MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Automobile
  • కారు అంటే ఇలా ఉండాలి.. రూ. 10 లక్షల లోపే సన్‌రూఫ్, అదిరిపోయే మైలేజ్!

కారు అంటే ఇలా ఉండాలి.. రూ. 10 లక్షల లోపే సన్‌రూఫ్, అదిరిపోయే మైలేజ్!

SUVs with Sunroof Under 10 Lakh : భారతదేశంలో రూ. 10 లక్షల లోపు ధరకు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న టాటా నెక్సాన్, పంచ్, హ్యుందాయ్ వెన్యూ వంటి టాప్ 5 SUV కార్ల పూర్తి వివరాలు మీ కోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 19 2026, 06:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాటా, మారుతి కార్ల మైండ్ బ్లోయింగ్ మైలేజీ.. ఈ 5 SUVలలో సన్‌రూఫ్ కూడా !
Image Credit : X@basedauto

టాటా, మారుతి కార్ల మైండ్ బ్లోయింగ్ మైలేజీ.. ఈ 5 SUVలలో సన్‌రూఫ్ కూడా !

భారతీయ వాహనదారులకు ఇప్పుడు SUVల పట్ల మోజు పెరుగుతోంది. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్‌తో పాటు సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లను తక్కువ ధరలోనే ఆశిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఖరీదైన కార్లకే పరిమితమైన ఈ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఇప్పుడు రూ. 10 లక్షల లోపు లభించే కాంపాక్ట్ SUVలలో కూడా అందుబాటులోకి వచ్చింది. అటువంటి ఐదు బెస్ట్ కార్ల వివరాలు గమిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza)
Image Credit : maruti suzuki

1. మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza)

మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUVలలో బ్రెజ్జా ఒకటి. దీని ధర రూ. 8.19 లక్షల నుండి ప్రారంభమై రూ. 13.88 లక్షల వరకు ఉంటుంది. బ్రెజ్జా లోని ఎంపిక చేసిన వేరియంట్లు సన్‌రూఫ్ ఫీచర్‌తో వస్తున్నాయి. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే దీని మైలేజీ. సీఎన్జీ వేరియంట్లలో ఇది కిలోకు 26.6 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక పొదుపైన, మంచి ఫీచర్లు కలిగిన ఎంపిక.

Related Articles

Related image1
Dhurandhar 2: ధురంధర్ 2లో రణ్‌వీర్ కంటే మోదీ క్రేజే ఎక్కువ.. అసలు ఆ సీన్ల వెనుక కథేంటి?
Related image2
ఒక్క మాటతో సగానికి తగ్గిన హాస్పిటల్ బిల్లు.. అసలు ట్రిక్ ఇదే
36
2. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)
Image Credit : Car dekho

2. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)

స్టైల్, టెక్నాలజీ కలయికగా హ్యుందాయ్ వెన్యూ నిలుస్తుంది. ఇది చూడటానికి చాలా మోడ్రన్‌గా ఉండటమే కాకుండా, లోపల అనేక అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం హ్యుందాయ్ వెన్యూ కొనుగోలుపై కస్టమర్లు రూ. 80,629 వరకు పొదుపు చేయవచ్చు. ఇందులో ఉండే ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. వెన్యూ తన స్మార్ట్ డిజైన్, కంఫర్ట్ కారణంగా యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది.

46
3. కియా సోనెట్ (Kia Sonet)
Image Credit : Kia website

3. కియా సోనెట్ (Kia Sonet)

సబ్‌కాంపాక్ట్ SUV విభాగంలో కియా సోనెట్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ కారులోని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, బోల్డ్ లుక్స్ కస్టమర్లను మెప్పిస్తున్నాయి. రూ. 10 లక్షల లోపు లభించే ఎంపిక చేసిన వేరియంట్లలో కియా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను అందిస్తోంది. కేవలం ఫీచర్లే కాకుండా, సోనెట్ లోపల ఉండే ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా రిచ్‌గా ఉంటుంది.

56
4. టాటా నెక్సాన్ (Tata Nexon)
Image Credit : official website

4. టాటా నెక్సాన్ (Tata Nexon)

భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్లలో టాటా నెక్సాన్ ఒకటి. గ్లోబల్ NCAP నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన ఈ కారు, తన పవర్‌ఫుల్ ఇంజిన్, ఆధునిక డిజైన్‌కు పేరుగాంచింది. నెక్సాన్ తన మిడ్-లెవల్ వేరియంట్ల నుండే సన్‌రూఫ్ ఫీచర్‌ను ఆఫర్ చేస్తోంది. మీరు భద్రతతో పాటు స్టైల్‌ను కోరుకుంటే నెక్సాన్ బెస్ట్ ఎంపిక అవుతుంది.

66
5. టాటా పంచ్ (Tata Punch)
Image Credit : X@AarizRizvi

5. టాటా పంచ్ (Tata Punch)

చిన్న సైజులో ఉంటూ SUV అనుభూతిని ఇచ్చే టాటా పంచ్ ఇప్పుడు మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. దీని ధర రూ. 6.13 లక్షల నుండి ప్రారంభమై రూ. 10.15 లక్షల వరకు ఉంటుంది. దీని సీఎన్జీ వేరియంట్ కిలోకు 26.99 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. టాటా పంచ్ లోని టాప్ వేరియంట్లు బడ్జెట్ ధరలోనే సన్‌రూఫ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kia Car Offers : కియా కార్లపై ఫెస్టివల్ ఆఫర్.. ఏకంగా రూ.1.5 లక్షల భారీ డిస్కౌంట్
Recommended image2
Maruti Baleno : మీదగ్గర కేవలం రూ.11,000 ఉంటే చాలు.. సరికొత్త మారుతి బాలెనో కారు సొంతం చేసుకొండి
Recommended image3
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Related Stories
Recommended image1
Dhurandhar 2: ధురంధర్ 2లో రణ్‌వీర్ కంటే మోదీ క్రేజే ఎక్కువ.. అసలు ఆ సీన్ల వెనుక కథేంటి?
Recommended image2
ఒక్క మాటతో సగానికి తగ్గిన హాస్పిటల్ బిల్లు.. అసలు ట్రిక్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved