MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Independence Day: 1947 vs 2026.. ఉద్యోగాల వేట ఎలా మారింది? ఏఐ దెబ్బకు ఏ ఉద్యోగాలు పోతున్నాయి?

Independence Day: 1947 vs 2026.. ఉద్యోగాల వేట ఎలా మారింది? ఏఐ దెబ్బకు ఏ ఉద్యోగాలు పోతున్నాయి?

India Independence Day 2026: గత 79 ఏళ్లలో భారత ఉద్యోగ రంగంలో ఊహించని మార్పులు జరిగాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి నేటి ఏఐ యుగం వరకు మన ఉద్యోగ రంగం ఎలా మారింది? 3 తరాల ఎంప్లాయ్‌మెంట్ ప్రయాణంపై జరిగిన మార్పులను గమనస్తే చాలా ఆసక్తికర విషయాలున్నాయి.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 12 2026, 02:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
79 ఏళ్ల స్వతంత్ర భారతం: వ్యవసాయం నుండి ఏఐ వరకు ఉద్యోగ ప్రయాణం
Image Credit : Chatgpt

79 ఏళ్ల స్వతంత్ర భారతం: వ్యవసాయం నుండి ఏఐ వరకు ఉద్యోగ ప్రయాణం

రెండేళ్ల కిందటి తరానికి ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం. పింఛను గ్యారంటీ. ఆ తర్వాత తరానికి ఉద్యోగం అంటే ప్రైవేట్ కంపెనీలో నెలనెలా వచ్చే జీతం. మరి ఈనాటి జనరేషన్ పరిస్థితి ఏంటి? ఇవాళ సెక్యూరిటీ అంటే ఒక ఒకే కంపెనీలో ఉండే ఉద్యోగం కాదు, నేర్చుకున్న స్కిల్స్, ఆ తర్వాత దక్కించుకునే కొత్త గిగ్ వర్క్. ఒకే ప్రశ్నకు మూడు తరాలు పూర్తి భిన్నమైన సమాధానాలు ఇచ్చాయి. ఒక ఉద్యోగం మనిషికి నిజంగా ఏమి గ్యారంటీ ఇస్తుంది?

భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఉద్యోగ రంగం వేర్వేరు దశలను చూసిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆయా కాలాల్లో ఏ రంగాలు ఆధిపత్యం చెలాయించాయనే దానికంటే, ఆ ఉద్యోగాలు కార్మికులకు ఏమి అందించాయనేదే ఇక్కడ ముఖ్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1947 నుండి 1980 వరకు: భద్రతే ప్రధాన ధ్యేయం
Image Credit : Chatgpt.com\pinterest

1947 నుండి 1980 వరకు: భద్రతే ప్రధాన ధ్యేయం

1947 నుంచి 1980 వరకు ఉన్న కాలాన్ని సెక్యూరిటీ యుగం అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయం మాత్రమే సామాజిక భద్రతకు పునాదిగా ఉండేవి. ఒకసారి ఉద్యోగంలో చేరితే జీవితాంతం ఒకే సంస్థలో పనిచేయడమే అప్పటి సంప్రదాయం.

ఆనాటి ముద్ర నేటికీ పూర్తిగా చెరిగిపోలేదు. దేశ జిడిపిలో వ్యవసాయం వాటా ఐదవ వంతు కంటే తక్కువగానే ఉన్నప్పటికీ, నేటికీ 46 శాతం మంది ఉపాధి కోసం దానిపైనే ఆధారపడుతున్నారు. 1991 ఆర్థిక సంస్కరణలకు ముందు పరిస్థితి ఇది. 1983-84 ఆర్‌బిఐ డేటా ప్రకారం, పది మందిలో ఏడుగురు భూమిపైనే ఆధారపడ్డారు. వర్షాలపైనే ఆధారపడే ఈ ఉపాధికి మార్కెట్‌తో సంబంధం ఉండేది కాదు. అప్పట్లో నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ సర్వీస్ (1945), క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ (1950), అప్రెంటిస్‌షిప్ యాక్ట్ (1961) వంటివి పరిమిత ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చేవి.

Related Articles

Related image1
Konaseema: కేరళ కాదు గురూ.. మన ఏపీలోని ఈ రివర్ ప్యారడైజ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
Related image2
Weather Update: ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్
36
1991 సంస్కరణలు: తెరుచుకున్న గ్లోబల్ మార్కెట్
Image Credit : Getty

1991 సంస్కరణలు: తెరుచుకున్న గ్లోబల్ మార్కెట్

1991లో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు భారత ఉద్యోగ రంగాన్ని మలుపు తిప్పాయి. ఉద్యోగం అంటే ప్రభుత్వం కేటాయించడం కాదు, ఓపెన్ మార్కెట్‌లో ప్రతిభ ద్వారా సంపాదించుకోవడం అనే కొత్త శకం ఇక్కడే మొదలైంది. సంస్కరణల వల్ల మూలధనం, వ్యాపార స్వేచ్ఛ పెరిగి, భారతీయ ప్రతిభను ప్రపంచ మార్కెట్లు గుర్తించాయి.

ఈ మార్పు గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 1980-81లో జీడీపీలో 15 శాతంగా ఉన్న విదేశీ వాణిజ్యం, 2005-06 నాటికి 34 శాతానికి పెరిగింది. అలాగే 1991లో 0.3 శాతంగా ఉన్న ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు 2005 నాటికి 5.8 శాతానికి చేరాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ రిపోర్టు పేర్కొంది.

46
ఐటీ విప్లవం: సాంకేతిక రంగంలో ఊహించని మార్పులు
Image Credit : Gemini AI

ఐటీ విప్లవం: సాంకేతిక రంగంలో ఊహించని మార్పులు

మూడో దశలో భారతీయ నైపుణ్యాల విలువ అంతర్జాతీయ స్థాయికి చేరింది. బెంగళూరులోని నిపుణులు అంతర్జాతీయ ఐటీ సంస్థల టాలెంట్‌తో నేరుగా పోటీపడటం ప్రారంభించారు. ప్రస్తుతం మన దేశంలో సాంకేతిక రంగం ఒక్కటే 5.8 మిలియన్ల మందికి పైగా నిపుణులకు ఉపాధి కల్పిస్తోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ఈ ఐటీ విప్లవం ఉద్యోగ స్వభావాన్ని కూడా మార్చేసింది. ఒకే హోదాలో నిలిచిపోయే పాత పద్ధతి పోయి, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం అవసరంగా మారింది. ఇప్పుడు ఉద్యోగాల హోదాల కంటే వ్యక్తికి ఉన్న నైపుణ్యాలకే ఎక్కువ విలువ లభిస్తోంది.

56
స్కిల్ గ్యాప్, ఐటి సవాళ్లు
Image Credit : Gemini AI

స్కిల్ గ్యాప్, ఐటి సవాళ్లు

ఒకవైపు ఐటీ విప్లవం వచ్చినప్పటికీ, మరోవైపు నైపుణ్యాల కొరత స్పష్టంగా కనిపించింది. 2005లో దేశంలో దాదాపు 105 మిలియన్ల మంది వర్కింగ్ పూర్ ఉన్నారని ఐఎల్ఓ పేర్కొంది. వీరు పనిచేస్తున్నప్పటికీ కనీస పేదరిక రేఖకు సరిపడా ఆదాయం పొందలేకపోయారు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ రిపోర్టు ప్రకారం, భారత వర్క్‌ఫోర్స్‌లో 88 శాతం మంది తక్కువ నైపుణ్యం కలిగిన పనుల్లోనే ఉన్నారు.

కేవలం 10 నుండి 12 శాతం మందికి మాత్రమే అధిక నైపుణ్యం ఉన్న ఉద్యోగాలు దక్కాయి. 2024 ఐఎల్ఓ రిపోర్టు ప్రకారం, నిరక్షరాస్యత ఉన్న యువతలో నిరుద్యోగిత 3.4 శాతంగా ఉంటే, డిగ్రీ చదివిన యువతలో అది 29.1 శాతంగా ఉంది. టైప్‌రైటర్ల నుండి ఏఐ వరకు సాంకేతికత మారినా, ఎంప్లాయర్ కోరుకునే స్కిల్స్, వర్కర్ల వద్ద ఉన్న స్కిల్స్ మధ్య తేడా అలానే ఉంది.

66
ఏఐ యుగం: 2047 వైపు భారత్
Image Credit : Getty

ఏఐ యుగం: 2047 వైపు భారత్

ప్రస్తుతం ఏఐ ప్రభావంతో వైట్ కాలర్ ఉద్యోగాలు సైతం ప్రభావితమవుతున్నాయి. అనేక సాంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయి. దీనివల్ల ఫ్రీలాన్సింగ్, గిగ్ వర్క్, చిన్న వ్యాపారాల వైపు యువత మొగ్గు చూపుతున్నారు. అయితే బ్లూ కాలర్, గ్రే కాలర్ ఉద్యోగాలు (డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, ఫ్యాక్టరీ కార్మికులు) సురక్షితంగానే ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

పలు రిపోర్టుల ప్రకారం.. ఏఐ వల్ల ఉద్యోగాలు పూర్తిగా పోవడం లేదు, కానీ పనుల విభజన జరుగుతోంది. ఏఐ, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ సాంకేతికతల్లో నైపుణ్యం ఉన్నవారికి జీతాలు 30 నుండి 40 శాతం పెరిగాయి.

వికసిత్ భారత్ 2047 దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. 2030 నాటికి దేశంలోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCC) దాదాపు 2.8 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తాయని అంచనా. ఉద్యోగాల ఎక్స్చేంజీల నుండి ఏఐ ఆధారిత రిక్రూట్‌మెంట్ వరకు భారత ఉద్యోగ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. కానీ రాబోయే తరం ఉద్యోగం నుండి ఎలాంటి భద్రతను కోరుకుంటుంది అనేది వేచి చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం
భారత దేశం
వ్యాపారం
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Cars Under 5 Lakhs: రూ.5 లక్షల లోపు కారు కొనాలనుకుంటే అదిరిపోయే మైలేజ్ ఇచ్చే 5 కార్లు ఇవిగో
Recommended image2
Gold Price Hike: నిన్న రూ.3 వేలు.. ఇవాళ మరో రూ.వెయ్యి...సామాన్యులపై బంగారం బాదుడు
Recommended image3
SIP Investment: సిప్‌లో నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేసి కోటి రూపాయలకు పైగా సంపాదించండి ఇలా
Related Stories
Recommended image1
Konaseema: కేరళ కాదు గురూ.. మన ఏపీలోని ఈ రివర్ ప్యారడైజ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved