MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Saving Scheme: రూ. 1 ల‌క్ష పెట్టుబ‌డిపై రూ. 64 వేల వ‌డ్డీ.. ఈ సంక్షోభ స‌మ‌యంలో ఇదే స‌రైన ఆప్ష‌న్‌

Saving Scheme: రూ. 1 ల‌క్ష పెట్టుబ‌డిపై రూ. 64 వేల వ‌డ్డీ.. ఈ సంక్షోభ స‌మ‌యంలో ఇదే స‌రైన ఆప్ష‌న్‌

Saving Scheme: స్టాక్ మార్కెట్‌లో ఇటీవల భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మార్కెట్ పతనంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో రిస్క్ లేకుండా గ్యారంటీ రాబడి కోరుకునే వారికి భారతీయ స్టేట్ బ్యాంక్‌ (SBI) మంచి అవకాశం అందిస్తోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 20 2026, 09:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎస్‌బీఐ ఎఫ్‌డీల‌కు పెరుగుతోన్న ఆద‌ర‌ణ
Image Credit : Getty

ఎస్‌బీఐ ఎఫ్‌డీల‌కు పెరుగుతోన్న ఆద‌ర‌ణ

షేర్ మార్కెట్‌లో లాభాలు ఎంత వేగంగా వస్తాయో, నష్టాలు కూడా అంతే వేగంగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రస్తుతం చాలా మంది పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో SBI అందిస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు మళ్లీ ఆకర్షణగా మారాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన SBIలో పెట్టుబడి పెడితే భద్రతతో పాటు గ్యారంటీ రిటర్న్స్ కూడా లభిస్తాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ అదనపు వడ్డీ ప్రయోజనాలు అందిస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు FD అవకాశం
Image Credit : Asianet News

7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు FD అవకాశం

ఎస్‌బీఐలో కనీసం 7 రోజుల నుంచి గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు FD ఖాతా తెరవొచ్చు. డిపాజిట్ కాలవ్యవధిని బట్టి బ్యాంక్ 3.05 శాతం నుంచి 7.15 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. ప్రస్తుతం 5 నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి ఉన్న FDలపై సాధారణ ఖాతాదారులకు 6.05 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.15 శాతం వరకు వడ్డీ అందిస్తున్నారు.

Related Articles

Related image1
Projector: రూ. 3 వేల‌తో మీ ఇంటిని థియేట‌ర్‌గా మార్చేయండి.. హైఎండ్ ఫీచ‌ర్ల‌తో స్మార్ట్ ప్రొజెక్ట‌ర్‌
Related image2
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 700 కోట్ల‌తో, 63 అంత‌స్థుల అపార్ట్‌మెంట్‌, ఒక్క ప్లాట్ ధ‌ర రూ. 6.2 కోట్లు
35
సాధారణ ఖాతాదారులకు ఎంత లాభం?
Image Credit : Asianet News

సాధారణ ఖాతాదారులకు ఎంత లాభం?

ఒక సాధారణ పెట్టుబడిదారు SBIలో 7 సంవత్సరాల కాలానికి రూ.1 లక్ష FD చేస్తే, మెచ్యూరిటీ పూర్తయ్యే సమయానికి మొత్తం రూ.1,52,246 పొందుతారు. ఇందులో అసలు పెట్టుబడి రూ.1 లక్ష కాగా, వడ్డీ రూపంలో మాత్రమే రూ.52,246 లభిస్తుంది. రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా భావిస్తున్నారు.

45
సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్లకు భారీ ప్రయోజనం
Image Credit : stockPhoto

సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్లకు భారీ ప్రయోజనం

సీనియర్ సిటిజన్లు అదే రూ.1 లక్షను 7 సంవత్సరాల FDలో పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ.1,63,101 లభిస్తుంది. ఇందులో వడ్డీ రూపంలో రూ.63,101 వస్తుంది. అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లకు ఇంకా ఎక్కువ ప్రయోజనం లభిస్తోంది. వారికి మెచ్యూరిటీ పూర్తయ్యే సరికి మొత్తం రూ.1,64,227 అందుతుంది. అంటే కేవలం వడ్డీ ద్వారానే రూ.64,227 ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

55
రిస్క్ లేకుండా సురక్షిత పెట్టుబడి
Image Credit : Groww

రిస్క్ లేకుండా సురక్షిత పెట్టుబడి

మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో బ్యాంక్ FDలు మళ్లీ సురక్షిత పెట్టుబడిగా మారుతున్నాయి. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు, రిస్క్ తీసుకోలేని పెట్టుబడిదారులు FDలపై ఆసక్తి చూపుతున్నారు. షేర్ మార్కెట్‌లో నష్టాల భయం లేకుండా స్థిరమైన వడ్డీతో డబ్బు పెంచుకోవాలనుకునే వారికి SBI FD స్కీమ్ మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays: వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పటినుంచో తెలుసా?
Recommended image2
Gold Price Hike: పసిడి ప్రియులకు బిగ్ షాక్...మళ్లీ ఆకాశాన్నింటిన బంగారం ధరలు
Recommended image3
Heat Insurance: ఎండ తీవ్రత పెరిగితే చాలు.. ఆటోమేటిక్‌గా మీ అకౌంట్లోకి డబ్బులు.. ఎలాగో తెలుసా?
Related Stories
Recommended image1
Projector: రూ. 3 వేల‌తో మీ ఇంటిని థియేట‌ర్‌గా మార్చేయండి.. హైఎండ్ ఫీచ‌ర్ల‌తో స్మార్ట్ ప్రొజెక్ట‌ర్‌
Recommended image2
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 700 కోట్ల‌తో, 63 అంత‌స్థుల అపార్ట్‌మెంట్‌, ఒక్క ప్లాట్ ధ‌ర రూ. 6.2 కోట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved