MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Smartphone Mistakes: దిండుకింద ఫోన్ పెట్టి ఛార్జింగ్ చేస్తున్నారా? ఈ 5 పనులు వెంటనే మానేయండి!

Smartphone Mistakes: దిండుకింద ఫోన్ పెట్టి ఛార్జింగ్ చేస్తున్నారా? ఈ 5 పనులు వెంటనే మానేయండి!

Smartphone Mistakes: మొబైల్ త్వరగా పాడవుతోందా? ఛార్జింగ్ పెట్టేటప్పుడు దిండుకింద ఉంచడం, ఎండలో వదిలేయడం, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను పట్టించుకోకపోవడం వంటి చిన్న పొరపాట్లే ఫోన్ పనితీరుపై ప్రభావం చూపవచ్చు. అందుకే ఈ 5 తప్పులకు దూరంగా ఉండండి.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 23 2026, 05:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొబైల్ ఫోన్ త్వరగా పాడవుతోందా?
Image Credit : gemini ai

మొబైల్ ఫోన్ త్వరగా పాడవుతోందా?

స్మార్ట్‌ఫోన్‌ను రోజంతా ఉపయోగిస్తున్నా.. దాని రక్షణ విషయంలో మాత్రం చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. దిండుకింద పెట్టి ఛార్జింగ్ చేయడం నుంచి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను పట్టించుకోకపోవడం వరకు కొన్ని అలవాట్లు ఫోన్ బ్యాటరీపై ప్రభావం చూపించడంతో పాటు, ఇతర సమస్యలకూ దారితీయవచ్చు. ఫోన్ ఎక్కువకాలం పనిచేయాలంటే ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.

1. దిండుకింద పెట్టి ఛార్జింగ్ చేయడం

మొబైల్‌ను బెడ్‌పై పెట్టి ఛార్జింగ్ చేస్తూ.. దానిపై దిండు లేదా దుప్పటి కప్పి నిద్రపోయే అలవాటు కొందరికి ఉంటుంది. కానీ ఇది ప్రమాదకరం కావచ్చు. దిండు, దుప్పటి వంటి వస్తువులు ఫోన్ నుంచి వెలువడే వేడిని బయటకు వెళ్లనివ్వవు. దీంతో ఫోన్ మరింత వేడెక్కే అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల్లో అగ్ని ప్రమాదం కూడా సంభవించవచ్చు. అందుకే ఫోన్‌ను గాలి వెళ్లే చోట పెట్టాలి. కంపెనీ ఇచ్చిన ఛార్జర్ ను మాత్రమే వాడాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2. ఎండలో లేదా వేడి ప్రదేశాల్లో ఫోన్ పెట్టడం
Image Credit : Generated by google gemini AI

2. ఎండలో లేదా వేడి ప్రదేశాల్లో ఫోన్ పెట్టడం

ఫోన్‌ను కారులో డ్యాష్‌బోర్డ్‌పై, ఎండ పడే కిటికీ దగ్గర లేదా వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంచుతున్నారా? అయితే జాగ్రత్త. అధిక వేడి వల్ల ఫోన్ బ్యాటరీ దెబ్బతినొచ్చు. పదేపదే వేడి ప్రదేశంలో పెట్టడం వల్ల బ్యాటరీ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. ఫోన్ వేడెక్కితే వెంటనే ఎండ నుంచి దూరంగా తీసుకెళ్లి చల్లబడేలా చూడాలి. వేడిగా ఉన్న కారులో ఫోన్‌ను ఎక్కువసేపు వదిలేయకూడదు.

35
3. ఛార్జింగ్ పోర్టులో దుమ్మును పట్టించుకోకపోవడం
Image Credit : AI

3. ఛార్జింగ్ పోర్టులో దుమ్మును పట్టించుకోకపోవడం

ఫోన్‌ను జేబులో లేదా హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుని తిరిగేటప్పుడు దుమ్ము ఛార్జింగ్ పోర్టులో పేరుకుపోవచ్చు. దీంతో ఛార్జర్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, ఛార్జింగ్ మధ్యలో ఆగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో కేబుల్‌ను బలవంతంగా లోపలికి పెట్టకూడదు. అలా చేస్తే పోర్టు పాడవుతుంది. శుభ్రం చేయాల్సి వస్తే చిన్న క్లాత్ తో తుడవాలి. అంతేకానీ.. పిన్నులతో శుభ్రం చేయడానికి ప్రయత్నించకూడదు.

45
4. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను నిర్లక్ష్యం చేయడం
Image Credit : Freepik

4. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను నిర్లక్ష్యం చేయడం

ఫోన్‌లో అప్‌డేట్ నోటిఫికేషన్ కనిపించగానే చాలామంది తర్వాత చూద్దామంటూ పక్కన పెడుతుంటారు. కానీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ రావొచ్చు. వాటిని చాలాకాలం పాటు ఇన్‌స్టాల్ చేయకపోతే ఫోన్ సైబర్ ముప్పులకు గురయ్యే అవకాశం పెరుగుతుంది. అందుకే అధికారిక అప్‌డేట్స్ అందుబాటులోకి వచ్చినప్పుడు వాటిని ఇన్‌స్టాల్ చేయడం మంచిది. పెద్ద అప్‌డేట్ చేసే ముందు ముఖ్యమైన ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైళ్లను బ్యాకప్ చేసుకోవాలి. అలాగే ఫోన్‌లో తగినంత స్టోరేజ్ ఖాళీగా ఉండేలా చూసుకోవాలి.

55
5. ఫోన్‌కు రక్షణ కల్పించకపోవడం
Image Credit : Asianet News

5. ఫోన్‌కు రక్షణ కల్పించకపోవడం

ఫోన్ చేతిలో నుంచి జారిపడటం, వస్తువులకు తగలడం సాధారణమే. స్క్రీన్ పగలకపోయినా బలంగా పడితే లోపలి భాగాలు పాడవుతాయి. అలాగే తాళాలు, కాయిన్స్ వంటి గట్టి వస్తువులతో ఒకే జేబులో పెట్టుకోవడం వల్ల స్క్రీన్‌పై గీతలు పడే ప్రమాదం ఉంది.

క్వాలిటీ మొబైల్ మొబైల్ కేస్, స్క్రీన్ ప్రొటెక్టర్ ఉపయోగించడం మంచిది. ఫోన్‌ను ఎక్కువకాలం ఉపయోగించాలంటే ఖరీదైన యాక్సెసరీలు కొనడమే కాదు.. రోజువారీ అలవాట్లలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
సాంకేతిక వార్తలు చిట్కాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Job: కుక్కల ఫుడ్ టేస్ట్ చేసే ఉద్యోగం... లక్షల్లో జీతం, ఈ ఉద్యోగానికి ఎలాంటి క్వాలిటీస్ కావాలో తెలుసా?
Recommended image2
Curd Vada: ఈ గారెలంటే సమంతకి చాలా ఇష్టమట..మరి ఎలా చేయాలో రెసిపీ చూసేయండి
Recommended image3
Hair Growth: పెరుగులో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
Related Stories
Recommended image1
DIY Ideas: ఈ క్రియేటివ్ ఐడియాస్ తో పాత పెళ్లి పత్రికలను పిల్లల క్రాఫ్ట్ గా వాడుకోవచ్చు
Recommended image2
Water Tank Placement: వాటర్ ట్యాంకు డాబాపైనే ఎందుకు కట్టాలి? కింద కడితే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved