MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • Gold Price: మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు, ఎంత పెరిగిందంటే...?

Gold Price: మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు, ఎంత పెరిగిందంటే...?

Gold Price: పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధర మళ్లీ రికార్డు ధరలకు చేరుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో 22, 24 క్యారెట్ల రేట్లు వరుసగా పెరిగాయి. కిలో వెండి ఎగిసింది. కొనేవారు మార్కెట్ మార్పులు గమనిస్తూ నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

2 Min read
Author : Nandini Arava
Published : Feb 26 2026, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గోల్డ్ కొనేవారికి మరో పెద్ద షాక్
Image Credit : our own

గోల్డ్ కొనేవారికి మరో పెద్ద షాక్

పెళ్లిళ్ల సీజన్‌ ఊపందుకున్న ఈ సమయంలో బంగారం కొనాలని భావిస్తున్నవారికి మరో పెద్ద షాక్ ఎదురైంది. పసిడి ధరలు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. గత కొద్దిరోజులుగా మార్కెట్‌లో కనిపిస్తున్న ట్రెండ్ చూస్తే… బంగారం ధరలు ఆగేలా కనిపించడం లేదు. ఒక్కరోజు తగ్గుతాయేమోనని ఆశపడితే… మరుసటి రోజే మరింత పెరుగుతూ కొనుగోలుదారులకు టెన్షన్ పెడుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ మార్పుల ప్రభావం
Image Credit : Getty

అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ మార్పుల ప్రభావం

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, డాలర్ మార్పులు, ఆర్థిక అనిశ్చితి, ప్రపంచ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..ఇవన్నీ కలిసి బంగారాన్ని మళ్లీ సురక్షిత పెట్టుబడిగా మార్చేశాయి. పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున గోల్డ్ వైపు మొగ్గుచూపుతుండటంతో ధరలు కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్నాయి.

Related Articles

Related image1
Now Playing
Gold Rate Today:అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలతో బంగారంపై ఎఫెక్ట్ | Gold | Silver | Asianet News Telugu
Related image2
Gold Price : బంగారం ధర తగ్గుతుందా..? లక్ష రూపాయలకు చేరుకుంటుందా..?
36
చిన్న మొత్తంలో ఎగబాకుతున్న రేట్లు
Image Credit : Asianet News

చిన్న మొత్తంలో ఎగబాకుతున్న రేట్లు

ఇప్పటికే తులం ధరలు లక్ష దాటిన తర్వాత కూడా ఆగకుండా పెరుగుతోంది.  ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ కూడా భారీగా ఉంది. పెరగకముందే కొనాలి అనే ఆలోచనతో చాలా మంది ముందుగానే కొనుగోళ్లకు వెళ్తున్నారు. దీంతో మార్కెట్లో కొనుగోలు ఒత్తిడి మరింత పెరుగుతోంది. గత వారం రోజులుగా దేశీయ బులియన్ మార్కెట్లలో వరుసగా పెరుగుదల కనిపిస్తోంది. ప్రతిరోజూ చిన్న మొత్తంలో అయినా రేట్లు ఎగబాకుతూనే ఉన్నాయి. తగ్గుదల కనిపించకపోవడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొంది.

46
వెండి కూడా బంగారం బాటలోనే..
Image Credit : Asianet News

వెండి కూడా బంగారం బాటలోనే..

ఇక వెండి పరిస్థితి కూడా పెద్దగా భిన్నంగా లేదు. ఒక రోజు తగ్గి ఊరట ఇచ్చినట్టే అనిపించినా… వెంటనే మళ్లీ పెరుగుతోంది. పెట్టుబడిదారులు మాత్రమే కాదు, ఆభరణాల కొనుగోలు చేసే సాధారణ ప్రజలు కూడా ఇప్పుడు మార్కెట్ మార్పులపై కన్నేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

56
ఈరోజు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
Image Credit : Getty

ఈరోజు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

మరి ఈరోజు ఫిబ్రవరి 26న 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎంత? కిలో వెండి రేటు ఎంత వద్ద ట్రేడవుతోంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 50 డాలర్ల మేర పెరిగి 5207 డాలర్లను దాటింది. అలాగే స్పాట్ సిల్వర్ ధర 4 శాతం పెరిగి 90 డాలర్ల మార్క్‌ను అధిగమించింది.

హైదరాబాద్ మార్కెట్లో వరుసగా ఏడో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.100 పెరిగి రూ.1,48,400గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.110 పెరిగి రూ.1,62,890గా కొనసాగుతోంది. ఇక కిలో వెండి అక్షరాల రూ. 2,95,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

66
తగ్గేలా కనిపించడం లేదు
Image Credit : Getty

తగ్గేలా కనిపించడం లేదు

మొత్తానికి చూస్తే…పసిడి ధరలు ప్రస్తుతం తగ్గే సూచనలు కనిపించడం లేదు. పెళ్లిళ్ల సీజన్, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు అన్నీ కలిపి రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇక బంగారం, వెండి కొనుగోలు చేసే వారు రోజువారీ మార్పులను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిది. మార్కెట్ ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి..నిపుణులను సంప్రదించి కొనడం, పెట్టుబడులు పెట్టడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Viksit Bharat Rozgar Yojana: ఉద్యోగులకు ఫ్రీగా 15 వేలు.. ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్.. వెంటనే ఇలా చేయండి
Recommended image2
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image3
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Related Stories
Recommended image1
Now Playing
Gold Rate Today:అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలతో బంగారంపై ఎఫెక్ట్ | Gold | Silver | Asianet News Telugu
Recommended image2
Gold Price : బంగారం ధర తగ్గుతుందా..? లక్ష రూపాయలకు చేరుకుంటుందా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved