MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Income Tax: ఏప్రిల్ 1 నుండి కొత్త ఇన్‍కమ్ టాక్స్ రూల్స్.. ఉద్యోగులకు పండగే

Income Tax: ఏప్రిల్ 1 నుండి కొత్త ఇన్‍కమ్ టాక్స్ రూల్స్.. ఉద్యోగులకు పండగే

New Income Tax Rules 2026 : ఏప్రిల్ 1 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది. స్టాండర్డ్ డిడక్షన్ పెరగడంతో పాటు గిఫ్ట్స్, మీల్ వోచర్లపై లభించే పన్ను మినహాయింపుల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 22 2026, 11:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మీల్ వోచర్స్ నుంచి హోమ్ లోన్ దాకా.. కొత్త టాక్స్ రూల్స్‌లో మీకు లాభం ఎంత?
Image Credit : our own

మీల్ వోచర్స్ నుంచి హోమ్ లోన్ దాకా.. కొత్త టాక్స్ రూల్స్‌లో మీకు లాభం ఎంత?

ప్రభుత్వం ఆదాయపు పన్ను రూల్స్ 2026ను అధికారిక గెజిట్‌ ద్వారా నోటిఫై చేసింది. ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరానికి కొద్ది రోజుల ముందే ఈ కీలక ప్రకటన చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత పన్ను చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టంను అమలు చేసే దిశగా ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది. ఈ కొత్త నిబంధనలు ఉద్యోగుల జీతాలు, సేవింగ్స్, పన్ను చెల్లింపు విధానాలపై ప్రభావం చూపనున్నాయి.

"ఏప్రిల్ 1 నుండి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వేతన జీవులకు ప్రాథమిక మినహాయింపు పరిమితి ఎక్కువగా ఉంటుంది. అయితే, వీరు పాత విధానంలో అందుబాటులో ఉన్న హెచ్‌ఆర్‌ఏ, 80C, 80D వంటి అనేక మినహాయింపులను వదులుకోవాల్సి ఉంటుంది. దీనికి బదులుగా, అద్దె లేని నివాసం, కంపెనీ వాహనాల వంటి నగదు రహిత ప్రయోజనాల విలువ కట్టే విధానం సరళంగా మారుతుంది" అని క్లియర్ టాక్స్ వ్యవస్థాపకుడు అర్చిత్ గుప్తా అన్నారు.

26
మీల్ వోచర్లు, ఆహార భత్యాలపై ఊరట
Image Credit : our own

మీల్ వోచర్లు, ఆహార భత్యాలపై ఊరట

కొత్త పన్ను విధానంలో ఉద్యోగులకు లభించే మీల్ వోచర్ల విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రతి పూట భోజనానికి రూ. 200 లేదా అంతకంటే తక్కువ విలువైన మీల్ వోచర్లపై పన్ను వుండదు. డెలాయిట్ ఇండియా పార్టనర్ సురేష్ కుమార్ ఎస్ దీనిపై స్పందిస్తూ, "నెలలో 22 పనిదినాలను ప్రాతిపదికగా తీసుకుంటే, రోజుకు ఒక పూట భోజనానికి రూ. 4,400 వరకు, రెండు పూటల భోజనానికి రూ. 8,800 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు" అని తెలిపారు. ఇది మధ్యతరగతి ఉద్యోగులకు రోజువారీ ఖర్చుల పరంగా కొంత ఉపశమనం కలిగిస్తుంది.

Related Articles

Related image1
కారు అంటే ఇలా ఉండాలి.. రూ. 10 లక్షల లోపే సన్‌రూఫ్, అదిరిపోయే మైలేజ్!
Related image2
LPG : వంట గ్యాస్ 14 కిలోలు కాకుండా 14.2 కిలోలే ఎందుకు ఉంటుందో తెలుసా?
36
వాహనాల వినియోగం.. మెయింటెనెన్స్ మినహాయింపులు
Image Credit : our own

వాహనాల వినియోగం.. మెయింటెనెన్స్ మినహాయింపులు

ఉద్యోగి స్వంత కారును అటు ఆఫీసు పనులకు, ఇటు వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తున్నప్పుడు కంపెనీ భరించే ఖర్చులపై పన్ను మినహాయింపులు ఇలా ఉన్నాయి:

• 1.6 లీటర్ల లోపు ఇంజిన్ సామర్థ్యం: యజమాని చెల్లించే అసలు ఖర్చు నుండి నెలకు రూ. 5,000 (డ్రైవర్ ఉంటే అదనంగా రూ. 3,000) మినహాయించి మిగిలిన మొత్తంపై పన్ను ఉంటుంది.

• 1.6 లీటర్ల పైబడిన ఇంజిన్ సామర్థ్యం: యజమాని చెల్లించే అసలు ఖర్చు నుండి నెలకు రూ. 7,000 (డ్రైవర్ ఉంటే అదనంగా రూ. 3,000) మినహాయింపులు ఉంటాయి.

46
గిఫ్ట్ వోచర్ల పరిమితి పెంపు
Image Credit : iSTOCK

గిఫ్ట్ వోచర్ల పరిమితి పెంపు

పండుగలు లేదా ఇతర ప్రత్యేక సందర్భాలలో కంపెనీలు ఇచ్చే బహుమతులపై పన్ను మినహాయింపు పరిమితిని ప్రభుత్వం భారీగా పెంచింది. గతంలో ఈ పరిమితి రూ. 5,000 గా ఉండగా, ఇప్పుడు దానిని రూ. 15,000 కు పెంచారు. పాత, కొత్త పన్ను విధానాలు రెండింటిలోనూ ఇది వర్తిస్తుంది. ఏడాది పొడవునా లభించే బహుమతులు, వోచర్లు లేదా టోకెన్ల మొత్తం విలువ రూ. 15,000 లోపు ఉంటే, దానిపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

56
పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్
Image Credit : our own

పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్

వేతన జీవులు, పెన్షనర్లకు కొత్త చట్టం కింద అతిపెద్ద ఊరట స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో లభించింది. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చే నిబంధనల ప్రకారం, పన్ను చెల్లింపుదారులు తమ మొత్తం ఆదాయం నుండి నేరుగా రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్‌గా క్లెయిమ్ చేయవచ్చు. ఇది పన్ను విధించదగిన ఆదాయాన్ని నేరుగా తగ్గించి, చేతికి వచ్చే నికర ఆదాయాన్ని పెంచుతుంది. పాత విధానంతో పోలిస్తే ఇది గణనీయమైన మార్పుగా నిపుణులు చెబుతున్నారు.

66
హోమ్ లోన్ వడ్డీపై సెక్షన్ 24(b) మినహాయింపు
Image Credit : our own

హోమ్ లోన్ వడ్డీపై సెక్షన్ 24(b) మినహాయింపు

కొత్త పన్ను విధానంలోనూ గృహ రుణ గ్రహీతలకు కొన్ని ప్రయోజనాలు కల్పించారు. అద్దెకు ఇచ్చిన ఆస్తి లేదా అద్దెకు ఇచ్చినట్లుగా పరిగణించే ఆస్తి పై చెల్లించే గృహ రుణ వడ్డీని సెక్షన్ 24(b) కింద మినహాయింపుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే వారికి, అద్దె ఆదాయం పొందుతున్న వారికి పన్ను భారం తగ్గుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్
Latest Videos
Recommended Stories
Recommended image1
LPG : వంట గ్యాస్ 14 కిలోలు కాకుండా 14.2 కిలోలే ఎందుకు ఉంటుందో తెలుసా?
Recommended image2
Business Secrets: ఊరిలోని కిరాణా షాప్‌తో రూ. 50 వేల సంపాదన.. ఈ ట్రిక్స్ తెలిస్తే చాలా ఈజీ
Recommended image3
Business Plan: ఊరైనా, పట్టణమైనా హిట్టే..! నెలకు రూ. 2 లక్షలు.. ఇప్పుడిదే ఎవర్‌గ్రీన్ బిజినెస్
Related Stories
Recommended image1
కారు అంటే ఇలా ఉండాలి.. రూ. 10 లక్షల లోపే సన్‌రూఫ్, అదిరిపోయే మైలేజ్!
Recommended image2
LPG : వంట గ్యాస్ 14 కిలోలు కాకుండా 14.2 కిలోలే ఎందుకు ఉంటుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved