MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • EPFO: ఏటీఎంలలోనే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు: ఎప్పటి నుంచో తెలుసా?

EPFO: ఏటీఎంలలోనే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు: ఎప్పటి నుంచో తెలుసా?

EPFO: ఏటీఎంలలోనే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఆ సమయం దగ్గర పడిందని కేంద్ర మంత్రుల ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఎప్పటి నుంచి ఏటీఎం, యూపీఐల ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.     

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 15 2025, 08:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయాలంటే ఇప్పటి వరకు ప్రాసెస్ చాలా పెద్దగానే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ జరిగే క్రమంలో అకౌంట్ నంబర్, ఆధార్, పాన్ కార్డులపై ఉన్న డీటైల్స్ మ్యాచ్ కాకపోతే రిజక్ట్ అయిపోతుంది. ఎలాగోలా అప్లికేషన్ ప్రాసెస్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తే డబ్బులు క్రెడిట్ అయిన తర్వాత విత్ డ్రా చేయడం పెద్ద పని. బ్యాంకుకు వెళ్లి డైరెక్ట్ గా క్యాష్ తీసుకోవాల్సి వచ్చేది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇప్పుడు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసే ప్రాసెస్ ను ఈజీ చేసింది. ఆన్ లైన్ లోనే ఈజీ విధానాల ద్వారా అప్లై చేసేలా సదుపాయం కల్పించింది. ఇప్పుడు కొత్తగా పీఎఫ్ డబ్బులు ఏటీఎంలలోనే విత్ డ్రా చేసుకొనేలా సౌకర్యం కల్పిస్తోంది. అయితే ఈ వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కాని ఎప్పటి నుంచి ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుందన్న సమాచారం మాత్రం లేదు. 

35

ATM ద్వారా EPFO మొత్తం

ఇటీవల మీడియాతో మాట్లాడిన కార్మిక, ఉపాధి కార్యదర్శి సుమితా దావ్రా ఏటీఎం లలోనే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకొనే సదుపాయాన్ని మే నెల చివరిలో లేదా జూన్ నెలలోపు అందుబాటులోకి వస్తుందని ధృవీకరించారు. ఈ విషయంపై టెస్టింగ్ పూర్తయిందని, త్వరలో EPFO అభ్యర్థనల కోసం UPI ఫ్రంట్-ఎండ్‌ను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. సభ్యులు తమ EPF ఖాతాలను UPI ఇంటర్‌ఫేస్ ద్వారా నేరుగా యాక్సెస్ చేయవచ్చని కూడా అన్నారు. అంతేకాకుండా ఆటోమేటెడ్ అభ్యర్థనలను చేయవచ్చని, అన్ని అర్హతలు ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ తక్షణమే పూర్తవుతుందని వివరించారు. 

45

EPFOలో ఎంత డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు?

పీఎఫ్ ఖాతాదారులు ఆటోమేటెడ్ ప్రాసెస్ ద్వారా రూ.1 లక్ష వరకు తక్షణమే తీసుకోవచ్చు. డబ్బు బదిలీల కోసం వారికి నచ్చిన బ్యాంక్ ఖాతాను కూడా ఎంచుకోవచ్చు. ప్రస్తుతం క్లెయిమ్ పరిష్కారాలు 2 నుంచి 3 రోజులు పడుతుంది. కానీ UPI ఇంటిగ్రేషన్‌తో విత్ డ్రా ప్రాసెస్ కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తవుతాయి. 

55

వైద్యం కోసమే కాదు.. ఇతర అవసరాలకు కూడా..

నిధుల వినియోగం పరిధిని కూడా EPFO పెంచింది. అంటే వైద్య అత్యవసర పరిస్థితులకు మాత్రమే డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు అదనంగా గృహనిర్మాణం, విద్య, వివాహం కోసం విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ మార్పును సులభతరం చేయడానికి, 120కి పైగా డేటాబేస్‌లను ఇంటిగ్రేట్ చేశారు. 95% క్లెయిమ్‌లు ఇప్పుడు ఆటోమేటిక్ గా పూర్తవుతున్నాయి. 

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
ప్రభుత్వ పథకాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image3
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Related Stories
Recommended image1
PPF: సింపుల్ పెట్టుబడితో నెలకు రూ.80 వేల వరకు ఆదాయం: టాక్స్ కూడా కట్టక్కరలేదు
Recommended image2
పాన్ కార్డ్ మోసాలకు చెక్ పెట్టాలంటే కొత్త పాన్ కార్డ్ 2.0 తీసుకోండి: కేవలం రూ.50లే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved