26th T20 • WBBLT20
HH-WHH-W
Thu, 19 Nov, 2026
PS-WPS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
BH-WBH-W
Thu, 19 Nov, 2026
ST-WST-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold: మనం నగలు కోసం.. మరి బ్యాంకులు బంగారం ఎందుకు కొంటాయో తెలుసా?
Recommended image2
Gold Silver Price Crash: తులం బంగారం రూ.లక్ష, పాతాళానికి పతనమైన పసిడి, కూప్పకులుతున్న వెండి
Recommended image3
EPFO: వాట్సాప్‌లోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్.. ఒక్క Hi తో చిటికెలో చెక్ చేసుకోండిలా
Related Stories
Recommended image1
ఈ జీవితం కళకే అంకితం.. అవమానాలన్నింటికీ డ్యాన్స్‌తోనే సమాధానం చెప్పిన మాధురి రాథోడ్
Recommended image2
భారతదేశంలోనే అత్యంత ధనిక గ్రామం ఇదే.. చిన్న గ్రామంలో 17 బ్యాంకులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved