Jio Recharge Plan: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 3 ఏళ్లు బిందాస్.. జియో నుంచి కొత్త ప్లాన్
Jio Recharge Plan: రిలయన్స్ జియో వినియోగదారుల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఏకంగా మూడేళ్ల పాటు మొబైల్ సేవలను పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

జియో మూడేళ్ల ప్లాన్ ధర ఎంతంటే?
రిలయన్స్ జియో తీసుకొచ్చిన ఈ కొత్త 3 ఇయర్స్ అన్లిమిటెడ్ కనెక్టివిటీ ప్లాన్ ధర రూ.10,000. ఇందులో 36 నెలల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే ఒకసారి రూ.10 వేలు చెల్లిస్తే మూడేళ్ల పాటు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీర్ఘకాలం ఒకే ప్లాన్‌తో మొబైల్ సేవలు పొందాలనుకునే వినియోగదారులకు ఇది ఉపయోగపడనుంది.
డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు
ఈ ప్లాన్‌లో వినియోగదారులకు రోజుకు 2.5GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. దీనితో పాటు అన్లిమిటెడ్ 5G డేటా సదుపాయం కూడా ఉంది. ఏ నెట్వర్క్కి అయినా అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించే వారికి, తరచూ ఫోన్ కాల్స్ చేసేవారికి ఈ ప్రయోజనాలు ఉపయోగపడతాయి.
జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా ఉచితం
ఈ రీఛార్జ్ ప్లాన్‌లో కేవలం డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా ఓటీటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జియోహాట్‌స్టార్ మొబైల్ + హాలీవుడ్ యాక్సెస్ లభిస్తుంది. దీని ద్వారా లైవ్ స్పోర్ట్స్, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, హాట్‌స్టార్ ఒరిజినల్స్‌తో పాటు హాలీవుడ్ కంటెంట్‌ను వీక్షించవచ్చు.
కాన్వా ప్రో లైట్, జియోఏఐ క్లౌడ్ ప్రయోజనాలు
ఈ ప్లాన్‌లో డిజిటల్ సేవలకు కూడా జియో ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో 12 నెలల పాటు Canva Pro Lite సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీని ద్వారా ప్రీమియం డిజైన్ టెంప్లేట్లు, ప్రత్యేక డిజైన్ టూల్స్ ఉపయోగించుకోవచ్చు. అదనంగా JioAICloudలో 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ అందిస్తోంది. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర ఫైళ్లను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.
నవంబర్ 7 నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు
జియో కొత్త మూడేళ్ల రీఛార్జ్ ప్లాన్ 2026 నవంబర్ 7 నుంచి అందుబాటులోకి రానుంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు MyJio యాప్, Jio అధికారిక వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే జియో స్టోర్లు, అధీకృత రిటైల్ దుకాణాలు, ఇతర జియో రీఛార్జ్ కేంద్రాల్లోనూ ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.













