MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Silver Price Crash: తులం బంగారం రూ.లక్ష, పాతాళానికి పతనమైన పసిడి, కూప్పకులుతున్న వెండి

Gold Silver Price Crash: తులం బంగారం రూ.లక్ష, పాతాళానికి పతనమైన పసిడి, కూప్పకులుతున్న వెండి

Gold Silver Price: బంగారం ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఒకప్పుడు తులం బంగారం దాదాపు రూ.2లక్షల దాకా ఖర్చు అయ్యేది. ఇప్పుడు చూస్తుండగానే రూ.3వేలు పతనమైపోయింది. డాలర్ దెబ్బకు పసిడి విలవిల్లాడుతోంది.

2 Min read
Author : Nandini Arava
Published : Nov 18 2026, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ.లక్షకు పడిపోయిన బంగారం
Image Credit : chatgpt

రూ.లక్షకు పడిపోయిన బంగారం

పసిడి దాదాపు రూ.లక్షకు పడిపోయింది. దీంతో పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది. బంగారం ధరలు మరోసారి భారీగా దిగొచ్చాయి. ఇప్పటికే దాదాపు రెండు వారాలుగా తగ్గుముఖం పడుతున్న పసిడి రేట్లు.. ఇప్పుడు 14 నెలల కనిష్ఠ స్థాయికి చేరువలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు దేశీయ బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నెలకొన్న అంచనాలు పసిడిపై ఒత్తిడి పెంచుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తులం బంగారంపై వేల రూపాయల తగ్గుదల
Image Credit : Getty

తులం బంగారంపై వేల రూపాయల తగ్గుదల

ముందుగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2,780 తగ్గి రూ.1,33,260 వద్దకు చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,550 మేర తగ్గి రూ.1,22,150 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల బంగారం రూ.99,940 కు చేరుకుంది.

వరుసగా ధరలు తగ్గుతుండటంతో బంగారం కొనాలనుకునేవారు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం నగలు కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. అయితే గతంలో ధరలు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు బంగారం కొనుగోలు చేసినవారు మాత్రం ఇప్పుడు మార్కెట్ పతనంతో ఆందోళన చెందుతున్నారు.

35
వెండి ధరల్లో మాత్రం మార్పు లేదు
Image Credit : gemini ai

వెండి ధరల్లో మాత్రం మార్పు లేదు

బంగారం ధరలు భారీగా తగ్గినప్పటికీ వెండి మార్కెట్లో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,85,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం, చెన్నై నగరాల్లోనూ కిలో వెండి ధర ఇదే స్థాయిలో ఉంది. అయితే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మార్కెట్లలో మాత్రం కిలో వెండి ధర రూ.1,76,000 వద్ద కొనసాగుతోంది.

45
అసలు బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి?
Image Credit : Getty

అసలు బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి?

ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే.. బంగారం ధరలు ఇంత భారీగా తగ్గడానికి ప్రధాన కారణాల్లో అమెరికా డాలర్ బలపడటం ఒకటి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర కరెన్సీలు కలిగిన పెట్టుబడిదారులకు బంగారం కొనుగోలు ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. దీంతో పసిడికి డిమాండ్ తగ్గి ధరలపై ఒత్తిడి ఏర్పడుతుంది.

మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లకు సంబంధించి వెలువడుతున్న అంచనాలు కూడా బంగారం మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయని లేదా ఎక్కువకాలం అధిక స్థాయిలోనే కొనసాగుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తే.. పెట్టుబడిదారులు బంగారం కంటే వడ్డీ ఆదాయం అందించే ఆస్తుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.

ఎందుకంటే బంగారంపై పెట్టుబడి పెడితే సాధారణంగా వడ్డీ రూపంలో ఆదాయం రాదు. అదే బాండ్లు వంటి పెట్టుబడులపై వడ్డీ లభిస్తుంది. దీంతో వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలు వచ్చినప్పుడు బంగారంపై పెట్టుబడుల ఆకర్షణ తగ్గుతుంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం కూడా పసిడి ధరలపై ప్రభావం చూపిస్తోంది. ఈ పరిణామాలన్నీ కలిసిరావడంతో బంగారం ధరలు వరుసగా దిగొస్తున్నాయి.

55
ఇంకా తగ్గుతాయా? కొనడానికి ఇదే సరైన సమయమా?
Image Credit : stockPhoto

ఇంకా తగ్గుతాయా? కొనడానికి ఇదే సరైన సమయమా?

ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. అయితే ధరలు మరింత తగ్గుతాయని కచ్చితంగా చెప్పలేం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, డాలర్ కదలికలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా నెలకొనే భౌగోళిక ఉద్రిక్తతలు రానున్న రోజుల్లో పసిడి ధరలను ప్రభావితం చేయవచ్చు.

అందుకే బంగారం కొనాలనుకునేవారు ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టకుండా తమ అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకోవాలి. ఆభరణాలు కొనేవారు మార్కెట్ ధరతో పాటు 3 శాతం జీఎస్టీ, తరుగు, మేకింగ్ ఛార్జీలను కూడా లెక్కలోకి తీసుకోవాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 
3rd ODI • AUS vs ENG 2026
Live
AUSAUS
-
ENGENG
(35.3 ov)213/5
ENG chose to bat.
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Live
PAKPAK
(55.0 ov)176/4
SLSL
98
Day 2 - Session 1
Schedule ›
26th T20 • WBBLT20
HH-WHH-W
Thu, 19 Nov, 2026
PS-WPS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
BH-WBH-W
Thu, 19 Nov, 2026
ST-WST-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
EPFO: వాట్సాప్‌లోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్.. ఒక్క Hi తో చిటికెలో చెక్ చేసుకోండిలా
Recommended image2
ఐఐటీలో చ‌దివి నెయ్యి వ్యాపారం మొద‌లుపెట్టాడు.. రూ.1,000 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు
Recommended image3
భార‌త్‌లో రూ. 65 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌నున్న అమెజాన్‌.. ఏ రాష్ట్రంలో ఏంతంటే?
Related Stories
Recommended image1
Today Gold Price: పసిడి ధరల జోరుకు బ్రేక్ పడింది...పాతాళానికి పడిపోయిన బంగారం, వెండి
Recommended image2
Gold Silver Price: ఏంటీ ఇది నిజమా? రూ.లక్షకు పడిపోతున్న బంగారం, కుప్పకూలుతున్న వెండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved