Best months for Car: కొత్త కారు తక్కువ ధరకు రావాలంటే ఈ నెలల్లో కొనడమే బెటర్
Best months for Car: కారు కొనాలంటే కొన్ని నెలలు ఉత్తమమైనవని చెబుతున్నారు నిపుణులు. ఏడాదిలో కొన్ని నెలల్లో కారు చాలా తక్కువ ధరకే వస్తుంది. డిస్కౌంట్లు,ఆఫర్లు అధికంగా వస్తాయి. అవి ఏ నెలలో తెలుసుకోండి.

Best months to buy car
కారు కొనుక్కోవాలని ఎంతో మంది కల. సరైన సమయంలో కొనుగోలు చేస్తే మంచి డిస్కౌంట్, అదనపు ఆఫర్లు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్ నిపుణులు, ఆటో డీలర్లు చెబుతున్నదాని ప్రకారం సంవత్సరంలో కొన్ని నెలలు కారు కొనడానికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటాయి. ఆ నెలల్లో కారు కొంటే సాధారణ సమయం కన్నా కనీసం లక్ష రూపాయలకు వరకు తగ్గే అవకాశం ఉంది. అవి ఏ నెలలో తెలుసుకోండి.
ఫిబ్రవరి, మార్చి
భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఉంటుంది. అందువల్ల ఫిబ్రవరి, మార్చి నెలలు అనేవి డీలర్లకు ఎంతో ముఖ్యమైనవి. ఈ సమయంలో వార్షిక అమ్మకాల టార్గెట్ పూర్తి పూర్తి చేయాల్సి ఉంటుంది. టార్గెట్ చేరుకోవడానికి డీలర్లు భారీ డిస్కౌంట్లు, క్యాష్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు ఇస్తారు. స్టాక్ క్లియరెన్స్ చేసేందుకు ప్రయత్నాస్తారు. పాత మోడల్ కార్లను తక్కువ ధరకే అమ్మేస్తారు. కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
సెప్టెంబర్, అక్టోబర్
మనదేశంలో పండుగలు వస్తే అన్ని వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో ఆటో కంపెనీలు ప్రత్యేక స్కీమ్స్, డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. బ్యాంకులు కూడా ఈ కాలంలో తక్కువ వడ్డీతో కార్ లోన్లు అందిస్తాయి. క్యాష్ డిస్కౌంట్, ఉచిత యాక్సెసరీస్, ఇన్సూరెన్స్ ఆఫర్లు, ఎక్స్టెండెడ్ వారంటీ వంటి ప్రయోజనాలు అందిస్తారు. కొత్త కారు కొనేందకు దసరా, దీపావళి వంటి పండుగలు మంచివనే నమ్మకం కూడా ఎంతో మందిలో ఉంది.
డిసెంబర్
డిసెంబర్ నెల కూడా కారు కొనుగోలుకు చాలా ఉత్తమమైన నెల. కొత్త ఏడాది వచ్చేస్తున్న తరుణంలో డీలర్లు పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తారు. కొత్త ఏడాదిలో వచ్చే మోడళ్లకు స్థలం కల్పించడానికి పాత కార్లపై భారీ తగ్గింపులు ఇస్తారు. డిసెంబర్‌లో కొనుగోలు చేసిన కారుకు రిజిస్ట్రేషన్ మాత్రం పాత సంవత్సరమే ఉంటుంది. అయినప్పటికీ చాలా మంది తక్కువ ధర కోసం ఈ నెలలో కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా బడ్జెట్ చూసుకునే కస్టమర్లకు ఇది మంచి ఎంపిక.

