MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • IAS కంటే ఇన్ ఫ్లుయెన్సర్ల సంపాదన ఎక్కువా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ లెక్కలు!

IAS కంటే ఇన్ ఫ్లుయెన్సర్ల సంపాదన ఎక్కువా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ లెక్కలు!

Instagram Influencers Income vs IAS IPS Salary : ఇండియాలో ఇంటర్నెట్ విప్లవం తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆదాయం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల జీతాలను మించిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు !

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 07 2026, 06:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇన్ స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ తో రచ్చ చేస్తున్న కేరళ బ్యూటీ
Image Credit : Gemini

ఇన్ స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ తో రచ్చ చేస్తున్న కేరళ బ్యూటీ

భారతదేశంలో గత కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం ఊహించని రీతిలో పెరిగింది. తక్కువ ధరకు డేటా లభిస్తుండటంతో సామాన్యులు సైతం సోషల్ మీడియాలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్రియేటర్ ఎకానమీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ ప్రవేశపెట్టిన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. దేశం కోసం అహర్నిశలు శ్రమించే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కంటే, సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పెట్టే వారు కోట్లలో సంపాదిస్తుండటం గమనార్హం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నెలకు 90 లక్షల ఆదాయం?
Image Credit : Gemini

నెలకు 90 లక్షల ఆదాయం?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. కేరళకు చెందిన ఒక ప్రముఖ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ తన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం నెలకు ₹400 నుండి ₹500 వరకు వసూలు చేస్తోంది. ఆమెకు వేల సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు ఉండటంతో, ఆమె నెలవారీ ఆదాయం సుమారు ₹90 లక్షల వరకు ఉంటుందని అంచనా. కేవలం ఫోటోలు, వీడియోల ద్వారా ఇంత భారీ మొత్తంలో డబ్బు సంపాదించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పురుషుల బలహీనతలను సొమ్ము చేసుకుంటూ ఇలాంటి ఆదాయం గడిస్తున్నారని కొందరు మండిపడుతున్నారు.

34
అధికారుల జీతాలతో పోలిక
Image Credit : Gemini

అధికారుల జీతాలతో పోలిక

ఈ ఆదాయాలను దేశంలోని అత్యున్నత పదవులతో పోలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీ (IAS) నెలకు దాదాపు ₹5,00,000 వేతనం అందుకుంటారు. ఉన్నత స్థాయి ఐపీఎస్ లేదా ఐఎఫ్ఎస్ అధికారుల జీతం సుమారు ₹3,00,000 మాత్రమే. అలాగే ప్రభుత్వ స్పెషలిస్ట్ డాక్టర్లు ₹5,00,000, చీఫ్ ఇంజనీర్లు ₹2,50,000, చార్టర్డ్ అకౌంటెంట్లు ₹2,00,000 వరకు సంపాదిస్తారు. కానీ, ఇన్ స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ముస్కాన్ కారియా వంటి వారు బ్రాండ్ కొలాబరేషన్లు, ప్రమోషన్ల ద్వారా నెలకు ₹14,00,000 వరకు గడిస్తున్నట్లు సమాచారం.

44
మారుతున్న కెరీర్ ధోరణులు
Image Credit : Gemini

మారుతున్న కెరీర్ ధోరణులు

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి దేశ సేవ చేసే అధికారుల కంటే, కేవలం గ్లామర్, విజిబిలిటీని నమ్ముకున్న వారి ఆదాయం ఎక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరిన వారి కంటే, సోషల్ మీడియాలో స్కిన్ షో చేసే వారు ఎక్కువ సంపాదిస్తున్నారని నెటిజన్లు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. అయితే, డిజిటల్ యుగంలో వ్యక్తిగత బ్రాండింగ్, రీచ్ కు ఉన్న విలువకు ఇది నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, ఈ ఆదాయ వ్యత్యాసాలు యువత కెరీర్ లక్ష్యాలను మారుస్తున్నాయనేది వాస్తవం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ఉద్యోగాలు, కెరీర్
వ్యాపారం
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
Mercy Killing: కారుణ్య మరణం అంటే ఏమిటి? ఏ దేశంలో ఎలా ప్రాణాలు తీస్తారు?
Recommended image2
మీకో గుడ్ న్యూస్.. సర్కార్ అదిరిపోయే గిఫ్ట్.. ఇకపై సగానికే ఇన్సూరెన్స్ పాలసీలు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved