చలికాలంలో చేతులకు వెచ్చదనం.. ఈ చిన్న పరికరంతో ఎన్నో ఉపయోగాలు
Rechargeable Hand Warmer: చలికాలంలో చల్లటి వాతావరణం వల్ల చేతులు గడ్డకట్టినట్లు అనిపిస్తుంటుంది. ఇలాంటి వారికి ఉపయోగపడేలా రీచార్జబుల్ ఎలక్ట్రిక్ హ్యాండ్ వార్మర్ అందుబాటులో ఉంది. ఇంతకీ ఏంటీ గ్యాడ్జెట్, ఎలా పనిచేస్తుంది.? లాంటి పూర్తి వివరాలు.

రెండు విధాలుగా ఉపయోగించుకునే సదుపాయం
ఈ హ్యాండ్ వార్మర్లో ప్రత్యేకమైన 2 ఇన్ 1 1 డిజైన్ ఉంది. ఇందులో రెండు భాగాలు అయస్కాంతాల (Magnetic) సాయంతో కలిపి ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని విడదీసి రెండు చేతులకు ఒక్కొక్కటి చొప్పున ఉపయోగించుకోవచ్చు. లేదంటే రెండు భాగాలను కలిపి ఒకే హ్యాండ్ వార్మర్లా వాడుకోవచ్చు. చలిలో రెండు చేతులకూ ఒకేసారి వెచ్చదనం కావాలనుకునేవారికి ఈ డిజైన్ బాగా ఉపయోగపడుతుంది. ధర విషయానికొస్తే అమెజాన్‌లో ఈ గ్యాడ్జెట్ అసలు ధర రూ. 1499 కాగా, ప్రస్తుతం 33 శాతం డిస్కౌంట్‌తో రూ. 999కి లభిస్తోంది.
కేవలం 3 సెకన్లలోనే వేడి..
ఈ పరికరంలో వేగంగా వేడెక్కే టెక్నాలజీని ఉపయోగించారు. ఆన్ చేసిన తర్వాత సుమారు 3 సెకన్లలోనే వేడిని అందించడం దీని ప్రత్యేకత. ఇందులో మూడు రకాల హీట్ సెట్టింగ్స్ ఉన్నాయి. తక్కువ వేడి 113–122 డిగ్రీల ఫారెన్‌హీట్, మధ్యస్థ వేడి 123–131 డిగ్రీల ఫారెన్‌హీట్, అధిక వేడి: 131–140 డిగ్రీల ఫారెన్‌హీట్. వాతావరణం, అవసరాన్ని బట్టి మనకు నచ్చిన హీట్ లెవల్‌ను ఎంచుకోవచ్చు. పరికరానికి రెండు వైపులా వేడి వచ్చేలా రూపొందించారు. దీంతో చేతులకు సమానంగా వెచ్చదనం అందుతుంది.
ఎక్కువసేపు పనిచేసే బ్యాటరీ
ఈ హ్యాండ్ వార్మర్లో రెండు 5,000mAh బ్యాటరీలు ఉంటాయి. అంటే మొత్తం బ్యాటరీ సామర్థ్యం 10,000mAh. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఉపయోగించే హీట్ సెట్టింగ్‌ను బట్టి సుమారు 4 నుంచి 10 గంటల వరకు వేడిని అందిస్తుందని కంపెనీ పేర్కొంటోంది. తక్కువ వేడి సెట్టింగ్‌లో ఎక్కువసేపు, అధిక వేడి సెట్టింగ్‌లో తక్కువసేపు పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు ఛార్జింగ్ గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
టైప్-సీ ఛార్జింగ్ సదుపాయం
ఈ పరికరానికి USB-C ఛార్జింగ్ సదుపాయం ఇచ్చారు. రెండు భాగాలకూ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఛార్జ్ చేసుకోవడం సులభం. పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 3.5 గంటల సమయం పడుతుంది. అయితే మొదటిసారి ఉపయోగించే ముందు పరికరాన్ని పూర్తిగా ఛార్జ్ చేసుకోవాలని తయారీదారు సూచిస్తున్నారు. ప్రయాణాలు, ఆఫీసు అవసరాలకు తీసుకెళ్లేందుకు ఇది అనువుగా ఉంటుంది.
చిన్న సైజు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు
ఈ హ్యాండ్ వార్మర్ తక్కువ బరువుతో, జేబులో సులభంగా పట్టేలా రూపొందించారు. చలికాలంలో బైక్‌పై ప్రయాణించేవారు, ఉదయం వాకింగ్‌కు వెళ్లేవారు, ఆఫీసుల్లో పనిచేసేవారు, పర్యటనలకు వెళ్లేవారు దీన్ని ఉపయోగించుకోవచ్చు. పురుషులు, మహిళలు ఇద్దరికీ ఉపయోగపడుతుంది. చలికాలంలో కుటుంబ సభ్యులకు, స్నేహితులకు బహుమతిగా ఇవ్వడానికి కూడా మంచి ఎంపికగా చెప్పొచ్చు. మొత్తంగా చేతులకు వెచ్చదనం అందించడంతో పాటు ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లగలిగే చిన్న ఎలక్ట్రిక్ డివైజ్ ఇది.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఈ గ్యాడ్జెట్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే. ముందుగా రివ్యూలను, రేటింగ్స్‌ను పరిశీలించడం మంచిది.





