MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Hydrogen Cooktop : గ్యాస్ సిలిండర్లతో పనిలేదు.. ఇక నీటితోనే వంట !

Hydrogen Cooktop : గ్యాస్ సిలిండర్లతో పనిలేదు.. ఇక నీటితోనే వంట !

Hydrogen Cooktop : ఎల్పీజీ సిలిండర్లు, పైపులైన్లతో పనిలేకుండా కేవలం నీటితో వంట చేసుకునేలా గ్రీన్ వైజ్ సంస్థ హైడ్రోజన్ కుక్‌టాప్‌ను ఆవిష్కరించింది. దీని పూర్తి వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 07 2026, 09:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వంట గ్యాస్‌కు ఇక గుడ్‌బై ! నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ వచ్చేసింది
Image Credit : X/GREENVIZE

వంట గ్యాస్‌కు ఇక గుడ్‌బై ! నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ వచ్చేసింది

ప్రస్తుతం వంట గ్యాస్ ధరలు సామాన్యుడికి గుదిబండలా మారుతున్నాయి. మరోవైపు యుద్ధాలు, అంతర్జాతీయ పరిణామాల వల్ల ఇంధన సరఫరాలో అంతరాయాలు కలుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారతీయ స్టార్టప్ 'గ్రీన్ వైజ్ ఎనర్జీ సొల్యూషన్స్' ఒక అద్భుతమైన ఆవిష్కరణతో ముందుకు వచ్చింది. అదే హైడ్రోజన్ ఆధారిత కుక్‌టాప్. సిలిండర్లు, గ్యాస్ పైప్‌లైన్లతో సంబంధం లేకుండా కేవలం నీటిని ఇంధనంగా మార్చి వంట చేసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
PEM టెక్నాలజీ.. ఇది ఎలా పనిచేస్తుంది?
Image Credit : Gemini

PEM టెక్నాలజీ.. ఇది ఎలా పనిచేస్తుంది?

ఈ హైడ్రోజన్ స్టవ్ వెనుక ఉన్న సాంకేతికత అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ (PEM) ఎలక్ట్రోలైజర్ అనే పరికరాన్ని అమర్చారు. మనం స్టవ్ నాబ్ తిప్పిన వెంటనే, అది నీటి అణువులను హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొడుతుంది. ఇలా విడుదలైన హైడ్రోజన్ వంటకు ఇంధనంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల గ్యాస్‌ను నిల్వ ఉంచాల్సిన అవసరం ఉండదు, అలాగే, పేలుళ్ల ప్రమాదం కూడా తప్పుతుంది.

35
పర్యావరణానికి మేలు.. ఇంట్లో స్వచ్ఛమైన గాలి
Image Credit : Gemini

పర్యావరణానికి మేలు.. ఇంట్లో స్వచ్ఛమైన గాలి

సాధారణ ఎల్పీజీ వాడినప్పుడు కార్బన్ ఉద్గారాలు విడుదలవుతాయి. కానీ ఈ హైడ్రోజన్ స్టవ్ వాడితే బై ప్రోడక్ట్ గా కేవలం నీటి ఆవిరి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా, నీటి నుంచి విడిపోయిన స్వచ్ఛమైన ఆక్సిజన్ గదిలోకి విడుదలవుతుంది. అంటే మీరు వంట చేస్తున్నప్పుడు మీ కిచెన్‌లోని గాలి మరింత శుద్ధి అవుతుందన్నమాట. ఇది ఒక రకంగా కిచెన్ లోపల ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌లా పనిచేస్తుంది.

45
కేవలం 100ml నీరు.. 6 గంటల వంట
Image Credit : Gemini

కేవలం 100ml నీరు.. 6 గంటల వంట

గ్రీన్ వైజ్ వ్యవస్థాపకులు సంజీవ్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్టవ్ పనిచేయడానికి కేవలం 100 మిల్లీలీటర్ల డిస్టిల్డ్ వాటర్ లేదా ఆర్వో వాటర్ ఉంటే సరిపోతుంది. ఈ కొద్దిపాటి నీటితో, సుమారు 1 కిలోవాట్ విద్యుత్‌తో ఏకధాటిగా 6 గంటల పాటు వంట చేసుకోవచ్చు. సాధారణ ఇండక్షన్ స్టవ్‌లతో పోలిస్తే ఇది చాలా తక్కువ విద్యుత్తును ఖర్చు చేస్తుంది. సాధారణ ఇండక్షన్ స్టవ్ 6 గంటల వినియోగానికి 9 నుంచి 12 యూనిట్ల విద్యుత్ తీసుకుంటే, ఇది కేవలం 1 యూనిట్ తోనే అదే పనిని పూర్తి చేస్తుంది.

55
సోలార్‌తో అనుసంధానం.. రూపాయి ఖర్చు లేని వంట
Image Credit : Gemini

సోలార్‌తో అనుసంధానం.. రూపాయి ఖర్చు లేని వంట

ఈ వ్యవస్థను మీ ఇంటి పైన ఉన్న సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్స్‌కు అనుసంధానించవచ్చు. దీనివల్ల గ్రిడ్ విద్యుత్ అవసరం లేకుండానే పూర్తిగా ఉచితంగా వంట చేసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో గృహ వినియోగదారులకే కాకుండా హోటళ్లు, కమర్షియల్ కిచెన్లకు కూడా ఒక గేమ్ ఛేంజర్ కానుంది. ప్రస్తుతం మార్కెట్లోకి సింగిల్ బర్నర్, డబుల్ బర్నర్ వేరియంట్లలో ఇవి అందుబాటులోకి వచ్చాయి.

హైడ్రోజన్ కుక్‌టాప్‌ ధర ఎంత?

సాంకేతికత కొత్తది కావడంతో ప్రారంభంలో దీని ధర కాస్త ఎక్కువగా ఉంది.

• సింగిల్ బర్నర్ హైడ్రోజన్ స్టవ్: రూ. 1,05,000 + GST

• డబుల్ బర్నర్ హైడ్రోజన్ స్టవ్: రూ. 1,50,000 + GST

ప్రస్తుతానికి ధర భారంగా అనిపించినా, దీర్ఘకాలంలో ఎల్పీజీ సిలిండర్ల ఖర్చును, పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత దేశం
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
IAS కంటే ఇన్ ఫ్లుయెన్సర్ల సంపాదన ఎక్కువా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ లెక్కలు!
Recommended image2
మీకో గుడ్ న్యూస్.. సర్కార్ అదిరిపోయే గిఫ్ట్.. ఇకపై సగానికే ఇన్సూరెన్స్ పాలసీలు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved