MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • EPFO: వాట్సాప్‌లోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్.. ఒక్క Hi తో చిటికెలో చెక్ చేసుకోండిలా

EPFO: వాట్సాప్‌లోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్.. ఒక్క Hi తో చిటికెలో చెక్ చేసుకోండిలా

EPF Balance Check on WhatsApp: ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు వాట్సాప్ ద్వారానే తమ పీఎఫ్ బ్యాలెన్స్, చివరి 5 ట్రాన్సాక్షన్లు చెక్ చేసుకోవచ్చు. పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ వివరాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 18 2026, 10:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఉద్యోగులకు గుడ్ న్యూస్: ఇకపై వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి
Image Credit : Chatgpt తో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగులకు గుడ్ న్యూస్: ఇకపై వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సభ్యులకు గుడ్ న్యూస్. ఇకపై మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ప్రత్యేకంగా మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. నేరుగా మీ ఫోన్‌లోని వాట్సాప్ ద్వారానే పీఎఫ్ బ్యాలెన్స్, చివరి 5 ట్రాన్సాక్షన్లు చూసుకోవచ్చు. అంతేకాకుండా పీఎఫ్ పాస్‌బుక్‌ను కూడా ఈజీగా యాక్సెస్ చేయవచ్చు.

ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ వివరాలను సులభంగా తెలుసుకునేందుకు ఈ వాట్సాప్ సేవలను తీసుకొచ్చారు. నవంబర్ 1, 2026న ఈపీఎఫ్ఓ 74వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ కొత్త సదుపాయాన్ని ప్రారంభించారు. ఈ సేవలను పొందాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుంచే ఈపీఎఫ్ఓ అధికారిక వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేయాల్సి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వాట్సాప్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా?
Image Credit : chatgpt తో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

వాట్సాప్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా?

ఈపీఎఫ్ఓ కేటాయించిన ప్రత్యేక వాట్సాప్ నంబర్ +91 87964 41800 కు మెసేజ్ పంపడం ద్వారా ఈ సేవలను వాడుకోవచ్చు. దానికోసం కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

1. నంబర్ సేవ్ చేసుకోండి: ముందుగా మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో +91 87964 41800 నంబర్‌ను సేవ్ చేసుకోండి. లేదా ఈపీఎఫ్ఓ అధికారిక ప్రకటనలో షేర్ చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూడా చాట్ ప్రారంభించవచ్చు.

2. మెసేజ్ పంపండి: వాట్సాప్ ఓపెన్ చేసి, సేవ్ చేసుకున్న నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపండి.

3. భాషను ఎంచుకోండి: చాట్‌బాట్ మీకు వెల్‌కమ్ మెసేజ్ పంపి, మీకు నచ్చిన భాషను సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది.

4. బ్యాలెన్స్ ఆప్షన్: చాట్‌లో కనిపించే మెనూ నుంచి మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోండి.

5. ఓటీపీ వెరిఫికేషన్: మీ గుర్తింపును నిర్ధారించుకోవడానికి స్క్రీన్‌పై వచ్చే సూచనలను పాటించండి. మీ యూఏఎన్ తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయండి.

6. పీఎఫ్ అకౌంట్ ఎంపిక: వెరిఫికేషన్ పూర్తయ్యాక, మీ యూఏఎన్‌కు ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు లింక్ అయి ఉంటే, మీకు కావాల్సిన పీఎఫ్ అకౌంట్ లేదా మెంబర్ ఐడీని ఎంచుకోండి.

7. బ్యాలెన్స్ వివరాలు: వెంటనే చాట్‌బాట్ మీరు ఎంచుకున్న ఖాతాలోని బ్యాలెన్స్ వివరాలను చూపిస్తుంది. ఆ తర్వాత అక్కడే ఉన్న ఆప్షన్ల ద్వారా పాస్‌బుక్ చూడవచ్చు లేదా మెయిన్ మెనూకు తిరిగి వెళ్లవచ్చు.

36
వాట్సాప్ ద్వారా ఈపీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
Image Credit : Gemini తో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

వాట్సాప్ ద్వారా ఈపీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

మీ ఖాతాలో జమ అయిన నగదు, ట్రాన్సాక్షన్ల రికార్డులను తెలుసుకోవడానికి పాస్‌బుక్ ఎంతో ఉపయోగపడుతుంది. పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా ఇదే వాట్సాప్ సేవను ఉపయోగించవచ్చు. ముందుగా ఈపీఎఫ్ఓ వాట్సాప్ చాట్ ఓపెన్ చేసి ‘Hi’ అని పంపాలి. ఆ తర్వాత మెనూలో పాస్‌బుక్ డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేసి, అడిగితే సంబంధిత పీఎఫ్ అకౌంట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. వెంటనే చాట్‌బాట్ మీకు పాస్‌బుక్‌ను అందిస్తుంది. దీని ద్వారా ఉద్యోగి, కంపెనీ వాటా సక్రమంగా జమ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు. అలాగే విత్‌డ్రాయల్స్, ఇతర ఎంట్రీలను కూడా ట్రాక్ చేయవచ్చు.

46
చివరి 5 పీఎఫ్ ట్రాన్సాక్షన్లు చూసుకోవడం ఎలా?
Image Credit : Gemini తో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

చివరి 5 పీఎఫ్ ట్రాన్సాక్షన్లు చూసుకోవడం ఎలా?

ఈపీఎఫ్ఓ పోర్టల్‌లోకి వెళ్లకుండానే మీ ఖాతాలో జరిగిన చివరి 5 లావాదేవీలను కూడా వాట్సాప్‌లోనే చూసుకోవచ్చు. అధికారిక ఈపీఎఫ్ఓ నంబర్‌తో చాట్ ప్రారంభించాక, మెనూలో ఉండే ‘Last 5 Transactions’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేసి, సంబంధిత పీఎఫ్ ఖాతాను ఎంచుకుంటే మీ రీసెంట్ ట్రాన్సాక్షన్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

56
ఒకవేళ వాట్సాప్ సర్వీస్ పనిచేయకపోతే ఏం చేయాలి?
Image Credit : Gemini తో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

ఒకవేళ వాట్సాప్ సర్వీస్ పనిచేయకపోతే ఏం చేయాలి?

ఈ సేవను ఇటీవలే ప్రారంభించినందున, చాట్‌బాట్ వాడేటప్పుడు లేదా ఓటీపీ రావడంలో కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు ఎదురుకావచ్చు. అలాంటప్పుడు మీరు సరైన ఈపీఎఫ్ఓ నంబర్‌కే మెసేజ్ చేస్తున్నారో లేదో, మీ మొబైల్ నంబర్ యూఏఎన్‌తో రిజిస్టర్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.

వెరిఫికేషన్ ఫెయిల్ అయితే కాసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి. ఒకవేళ వాట్సాప్ సదుపాయం అందుబాటులో లేకపోతే, సభ్యులు ఎప్పటిలాగే ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా తమ పాస్‌బుక్, ఇతర వివరాలను పొందవచ్చు.

66
ఫేక్ నంబర్లతో జాగ్రత్త
Image Credit : Asianet News

ఫేక్ నంబర్లతో జాగ్రత్త

ఈ వాట్సాప్ సేవను ఉపయోగించేటప్పుడు సభ్యులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం ఈపీఎఫ్ఓ అధికారిక వాట్సాప్ నంబర్‌తో మాత్రమే చాట్ చేయాలి. సంస్థ ప్రతినిధులమని చెప్పి ఎవరైనా అడిగినా సరే.. మీ యూఏఎన్ పాస్‌వర్డ్, బ్యాంక్ వివరాలు, ఏటీఎం పిన్ లేదా ఇతర సున్నితమైన వివరాలను అస్సలు షేర్ చేయవద్దు.

అధికారిక వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా మాత్రమే ఓటీపీలను ఎంటర్ చేయాలి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ వాట్సాప్ సదుపాయం కేవలం పీఎఫ్ అకౌంట్ వివరాలను సులభంగా తెలుసుకోవడానికి మాత్రమే. దీని ద్వారా పీఎఫ్ విత్‌డ్రాయల్ క్లెయిమ్స్ చేయడం గానీ, పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం గానీ సాధ్యం కాదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం
 
3rd ODI • AUS vs ENG 2026
Live
AUSAUS
-
ENGENG
(19.0 ov)126/2
ENG chose to bat.
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Live
PAKPAK
(42.0 ov)135/4
SLSL
98
Day 2 - Session 1
Schedule ›
26th T20 • WBBLT20
HH-WHH-W
Thu, 19 Nov, 2026
PS-WPS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
BH-WBH-W
Thu, 19 Nov, 2026
ST-WST-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఐఐటీలో చ‌దివి నెయ్యి వ్యాపారం మొద‌లుపెట్టాడు.. రూ.1,000 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు
Recommended image2
భార‌త్‌లో రూ. 65 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌నున్న అమెజాన్‌.. ఏ రాష్ట్రంలో ఏంతంటే?
Recommended image3
Gold Silver Price: ఏంటీ ఇది నిజమా? రూ.లక్షకు పడిపోతున్న బంగారం, కుప్పకూలుతున్న వెండి
Related Stories
Recommended image1
Laknavaram Lake: తెలంగాణ మాల్దీవులు.. కోనసీమను తలపించే ప్రకృతి అందాలు.. ఒక్కసారైనా చూడాల్సిందే
Recommended image2
Dinosaur Fish: ఈ ఒక్క చేప గుడ్లు అమ్మితే లైఫ్ సెటిల్ అయిపోద్ది.. వీటి ధర తెలిస్తే కళ్లు తిరగాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved