MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Hike: పసిడి ప్రియులకు బిగ్ షాక్...మళ్లీ ఆకాశాన్నింటిన బంగారం ధరలు

Gold Price Hike: పసిడి ప్రియులకు బిగ్ షాక్...మళ్లీ ఆకాశాన్నింటిన బంగారం ధరలు

Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే పసిడి ప్రియులకు మరో బిగ్ షాక్. ఒక్కరోజులోనే పసిడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర లక్షన్నర దాటేసింది. 

1 Min read
Author : Nandini Arava
Published : May 20 2026, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బంగారం ధరలకు రెక్కలు
Image Credit : Asianet News

బంగారం ధరలకు రెక్కలు

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు… అంతర్జాతీయ మార్కెట్లలో టెన్షన్… దీంతో బంగారం ధరలు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. ఇక ముందు ఇంకా పెరుగుతాయా? లేక తగ్గుతాయా?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు
Image Credit : AI

సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు బంగారం మార్కెట్‌ను మళ్లీ వేడెక్కిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, డాలర్ మార్పిడి ఒత్తిళ్లు కలిసి బులియన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు మళ్లీ సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న స్వల్పంగా పెరిగిన ధరలు నేడు అమాంతం ఎగబాకింది.

Related Articles

Related image1
Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !
Related image2
Gold Price Hike: యుద్ధం తాత్కాలిక వాయిదా..ట్రంప్ నిర్ణయంతో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
34
తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు
Image Credit : iSTOCK

తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. నగరంలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,310 పెరిగి రూ.1,58,350కు చేరుకుంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,45,150 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.980 పెరిగి రూ.1,18,760గా నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతున్న వేళ ధరలు ఈ స్థాయిలో పెరగడం సామాన్య కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

44
సందిగ్ధంలో కొనుగోలుదారులు
Image Credit : iSTOCK

సందిగ్ధంలో కొనుగోలుదారులు

నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా యుద్ధ భయాలు, అమెరికా వడ్డీ రేట్లపై అనిశ్చితి, గ్లోబల్ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్న నేపథ్యంలో పసిడి ధరలు త్వరలోనే మరోసారి కొత్త రికార్డులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయాలా? లేక మరికొంతకాలం వేచి చూడాలా? అన్న సందిగ్ధంలో కొనుగోలుదారులు ఉన్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Heat Insurance: ఎండ తీవ్రత పెరిగితే చాలు.. ఆటోమేటిక్‌గా మీ అకౌంట్లోకి డబ్బులు.. ఎలాగో తెలుసా?
Recommended image2
WhatsApp: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు పండగే.. వాట్సాప్‌లోనే పీఎఫ్ సేవలు
Recommended image3
Amazon Summer Sale : ఆఫర్లే ఆఫర్లు.. రూ.62000 ఏసీ కేవలం రూ.36000 కే..!
Related Stories
Recommended image1
Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !
Recommended image2
Gold Price Hike: యుద్ధం తాత్కాలిక వాయిదా..ట్రంప్ నిర్ణయంతో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved