Saving Tips: మీ జీతంలో ఎంత దాస్తున్నారు? సేవింగ్ చేసేవాళ్లలో మీరు ఏ కేటగిరీ?
Saving Tips: నెల జీతంలో ఎంత పొదుపు చేయాలి? కొందరు ఫ్యూచర్ కోసం ఎక్కువ దాస్తే.. మరికొందరు అవసరాలు, ఆనందాలకూ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇలా సేవింగ్స్ చేసే విధానాన్ని బట్టి మనుషులు మూడు రకాలు ఉంటారు. మరి మీరే రకమో ఇక్కడ తెలుసుకోండి.

నెలకు ఎంత దాచుకోవాలి?
నెల జీతంలో ఎంత మొత్తం సేవింగ్స్ కోసం పక్కన పెట్టాలి? ఫైనాన్షియల్ ప్లానింగ్ మొదలుపెట్టే విషయంలో ప్రతి ఒక్కరికీ వచ్చే పెద్ద డౌట్ ఇదే. ఆర్థిక నిపుణులు సేవింగ్స్ చేసే వాళ్లను వాళ్ల గోల్స్ బట్టి మూడు రకాలుగా విభజించారు. అగ్రెసివ్ సేవర్స్, మోడరేట్ సేవర్స్, లైఫ్‌స్టైల్ సేవర్స్ అని వీళ్లని పిలుస్తారు. అగ్రెసివ్ సేవర్స్ ఖర్చుల కంటే ఫ్యూచర్ కోసం ఎక్కువ దాచి త్వరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తారు. మోడరేట్ సేవర్స్ ప్రస్తుత అవసరాలు తీర్చుకుంటూనే మెల్లగా ఆస్తులు కూడబెడతారు. కానీ లైఫ్‌స్టైల్ సేవర్స్ మాత్రం 'ఒక్కసారే బతుకుతాం' (YOLO) అనే మైండ్‌సెట్‌తో ఫ్యూచర్ కంటే ప్రజెంట్ ఎంజాయ్‌మెంట్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు.
సేవర్స్లో 3 రకాలు
మీరు ఏ రకమైన సేవరో ఎలా తెలుసుకోవాలి?
ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి? ఎప్పుడు వద్దు?
ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులు తీర్చేసి, ఎమర్జెన్సీ ఫండ్ పక్కన పెట్టిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. మీ ఫైనాన్షియల్ గోల్ చాలా ఏళ్ల తర్వాత ఉంటే, లాంగ్ టర్మ్ గ్రోత్ ముఖ్యం. అప్పుడు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. కానీ రాబోయే కొన్నేళ్లలో డబ్బు అవసరం ఉంటే మాత్రం ఈక్విటీలో పెట్టకూడదు. ఎందుకంటే మార్కెట్ పడిపోతే నష్టానికి అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ అవసరాల కోసం డబ్బును సేఫ్‌గా, ఈజీగా తీసుకునే లిక్విడ్ ఫండ్స్‌లో దాచుకోవడం బెస్ట్.





