MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Heat Insurance: ఎండ తీవ్రత పెరిగితే చాలు.. ఆటోమేటిక్‌గా మీ అకౌంట్లోకి డబ్బులు.. ఎలాగో తెలుసా?

Heat Insurance: ఎండ తీవ్రత పెరిగితే చాలు.. ఆటోమేటిక్‌గా మీ అకౌంట్లోకి డబ్బులు.. ఎలాగో తెలుసా?

Heat Insurance: దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ తీవ్రమవుతున్న ఎండల నేపథ్యంలో కొత్తగా 'హీట్ ఇన్సూరెన్స్' అందుబాటులోకి వచ్చింది. అసలు ఏంటి ఈ హీట్ ఇన్సూరెన్స్? దీని ప్రీమియం ధరలు, ప్రయోజనాలు, క్లెయిమ్ రూల్స్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : May 20 2026, 11:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దేశంలో హీట్ ఇన్సూరెన్స్: ఎండ తీవ్రత పెరిగితే ఇక ఫైనాన్షియల్ సేఫ్టీ
Image Credit : gemini

దేశంలో హీట్ ఇన్సూరెన్స్: ఎండ తీవ్రత పెరిగితే ఇక ఫైనాన్షియల్ సేఫ్టీ

దేశంలో వేసవి కాలం రోజురోజుకూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. గత కొన్ని ఏళ్లుగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండలు, వడదెబ్బలు కేవలం ఒక సీజనల్ సమస్య మాత్రమే కాదు, ఇవి ప్రజల ఆరోగ్యాన్ని, సంపాదనను దెబ్బతీసే పెద్ద విపత్తుగా మారాయి.

ఎండల వల్ల హాస్పిటల్ పాలవ్వడం, ప్రాణాలు కోల్పోవడం, ఉపాధి కోల్పోవడం వంటి సంఘటనలు చూస్తున్నాం. ముఖ్యంగా బయట తిరిగే డెలివరీ బాయ్స్, కూలీలు, వృద్ధులు దీనివల్ల ఎక్కువగా నష్టపోతున్నారు. ఈ క్లైమేట్ రిస్క్ నుండి ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడానికే ఇప్పుడు భారతదేశంలో 'హీట్ ఇన్సూరెన్స్' అనే కొత్త కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది.

CEEW (కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్) చేసిన విశ్లేషణ ప్రకారం.. భారతదేశంలోని 57 శాతం జిల్లాల్లో అంటే దాదాపు 76 శాతం జనాభా పై తీవ్రమైన ఎండల ముప్పు పొంచి ఉంది. దేశంలో పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి వేళల్లో వేడి విపరీతంగా పెరుగుతోందని, దీనివల్ల ప్రజల ఆరోగ్యం మరింత పాడవుతోందని ఈ రిపోర్టు వెల్లడించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, గోవా, కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాలు ఈ హీట్ వేవ్స్ వల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హీట్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?
Image Credit : ai photo

హీట్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?

హీట్ ఇన్సూరెన్స్ అనేది వాతావరణ మార్పుల వల్ల వచ్చే నష్టాల నుండి రక్షణ కల్పించే ఒక ప్రత్యేకమైన ఇన్సూరెన్స్ విధానం. సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో మనం హాస్పిటల్‌లో జాయిన్ అయిన తర్వాత, బిల్లులు సబ్మిట్ చేస్తేనే డబ్బులు వస్తాయి. కానీ హీట్ ఇన్సూరెన్స్ చాలావరకు పారామెట్రిక్ మోడల్‌పై పనిచేస్తుంది. 

అంటే, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉష్ణోగ్రత ఒక పరిమితి దాటి, వరుసగా కొన్ని రోజుల పాటు అలాగే కొనసాగితే, ఇన్సూరెన్స్ సంస్థలు ఆటోమేటిక్‌గా క్లెయిమ్ అమౌంట్‌ను విడుదల చేస్తాయి. దీనికోసం ప్రత్యేకంగా హాస్పిటల్ బిల్లులు చూపించాల్సిన అవసరం ఉండదు.

Related Articles

Related image1
WhatsApp: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు పండగే.. వాట్సాప్‌లోనే పీఎఫ్ సేవలు
Related image2
Weather : బాబోయ్ ఎండలు.. ఈ జిల్లాల వాళ్ళు అస్సలు బయటకు రావొద్దు !
36
ఇండియాలో దీని ప్రాధాన్యం ఎందుకు పెరుగుతోంది?
Image Credit : Gemini AI

ఇండియాలో దీని ప్రాధాన్యం ఎందుకు పెరుగుతోంది?

మన దేశంలో ఎండల తీవ్రత వల్ల మెడికల్ ఖర్చులు, జీవనోపాధి నష్టం భారీగా పెరుగుతున్నాయి. తీవ్రమైన ఎండల వల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్, కిడ్నీ సమస్యలు, తీవ్రమైన అలసట వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటివల్ల హాస్పిటల్‌లో చేరాల్సి రావచ్చు. రోజువారీ కూలీలు ఎండల వల్ల పనికి వెళ్లలేక ఆదాయం కోల్పోతారు. ఇంకోవైపు ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు వాడటం వల్ల కరెంట్ బిల్లులు కూడా పెరుగుతాయి.

46
ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉంటుంది?
Image Credit : Getty

ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉంటుంది?

భారతదేశంలో హీట్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడిప్పుడే పుడుతున్న ఒక కొత్త కేటగిరీ. అందువల్ల దీని ధరలు అనేవి ఇన్సూరెన్స్ కవరేజ్ అమౌంట్, కాలపరిమితి, మీరు ఉండే ప్రాంతం, మీరు చేసే పని, మీ రిస్క్ కేటగిరీపై ఆధారపడి ఉంటాయి. ఎండల వల్ల ఎక్కువ రిస్క్ ఉన్న వృత్తుల్లో ఉండేవారికి ప్రీమియం మారుతుంది.

ప్రస్తుతం ఇన్సూరెన్స్ కంపెనీలు విడిగా హీట్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వడం కంటే, ఇప్పటికే ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్‌కు యాడ్ ఆన్ లేదా రైడర్స్ రూపంలో వీటిని అందిస్తున్నాయి. ప్రాథమిక స్థాయి క్లైమేట్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్స్ ఏడాదికి కేవలం కొన్ని వందల రూపాయల నుంచే ప్రారంభం కావచ్చు. పెద్ద బిజినెస్‌లు లేదా ఎక్కువ రిస్క్ ఉన్న కార్మికుల కోసం కవరేజ్ ప్లాన్ల ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొన్ని కంపెనీలు తమ కార్మికుల కోసం తామే స్వయంగా ఈ కవరేజ్ తీసుకుంటున్నాయి.

56
ఈ ఇన్సూరెన్స్ లో ఏమేం కవర్ అవుతాయి?
Image Credit : iSTOCK

ఈ ఇన్సూరెన్స్ లో ఏమేం కవర్ అవుతాయి?

హీట్ ఇన్సూరెన్స్ పాలసీని బట్టి కవరేజ్ మారుతుంది. సాధారణంగా ఇందులో వడదెబ్బ తగిలి హాస్పిటల్ పాలైతే అయ్యే ఖర్చులు, ఎమర్జెన్సీ మెడికల్ ఖర్చులు, ఎండల వల్ల పని చేయలేకపోయినప్పుడు వచ్చే ఆదాయ నష్టం కవర్ అవుతాయి. కొన్ని పాలసీలలో విపరీతమైన వేడి వల్ల కూలింగ్ ఎక్విప్‌మెంట్ పాడైనా, లేదా వేరే ప్రాంతానికి తాత్కాలికంగా మారాల్సి వచ్చినా సాయం అందిస్తారు.

తీవ్రమైన వాతావరణం వల్ల వ్యాపారాలు మూతపడి నష్టం వస్తే దానికి కూడా పరిహారం లభిస్తుంది. అయితే, హీట్ ఇన్సూరెన్స్ అనేది రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు ప్రత్యామ్నాయం కాదు. వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి వాటికి పెద్ద మొత్తంలో హాస్పిటల్ ఖర్చులు కవర్ అవ్వాలంటే నార్మల్ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. హీట్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఒక అదనపు రక్షణ పొర లాంటిది మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.

66
పాలసీ తీసుకునే ముందు చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి?
Image Credit : iSTOCK

పాలసీ తీసుకునే ముందు చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి?

ఇండియాలో ఇన్సూరెన్స్ రంగం కేవలం సమస్య వచ్చాక స్పందించే స్థాయి నుండి, ముందే జాగ్రత్తలు తీసుకునే స్థాయికి మారుతోందని ఈ రంగం నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే డిసీజ్-స్పెసిఫిక్ ప్లాన్లు, వెల్‌నెస్ బెనిఫిట్స్, మోడ్యులర్ యాడ్-ఆన్స్ వంటివి వస్తున్నాయి. ఒక హీట్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే ముందు కస్టమర్లు కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. 

అందులో.. ఏ ఉష్ణోగ్రత దాటితే క్లెయిమ్ అమౌంట్ వస్తుంది? క్లెయిమ్ సెటిల్‌మెంట్ రూల్స్ ఏంటి? మినహాయింపులు ఏమున్నాయి? వెయిటింగ్ పీరియడ్ ఎంత? ఆదాయ నష్టానికి ఎంత పరిహారం ఇస్తారు? మీ పాత హెల్త్ ఇన్సూరెన్స్ లోనే ఇవి కవర్ అవుతున్నాయా లేదా? వంటివి సరిచూసుకోవాలి. ఎండల నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమో, ఎండలో తిరగకుండా ఉండటం, ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటం వంటి వ్యక్తిగత జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యమని డాక్టర్లు, నిపుణులు సూచిస్తున్నారు.

ఒక చిన్న ఉదాహరణ..

తీవ్రమైన ఎండలు మండుతున్నా ఒక మహిళా కూలీ రోజూలాగే పనికి వెళ్ళింది. మధ్యాహ్నానికి ఆమె మొబైల్‌కు ఒక ఎస్ఎమ్ఎస్ వచ్చింది. అందులో ఆమె బ్యాంకు ఖాతాలో రూ. 500 జమ అయినట్లు ఉంది. మరుసటి రోజు ఎండల తీవ్రత ఇంకా పెరిగింది, ఆ రోజు ఏకంగా రూ. 1000 అకౌంట్లో పడ్డాయి. అంటే ఎండలు పెరిగితే ఖాతాలో డబ్బులు పడటమే హీట్ వేవ్ ఇన్సూరెన్స్ ప్రత్యేకత మరి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
వాతావరణం
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
WhatsApp: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు పండగే.. వాట్సాప్‌లోనే పీఎఫ్ సేవలు
Recommended image2
Weather : బాబోయ్ ఎండలు.. ఈ జిల్లాల వాళ్ళు అస్సలు బయటకు రావొద్దు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved