MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • UAN నంబర్ మర్చిపోయారా? ఈపీఎఫ్‌ఓ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇలా సులభంగా రికవర్ చేసుకోండి

UAN నంబర్ మర్చిపోయారా? ఈపీఎఫ్‌ఓ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇలా సులభంగా రికవర్ చేసుకోండి

UAN Recovery: మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) నంబర్ మర్చిపోయారా? రూపాయి ఖర్చు లేకుండా ఈపీఎఫ్‌ఓ పోర్టల్, ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా రికవర్ చేసుకోవచ్చు. ఆ వివరాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 24 2026, 02:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
UAN అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఎంత?
Image Credit : Chatgpt

UAN అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఎంత?

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) అందించే ప్రతి సేవను ఉపయోగించుకోవడానికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) చాలా కీలకం. మీ ప్రావిడెంట్ ఫండ్ (PF) బ్యాలెన్స్ చెక్ చేయడం, పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడం, విత్‌డ్రా క్లెయిమ్ ఫైల్ చేయడం, ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఖాతాను ట్రాన్స్‌ఫర్ చేయడం లేదా కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయడం.. ఇలా ప్రతీ దానికి ఈపీఎఫ్‌ఓ యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌లో యూఏఎన్ నంబర్ తప్పనిసరి.

ఈపీఎఫ్‌ఓ ప్రకారం, యూఏఎన్ అనేది 12 అంకెల ప్రత్యేక సంఖ్య. ప్రతీ ఈపీఎఫ్ సభ్యుడికి ఒకే యూఏఎన్ కేటాయిస్తారు. ఉద్యోగి తన కెరీర్‌లో ఎన్ని ఉద్యోగాలు మారినా ఈ నంబర్ మారదు, జీవితాంతం ఒకేలా ఉంటుంది. వివిధ యజమానుల వద్ద తెరిచే కొత్త పీఎఫ్ ఖాతాలు అన్నీ ఈ ఒక్క యూఏఎన్ తోనే లింక్ అవుతాయి. ఈపీఎఫ్ సంబంధిత అన్ని లావాదేవీలకు ఇది ప్రధాన గుర్తింపుగా పనిచేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మర్చిపోయిన యూఏఎన్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో పొందడం ఎలా?
Image Credit : Freepik

మర్చిపోయిన యూఏఎన్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో పొందడం ఎలా?

చాలామంది ఉద్యోగులు సమయం గడిచేకొద్దీ తమ యూఏఎన్ నంబర్‌ను మర్చిపోతుంటారు. దీనిని గ్రహించిన ఈపీఎఫ్‌ఓ, సభ్యులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా, కంపెనీని సంప్రదించకుండా కేవలం కొన్ని నిమిషాల్లో ఆన్‌లైన్‌లో రికవర్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఈ రికవరీ ప్రక్రియ కోసం క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:

1. ఈపీఎఫ్‌ఓ యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌ను సందర్శించి, 'Know Your UAN' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

2. అక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.

3. ఆధార్, పాన్ కార్డు లేదా మెంబర్ ఐడీలలో ఏదో ఒక గుర్తింపు కార్డును ఎంచుకోవాలి.

4. ఎంచుకున్న డాక్యుమెంట్ నంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

5. 'Send OTP' పై క్లిక్ చేయాలి.

6. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ని ఎంటర్ చేయాలి.

7. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, మీ UAN నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఈ ఆన్‌లైన్ సేవలు పనిచేయాలంటే మీ మొబైల్ నంబర్ ఈపీఎఫ్‌ఓ వద్ద ముందే రిజిస్టర్ అయి ఉండాలి.

Related Articles

Related image1
Gold Loan Tips: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే మీ బంగారం గోవిందా
Related image2
EPFO New Rules 2026: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి జాక్‌పాట్.. ఈపీఎఫ్‌ఓ 5 కొత్త రూల్స్ ఇవే
35
ఇంటర్నెట్ లేకపోయినా UAN నంబర్ పొందే ఆఫ్ లైన్ మార్గాలు
Image Credit : Asianet News

ఇంటర్నెట్ లేకపోయినా UAN నంబర్ పొందే ఆఫ్ లైన్ మార్గాలు

ఇంటర్నెట్ సదుపాయం లేని సభ్యుల కోసం ఈపీఎఫ్‌ఓ కొన్ని ఆఫ్‌లైన్ సౌకర్యాలను కూడా కల్పిస్తోంది.

• SMS సేవలు: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి EPFOHO UAN అని టైప్ చేసి 7738299899 నంబర్‌కు SMS పంపాలి. ఈ సేవ డిఫాల్ట్‌గా ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషల్లో పొందడానికి ప్రాధాన భాష మొదటి మూడు అక్షరాలను జోడించవచ్చు (ఉదాహరణకు TEL, HIN, TAM).

• మిస్డ్ కాల్ సేవలు: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. మీ UAN గనుక ఆధార్, పాన్ లేదా బ్యాంక్ ఖాతా వివరాలతో లింక్ అయి ఉంటే, ఈపీఎఫ్‌ఓ మీ లేటెస్ట్ పీఎఫ్ బ్యాలెన్స్, కాంట్రిబ్యూషన్ వివరాలతో కూడిన SMS పంపుతుంది. ఈ సేవ ఉచితం, సాధారణ కీప్యాడ్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది.

45
ఆన్‌లైన్ రికవరీ ఫెయిల్ కారణాలు ఏమిటి?
Image Credit : Pixabay

ఆన్‌లైన్ రికవరీ ఫెయిల్ కారణాలు ఏమిటి?

ఒకవేళ ఆన్‌లైన్ రికవరీ ప్రక్రియ విఫలమైతే, ఆ సమస్య సాధారణంగా పోర్టల్‌లో కాకుండా సభ్యుడి వివరాల్లోని తేడాల వల్ల వస్తుంది.

దీనికి ప్రధాన కారణాలు:

• రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మారడం వల్ల ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి కాకపోవడం.

• ఆధార్, పాన్, ఈపీఎఫ్‌ఓ రికార్డులలో పేరు లేదా పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలు సరిపోలకపోవడం.

• కేవైసీ పూర్తి కాకపోవడం లేదా యూఏఎన్ తో ఆధార్ లింక్ కాకపోవడం.

• మునుపటి ఉద్యోగాల కారణంగా ఒకటి కంటే ఎక్కువ యూఏఎన్ లు ఉంటే వెరిఫికేషన్‌లో సమస్యలు రావడం.

• ఈపీఎఫ్‌ఓ సిస్టమ్ నిర్వహణ లేదా డిజిటల్ నెట్‌వర్క్ అప్‌గ్రేడ్ చేస్తున్నప్పుడు తాత్కాలిక సాంకేతిక సమస్యలు రావడం.

55
సమస్యలు రాకుండా ఉండటానికి ఈపీఎఫ్‌ఓ సూచనలు
Image Credit : Asianet News

సమస్యలు రాకుండా ఉండటానికి ఈపీఎఫ్‌ఓ సూచనలు

ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఈపీఎఫ్‌ఓ కొన్ని జాగ్రత్తలు సూచించింది..

• మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకోండి.

• ఆధార్, పాన్, ఈపీఎఫ్‌ఓ రికార్డుల్లో మీ వ్యక్తిగత వివరాలు ఒకేలా ఉండేలా చూసుకోండి.

• మీ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.

• ఉద్యోగాలు మారిన ప్రతిసారీ కొత్త యూఏఎన్ క్రియేట్ చేయకుండా, కెరీర్ అంతటా ఒకే యూఏఎన్ కొనసాగించండి.

సభ్యులు తమ యూఏఎన్ ను కేవలం అధికారిక ఈపీఎఫ్‌ఓ ఛానెల్స్ ద్వారా మాత్రమే రికవర్ చేసుకోవాలి. సహాయం చేస్తామని చెప్పే థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లు లేదా ఫోన్ కాల్స్‌ చేసే వ్యక్తులతో ఓటీపీలు, వ్యక్తిగత వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోవద్దు. ఒకవేళ ఆన్‌లైన్ రికవరీ ప్రక్రియ పూర్తిగా విఫలమైతే, సభ్యులు తమ యజమానిని కానీ లేదా ఈపీఎఫ్‌ఓ హెల్ప్‌డెస్క్‌ను కానీ సంప్రదించవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
పర్సనల్ పైనాన్స్
వ్యాపారం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Loan Tips: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే మీ బంగారం గోవిందా
Recommended image2
Gold Price Crash: ఇవాళ కుప్పకూలిన బంగారం ధరలు..అంతర్జాతీయ పరిస్థితులతో పసిడిపై ఒత్తిడి
Recommended image3
DMart Business Idea : నేరుగా డీమార్ట్‌ తోనే బిజినెస్ చేయండి.. నెలనెలా లక్షల్లో సంపాదించే సూపర్ ఛాన్స్
Related Stories
Recommended image1
Gold Loan Tips: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే మీ బంగారం గోవిందా
Recommended image2
EPFO New Rules 2026: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి జాక్‌పాట్.. ఈపీఎఫ్‌ఓ 5 కొత్త రూల్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved