MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Inspiring Story: సరదాగా చేసిన వీడియోలే జీవితాన్ని మార్చేశాయి.. పచ్చళ్లతో మొదలై రూ.కోట్ల బిజినెస్

Inspiring Story: సరదాగా చేసిన వీడియోలే జీవితాన్ని మార్చేశాయి.. పచ్చళ్లతో మొదలై రూ.కోట్ల బిజినెస్

Inspiring Story: టిక్‌టాక్‌లో సరదాగా పచ్చళ్ల రీల్స్ షేర్ చేసుకునే ఇద్దరు ఫ్రెండ్స్..ఇప్పుడు ఏకంగా ఓ ఫుడ్ బ్రాండ్ స్టార్ట్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు. లీయా మార్కస్, యాసమన్ భక్తియార్ అనే ఈ ఇద్దరు అమ్మాయిల సక్సెస్ స్టోరీ ఇది.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 23 2026, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టిక్‌టాక్ రీల్స్‌తో మొదలైన ప్రయాణం
Image Credit : X

టిక్‌టాక్ రీల్స్‌తో మొదలైన ప్రయాణం

లీయా మార్కస్ (26), యాసమన్ భక్తియార్ (27) యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. 2022లో చదువు పూర్తయ్యాక, 2023లో పచ్చళ్లు, స్నాక్స్‌కు సంబంధించిన టిక్‌టాక్ వీడియోలను ఒకరికొకరు షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. అప్పట్లో ఇంటర్నెట్‌లో పచ్చళ్ల కంటెంట్ బాగా ట్రెండ్ అయ్యేది.

ఆ సరదా కాస్తా ఒక బిజినెస్ ఐడియాగా మారింది. ఇంకేముంది, 2023 సమ్మర్‌లో ఇద్దరూ తమ ఉద్యోగాలకు రిజైన్ చేసి, లాస్ ఏంజిల్స్ కేంద్రంగా ఫుడ్ బ్రాండ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ కంపెనీ మార్కెట్ వాల్యూ సుమారు రూ.81 కోట్లకు చేరుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
'హాట్ గర్ల్' పచ్చళ్ల ఎంట్రీ
Image Credit : X

'హాట్ గర్ల్' పచ్చళ్ల ఎంట్రీ

వీళ్లిద్దరూ కలిసి 'గుడ్ గర్ల్ స్నాక్స్' అనే కంపెనీని స్థాపించారు. ఫిబ్రవరి 2024లో తమ మొదటి ప్రొడక్ట్ 'హాట్ గర్ల్' పచ్చళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. మొదట్లో మధ్యవర్తులు లేకుండా తమ సొంత వెబ్‌సైట్ ద్వారానే కస్టమర్లకు డైరెక్ట్‌గా అమ్మారు. టేస్ట్, ప్యాకేజింగ్ మీద ఫీడ్‌బ్యాక్ తీసుకుని ప్రొడక్ట్‌ను మరింత మెరుగుపరిచారు. పెద్ద ఇన్వెస్టర్ల దగ్గరకు వెళ్లేముందు వీళ్లు తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీ నుంచే పెట్టుబడి సేకరించారు.

34
సూపర్ మార్కెట్లలోకి ఎంట్రీ.. ఫండింగ్
Image Credit : X

సూపర్ మార్కెట్లలోకి ఎంట్రీ.. ఫండింగ్

ఆన్‌లైన్ సేల్స్ సక్సెస్ అయ్యాక, అమెరికాలోని ఫేమస్ సూపర్ మార్కెట్లలో తమ ప్రొడక్ట్స్ అమ్మాలని వీళ్లు డిసైడ్ అయ్యారు. 2025లో ఫేమస్ 'హోల్ ఫుడ్స్ మార్కెట్', ప్రీమియం గ్రోసరీ స్టోర్ 'ఎరెవాన్' (Erewhon)లో తమ పచ్చళ్లను అమ్మేందుకు అప్రూవల్ తెచ్చుకున్నారు. దీంతో ఆఫ్‌లైన్‌లోనూ బ్రాండ్ రేంజ్ పెరిగిపోయింది.

దీనికి తోడు, సీడ్ ఫండింగ్ రౌండ్‌లో ఈ కంపెనీ 3 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సాధించింది. దీంతో కంపెనీ మొత్తం వాల్యూ 8.5 మిలియన్ డాలర్లకు (మన కరెన్సీలో సుమారు రూ.81.4 నుంచి రూ.81.6 కోట్లు) చేరుకుంది.

44
నెక్స్ట్ టార్గెట్ ఇదే
Image Credit : X

నెక్స్ట్ టార్గెట్ ఇదే

కేవలం పచ్చళ్లతోనే ఆగిపోకుండా, ఇతర స్నాక్స్ ఐటెమ్స్‌ను కూడా మార్కెట్లోకి తేవాలని లీయా, యాసమన్ ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియా, కస్టమర్ రిలేషన్స్ బేస్‌గా వీళ్లు తమ బ్రాండ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్ పేజీకి 1,80,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. కంపెనీ పెట్టుబడి, మార్కెట్ వాల్యూ డీటెయిల్స్ బయటకు వచ్చినా, తమ లాభాలు, ఆదాయం ఎంతనేది మాత్రం వీళ్లు ఇంకా అఫీషియల్‌గా ప్రకటించలేదు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం
ప్రపంచం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jio IPO: జియో ఐపీఓ సంచలనం.. భారత్‌లో ఫస్ట్ టైమ్ 10 మిలియన్లకు పైగా దరఖాస్తులతో రికార్డు
Recommended image2
Mutual Fund SIP: కేవలం రూ. 2 వేల పెట్టుబడితో రూ. 2 కోట్లు సొంతం.. ఈ ట్రిక్ మీకు తెలుసా?
Recommended image3
Gold Silver Rate: దసరా నుంచి దిగొస్తున్న పసిడి, వెండి..ధరలు చూస్తే కొనాలనిపిస్తోందా?
Related Stories
Recommended image1
Smartphone Mistakes: దిండుకింద ఫోన్ పెట్టి ఛార్జింగ్ చేస్తున్నారా? ఈ 5 పనులు వెంటనే మానేయండి!
Recommended image2
Curd Vada: ఈ గారెలంటే సమంతకి చాలా ఇష్టమట..మరి ఎలా చేయాలో రెసిపీ చూసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved