MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • చెక్ బౌన్స్ అయితే ఎలాంటి శిక్షలుంటాయి..? వీటి నుండి ఎలా తప్పించుకోవచ్చో తెలుసా..?

చెక్ బౌన్స్ అయితే ఎలాంటి శిక్షలుంటాయి..? వీటి నుండి ఎలా తప్పించుకోవచ్చో తెలుసా..?

మీరు ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఇది కేవలం బ్యాంకు పెనాల్టీతో ఆగిపోదు, మిమ్మల్ని తీవ్రమైన చట్టపరమైన చిక్కుల్లోకి నెడుతుంది. ఈ పరిస్థితిలో ఎలాంటి శిక్షలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 16 2026, 07:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చెక్ బౌన్స్ అయితే ఎలాంటి శిక్షలుంటాయి..
Image Credit : Getty

చెక్ బౌన్స్ అయితే ఎలాంటి శిక్షలుంటాయి..

Cheque Bounce : భారతదేశంలో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్‌లోని సెక్షన్ 138 ప్రకారం చెక్ బౌన్స్ అయి మీరు డబ్బు చెల్లించలేకపోతే రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా చెక్ అమౌంట్‌కు రెట్టింపు జరిమానా ఉండవచ్చు… ఒక్కోసారి రెండూ విధించవచ్చు. అయితే చెక్ బౌన్స్ అయిన ప్రతిసారీ జైలు శిక్ష పడుతుందని కంగారు పడక్కర్లేదు…  చట్టం మీకు తప్పు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చెక్ బౌన్స్ అయినా ఇలా చేశారో నో ప్రాబ్లమ్...
Image Credit : ChatGPT

చెక్ బౌన్స్ అయినా ఇలా చేశారో నో ప్రాబ్లమ్...

మీ చెక్ బౌన్స్ అయినప్పుడు ఎందుకు తిరస్కరించారో వివరిస్తూ బ్యాంకు ఒక 'రిటర్న్ మెమో'ను డిపాజిట్ చేసిన వ్యక్తికి పంపుతుంది. ఎక్కువగా అకౌంట్‌లో డబ్బు లేకపోవడం (Insufficient Funds) దీనికి ప్రధాన కారణం అవుతుంది. ఆ తర్వాత డబ్బు స్వీకరించాల్సిన వ్యక్తి మీకు లీగల్ నోటీసు పంపడానికి 30 రోజుల సమయం ఉంటుంది. నోటీసు అందిన 15 రోజుల్లోగా మీరు చెక్ మొత్తాన్ని చెల్లిస్తే, సాధారణంగా సమస్య అక్కడితో ముగుస్తుంది. క్రిమినల్ కేసు నమోదు కాదు.

Related Articles

Related image1
Check Bounce: చెక్ లేదా ఈఎంఐ బౌన్స్ చేస్తే రెండేళ్ల జైలు శిక్ష.? చట్టం ఏం చెబుతోందంటే.!
Related image2
Cheque Bounce: చెక్కు బౌన్స్ అయితే ఇక అంతే.. కొత్త రూల్స్ ఎంత కఠినంగా ఉన్నాయో చూశారా?
35
అసలు సమస్య ఇదే..
Image Credit : ChatGPT

అసలు సమస్య ఇదే..

మీరు లీగల్ నోటీసును పట్టించుకోకుండా అవతలి వ్యక్తి కోర్టుకు వెళ్లడని భావిస్తే 15 రోజుల తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. ఒకవేళ క్రిమినల్ కేసు ఫైల్ అయ్యిందో మీరు కోర్టుకు హాజరుకావాలి, లాయర్ ఫీజులు చెల్లించాలి, నెలలు లేదా ఏళ్ల తరబడి చట్టపరమైన ఒత్తిడిని ఎదుర్కోవాలి. కోర్టు ఆదేశాలను పాటించకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది.

45
పోస్ట్ డెటెడ్ చెెక్స్ ఇవ్వడమూ ప్రమాదమే..
Image Credit : Getty

పోస్ట్ డెటెడ్ చెెక్స్ ఇవ్వడమూ ప్రమాదమే..

చాలామంది పోస్ట్-డేటెడ్ చెక్కులు ఇవ్వడం సురక్షితం అనుకుంటారు. కానీ మీరు అద్దె, లోన్ లేదా వ్యాపార ఒప్పందం కోసం పోస్ట్-డేటెడ్ చెక్ ఇచ్చినా, అది బౌన్స్ అయితే అవే చట్టాలు వర్తిస్తాయి. చట్టపరమైన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైతే, చర్యలు తప్పవు.
55
సకాలంలో స్పందిస్తే సేఫ్...
Image Credit : Getty

సకాలంలో స్పందిస్తే సేఫ్...

మీ అకౌంట్‌లో కచ్చితంగా డబ్బు ఉన్నప్పుడే చెక్ రాయడం అత్యంత సురక్షితమైన మార్గం. పొరపాటున చెక్ బౌన్స్ అయినా, వెంటనే సమస్యను పరిష్కరించండి. దాన్ని నిర్లక్ష్యం చేయడమే మీరు చేసే అతిపెద్ద తప్పు. సకాలంలో స్పందిస్తే జైలు, భారీ జరిమానా, సుదీర్ఘ న్యాయపోరాటం నుంచి సులభంగా బయటపడొచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
భారత దేశం
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Agriculture: లక్షల ఎకరాల భూములు కొంటున్న మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ బాస్‌లు.. అసలు ప్లాన్ ఏంటి?
Recommended image2
మీరు ఇంట్లో ఖాళీగా కూర్చున్నా సరే.. నెలకు రూ. 20 వేల ఆదాయం మీ సొంతం
Recommended image3
Business Loan for Womens : తెలుగింటి మహిళలూ... మీ బిజినెస్ కోసమే ఈ బ్యాంక్ లోన్ స్కీమ్, ఎంతిస్తారో తెలుసా?
Related Stories
Recommended image1
Check Bounce: చెక్ లేదా ఈఎంఐ బౌన్స్ చేస్తే రెండేళ్ల జైలు శిక్ష.? చట్టం ఏం చెబుతోందంటే.!
Recommended image2
Cheque Bounce: చెక్కు బౌన్స్ అయితే ఇక అంతే.. కొత్త రూల్స్ ఎంత కఠినంగా ఉన్నాయో చూశారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved