Cheque Bounce: చెక్కు బౌన్స్ అయితే ఇక అంతే.. కొత్త రూల్స్ ఎంత కఠినంగా ఉన్నాయో చూశారా?
Cheque Bounce: చెక్కు బౌన్స్ కావడం గురించి కొత్త నియమాలు విడుదలయ్యాయి. కేసులను త్వరగా పరిష్కరించడానికి, ఇబ్బందులను తగ్గించడానికి సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి. అవేంటో తెలుసుకుందామా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా.. చెక్ అవసరమే
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంత ఎక్కువగా జరుగుతున్న ఈ కాలంలో కూడా చెక్కుల ప్రాముఖ్యత తగ్గలేదు. బిజినెన్ కోసమో, వ్యక్తిగత అవసరాల కోసమో ఇలా ఏదో విధంగా చాలా మంది చెక్కులను వినియోగిస్తున్నారు. కాస్త ఎక్కువ అమౌంట్ ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా చెక్ అయితేనే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అయితే చెక్కులకు సంబంధించిన అతిపెద్ద సమస్య చెక్కు బౌన్స్ కావడం. దీని గురించి కొత్త నియమాలు విడుదలయ్యాయి. అవి కాస్త కఠినంగానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సుప్రీంకోర్టు, ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు
మీరు ఎవరికైనా చెక్కు ఇస్తే వారు దాన్ని బ్యాంకులో జమ చేసినప్పుడు తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల చెక్ బౌన్స్ అవుతుంది. లేదా సంతకం సరిపోలకపోవడం వల్ల కూడా చెక్ బౌన్స్ కావచ్చు. ఇలాంటి చెక్కు బౌన్స్ కేసులను త్వరగా పరిష్కరించడానికి, ఇబ్బందులను తగ్గించడానికి సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి.
చెక్కు బౌన్స్ పై సుప్రీంకోర్టు ఆదేశం
సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం చెక్కు బౌన్స్ కేసులు 6 నెలల్లోపు పరిష్కరించాలి. కేసు పరిష్కారం అయ్యే వరకు పిటిషనర్‌కు మధ్యంతర పరిహారం చెల్లించాలి. కేసు ప్రారంభంలోనే చెక్కు మొత్తంలో 20 % వరకు పరిహారం చెల్లించాలని స్థానిక కోర్టు ఆదేశించవచ్చు.
చెక్కు బౌన్స్ అయితే కఠిన చర్యలు తీసుకోవచ్చు
ఎవరైనా ఇచ్చిన చెక్కు చాలాసార్లు బౌన్స్ అయితే బ్యాంకు వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. అవసరమైతే వారి అకౌంట్ ను తాత్కాలికంగా స్తంభింపజేయవచ్చు. కేసులను త్వరగా పరిష్కరించడానికి డిజిటల్ పద్ధతులను ఉపయోగించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఇకపై ఆన్‌లైన్‌లో కూడా కేసు నమోదు చేసుకోవచ్చు.
చెక్కు బౌన్స్ అయితే ఏం చేస్తారు?
మీరిచ్చిన చెక్కు బౌన్స్ అయితే బాధితుడు బ్యాంకు ద్వారా మీకు చెక్కు రిటర్న్ మెమో పంపిస్తారు. దానికి మీరు స్పందించకపోతే 30 రోజుల్లోపు న్యాయవాది ద్వారా మీరు నోటీసు ఇస్తారు. నోటీసు అందుకున్న 15 రోజుల లోపు మీరు బాధితుడికి డబ్బు చెల్లించాలి. ఇలా 15 రోజుల్లోపు డబ్బు ఇవ్వకపోతే బాధితుడు మీపై 30 రోజుల్లోపు కేసు వేయొచ్చు. ఇలాంటి కేసులన్నీ నెలల తరబడి కొనసాగించకుండా 6 నెలల్లోపు పరిష్కరించేలా బ్యాంకులు, కోర్టులు చర్యలు తీసుకోవాలని సుప్రీం, ఆర్బీఐ ఆదేశాలిచ్చాయి.