- Home
- Business
- Gold Rate Today: బంగారం ఇంత చవకా? తులం పసిడి ఎంత తగ్గిందో తెలుసా? సిల్వర్ కూడా పతనమైంది
Gold Rate Today: బంగారం ఇంత చవకా? తులం పసిడి ఎంత తగ్గిందో తెలుసా? సిల్వర్ కూడా పతనమైంది
Gold Rate Today: పసిడి ప్రియులకు ఇవాళ గుడ్ న్యూస్. నిన్నటివరకు బంగారం కొనాలంటే భయపడ్డారు. కానీ ఇప్పుడు ఆ భయం వద్దు. ఎందుకంటే పసిడి వేల రూపాయలు కుప్పకూలిపోయింది.

తులం బంగారం పడిపోయిందో తెలుసా?
ఈరోజు మార్కెట్ భారీ షాక్ ఇచ్చింది. ఒక్క రోజులోనే వేల రూపాయలు పతనమైంది. వెండి అయితే మరింత క్షీణించింది. ప్రస్తుతం తులం బంగారం ఎంతకు పడిపోయిందో తెలుసా.? ఈ తగ్గుదల వెనుక అసలు కారణాలను తెలుసుకుందాం.
పసిడి ప్రియులకు ఊరట
పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు ఇదొక ఊరటనిచ్చే వార్త. కొన్ని రోజులుగా పెరిగిపోయిన పసిడి ధరలు...ఇవాళ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే ధరలు కుప్పకూలిపోయాయి. ఇప్పుడు ఆభరణాలు కొనుక్కోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, డాలర్ మార్పుల వల్ల దేశీయంగా బంగారం ధరలు వేల రూపాయల్లో దిగొచ్చాయి.
ఇదొక మంచి అవకాశం
ఇక ఇవాళ హైదరాబాద్ లో ధరలు చూసుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.4,300 తగ్గి రూ.1,48,860కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,950 పడిపోయి రూ.1,36,450 వద్ద స్థిరపడింది. బంగారం మాత్రమే కాదు వెండి కూడా అదే బాటలో నడుస్తోంది. ఒక్కరోజులోనే రూ.10వేలు దిగొచ్చిరూ.2.60లక్షలకు చేరిపోయింది.
ఈ ధరల మార్పుల కారణంగా బంగారం కొనాలనుకునేవారికి ఇదొక మంచి అవకాశమని నిపుణులు భావిస్తున్నారు. ఇది తాత్కాలిక మార్కెట్ ఒత్తిడి కాబట్టి...కాస్త గమనించుకోవాలని సూచిస్తున్నారు.
మూడు కారణాలు
అసలు బంగారం, గోల్డ్ రేట్లు ఇలా ఎందుకు దిశ మార్చుకున్నాయంటే...మూడు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది...అంతర్జాతీయ మార్కెట్ల అనిశ్చితి. రెండోది డాలర్ బలపడుతోంది. ఇక మూడోది గ్లోబల్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం. ఈ ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‍పై స్పష్టంగా కనిపిస్తోంది.

