- Home
- Business
- Business Ideas : కేవలం రూ.10 వేలు చాలు.. మీ సొంతింట్లోనే ఈ వ్యాపారాలు చేయండి, మంచి ఇన్కమ్ పొందండి
Business Ideas : కేవలం రూ.10 వేలు చాలు.. మీ సొంతింట్లోనే ఈ వ్యాపారాలు చేయండి, మంచి ఇన్కమ్ పొందండి
రూ.10,000 కంటే తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల చిన్న వ్యాపారాలు ఏవో ఈ కథనంలో వివరంగా చూద్దాం. ఇలాంటి వ్యాపారాల ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయం పొందవచ్చు.

తక్కువ పెట్టుబడితో సూపర్ బిజినెస్
సొంత వ్యాపారం చాలామంది కల... కానీ భారీగా డబ్బులు పెట్టబడిగా పెట్టాక నష్టాలు వస్తే..? ఇదే వారితో వెనకడుగు వేయిస్తుంది. మరి తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయగలిగితే ఈ భయం ఉండదు. ఇలా రూ.10,000 లోపు మొదలుపెట్టే వ్యాపారాలు రిస్క్ లేకుండా ఆదాయాన్నిస్తాయి. విద్యార్థులు, గృహిణులకు, పార్ట్ టైమ్ ఆదాయం కోరుకునేవారికి ఇవి అనువైనవి.
హోమ్ మేడ్ ఫుడ్ బిజినెస్
మొదటి మంచి ఎంపిక ఏమిటంటే ఇంట్లో ఆహారాన్ని తయారు చేసి అమ్మడం. మీరు తయారుచేసిన ఇడ్లీ లేదా దోస పిండి, సాంబార్, చట్నీ, స్నాక్స్ మొదలైన వాటిని సమీపంలోని దుకాణాలకు అమ్మవచ్చు లేదా కస్టమర్లకు డైరెక్ట్ గా చేరవేయవచ్చు. ప్రారంభంలో ముడి పదార్థాలు, పాత్రలకు రూ.5,000 నుండి రూ.8,000 వరకు సరిపోతుంది. రుచి, శుభ్రత బాగుంటే కస్టమర్లు వెతుక్కుంటూ వస్తారు... ఎలాంటి పబ్లిసిటీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.
గ్రామీణ ప్రాంతాల్లో సూపర్ బిజినెస్
రెండోది రీఛార్జ్, ఆన్‌లైన్ సేవా కేంద్రాలు. మొబైల్, DTH రీఛార్జ్, విద్యుత్, గ్యాస్ బిల్లుల చెల్లింపులు, ఆన్‌లైన్ అప్లికేషన్ వంటి సేవలు అందించాల్సి ఉంటుంది... తద్వారా కమీషన్ రూపంలో ఆదాయం పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ కలిగివుండి కాస్త సాకేంతిక పరిజ్ఞానం ఉంటే చాలు ఈ వ్యాపారాన్ని నిర్వహించవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి బిజినెస్ లకు మంచి డిమాండ్ ఉంది.
పర్యావరణహిత బ్యాగుల తయారీ
మూడోది పర్యావరణ అనుకూల వస్తువుల తయారీ. పేపర్ కవర్లు, క్లాత్ బ్యాగులు, బట్ట సంచులకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. కేవలం కాగితం, క్లాత్, ప్రింటింగ్ వంటి ఖర్చులు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ వ్యాపారాన్ని కేవలం రూ.7,000–రూ.10,000 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. మీ వస్తువులను ఇంటి సమీపంలోని దుకాణాలు, మార్కెట్లలో అమ్ముకోవచ్చు.
ఇంటివద్దే కూరగాయల పెంపకం (Home Gardening)
నాలుగోది ఇంటి ఆవరణలో పంటలు పండించడం... అంటే చిన్నతరహా వ్యవసాయం అన్నమాట. తక్కువ స్థలంలో కూరగాయలు, ఇతర వాణిజ్య పరమైన మొక్కలు పెంచవచ్చు. విత్తనాలు, మొక్కలు పెంచేందుకు కుండీలు మాత్రమే అవసరం... వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. దీనివల్ల వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలు తీరుస్తూ అదనపు ఆదాయాన్ని ఇస్తుంది.

