- Home
- Business
- Business Idea: ఉన్న ఊరిలో ఉంటూనే నెలకు రూ. లక్ష సంపాదించాలా.? జీవితాన్ని మార్చే బిజినెస్
Business Idea: ఉన్న ఊరిలో ఉంటూనే నెలకు రూ. లక్ష సంపాదించాలా.? జీవితాన్ని మార్చే బిజినెస్
Business Idea: తాము సంపాదిస్తూనే మరో నలుగురికి ఉపాధి కల్పించాలని చాలా మంది ఆశిస్తుంటారు. అయితే తక్కువ రిస్క్‌తో మంచి లాభాలు ఆర్జించే వ్యాపారాలు కొన్నే ఉంటాయి. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా పట్టు పరిశ్రమ. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు.

పట్టు పరిశ్రమలో పెరుగుతోన్న అవకాశాలు
భారతదేశంలో పట్టు వస్త్రాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పెళ్లిళ్లు, పండుగలు, సంప్రదాయ వేడుకలతో పట్టు వినియోగం తగ్గే అవకాశం లేదు. ఈ కారణంగా పట్టు తయారీకి సంబంధించిన వ్యాపారాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల వ్యాపారంగా పట్టుపురుగుల పెంపకం యువతను ఆకర్షిస్తోంది.
పట్టుపురుగుల పెంపకం అంటే ఏంటి?
పట్టుపురుగుల పెంపకం అంటే మల్బరీ ఆకులను ఆహారంగా ఇచ్చి పురుగులను పెంచడం. అవి తక్కువ రోజుల్లోనే పట్టు గూళ్లు తయారు చేస్తాయి. ఈ గూళ్ల నుంచే పట్టు దారం తయారవుతుంది. ఒకసారి ప్రక్రియ మొదలైతే కేవలం 21 రోజుల వ్యవధిలోనే పంట సిద్ధమవుతుంది. తక్కువ కాలంలో ఆదాయం రావడం ఈ వ్యాపారానికి పెద్ద ప్లస్ పాయింట్.
ఈ బిజినెస్ ప్రారంభించాలంటే ఏం అవసరం?
ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి కొంత వ్యవసాయ భూమి అవసరం. ముందుగా మల్బరీ తోటను పెంచాలి. పట్టు పురుగులకు మల్బరీ ఆకులే ప్రధాన ఆహారం. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మల్బరీ మొక్కలను సబ్సిడీపై అందిస్తున్నాయి. అలాగే పట్టుపురుగుల పెంపకానికి ఒక చిన్న షెడ్డు నిర్మించాలి. షెడ్డు నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 75 శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నాయి. మిగతా ఖర్చు మాత్రమే మన పెట్టుబడిగా పెట్టుకోవాలి.
పట్టు గూళ్ల తయారీ ప్రక్రియ ఎలా ఉంటుంది?
షెడ్డు లోపల ట్రేలు అమర్చి వాటిపై పట్టుపురుగులను ఉంచాలి. రోజూ సమయానికి మల్బరీ ఆకులు వేయాలి. సున్నం పొడి వంటివి ఉపయోగించి శుభ్రత పాటించాలి. సరైన ఉష్ణోగ్రత, తేమ ఉంటే పురుగులు వేగంగా పెరుగుతాయి. సుమారు మూడు వారాల్లోనే పురుగులు పట్టు గూళ్లుగా మారుతాయి. ఈ గూళ్లను నేరుగా మార్కెట్‌లో లేదా ప్రభుత్వ కోకూన్ మార్కెట్లలో విక్రయించవచ్చు.
ఆదాయం ఎంత వస్తుంది? లాభాలు ఎలా ఉంటాయి?
ప్రస్తుతం మార్కెట్‌లో కిలో పట్టు గూళ్ల ధర సగటున రూ. 700–750 వరకు ఉంది. ఒక పంటలో 100 కిలోల గూళ్లు వస్తే సుమారు రూ. 70 వేలకుపైగా ఆదాయం సాధ్యం. ఇది కేవలం 21 రోజుల్లో వచ్చే మొత్తం. సంవత్సరానికి 7 నుంచి 10 పంటలు తీసుకునే అవకాశం ఉంది. సరైన నిర్వహణతో ఏడాదికి లక్షల్లో ఆదాయం పొందవచ్చు. అదనంగా గ్రామీణ యువతకు ఉపాధి కల్పించే అవకాశమూ ఉంటుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలను ప్రాథమిక సమాచారంగానే భావించాలి. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు అంతకు ముందు ఈ రంగంలో అనుభవం ఉన్న వారిని సంప్రదించడం ఉత్తమం.

