MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • Gold Loan Tips: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే మీ బంగారం గోవిందా

Gold Loan Tips: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే మీ బంగారం గోవిందా

Gold Loan Tips: గోల్డ్ లోన్ తీసుకునేవారు అర్హత ఉంది కదా అని ఎక్కువ లోన్ తీసుకోకూడదు. ఈ 5 విషయాలు తెలియకపోతే మీరు నష్టపోతారు. వడ్డీ రేట్లు, ఛార్జీలు, బంగారం ధరల్లో హెచ్చుతగ్గుల రిస్క్ గురించిన పూర్తి వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 24 2026, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఈ పొరపాటు అస్సలు చేయకండి
Image Credit : istock

గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఈ పొరపాటు అస్సలు చేయకండి

బంగారాన్ని అమ్మకుండా, అవసరానికి తక్షణమే డబ్బులు పొందేందుకు గోల్డ్ లోన్ ఒక సూపర్ ఆప్షన్. అయితే, ఎమర్జెన్సీలో డబ్బులు వస్తున్నాయని కంగారుపడి ఎంత పడితే అంత లోన్ తీసుకోకూడదు. ముఖ్యంగా మొదటిసారి గోల్డ్ లోన్ తీసుకునేవారు రీపేమెంట్ సామర్థ్యం ముందుగానే అంచనా వేసుకోవాలి. బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్న తరుణంలో, రుణం తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అర్హత ఉందనే ఆశతో ఎక్కువ తీసుకోవద్దు
Image Credit : Chatgpt

అర్హత ఉందనే ఆశతో ఎక్కువ తీసుకోవద్దు

ఇటీవల కాలంలో బంగారం ధరలు రూ. 1.82 లక్షల వద్ద రికార్డు స్థాయికి చేరి, ఆ తర్వాత కాస్త తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికీ ధరలు ఎక్కువే ఉన్నాయి. దీనివల్ల అదే పరిమాణంలో ఉన్న మీ బంగారంపై ఇప్పుడు ఎక్కువ మొత్తంలో రుణం లభిస్తుంది.

అయితే, బ్యాంకులు ఎక్కువ లోన్ ఇస్తున్నాయని చెప్పి, అవసరానికి మించి లోన్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. బ్యాంకింగ్ రంగ నిపుణుల ప్రకారం.. బంగారం విలువను బట్టి లోన్ ఎలిజిబిలిటీ పెరిగినప్పటికీ, మనకు అసలు ఎంత అవసరం? దానిని తిరిగి చెల్లించే స్థోమత ఉందా? అనేదే ముఖ్యం. ఎలిజిబిలిటీ మొత్తం తీసుకోకుండా కాస్త గ్యాప్ ఉంచడం వల్ల, భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గినా మీ లోన్ సేఫ్‌గా ఉంటుంది.

Related Articles

Related image1
EPFO New Rules 2026: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి జాక్‌పాట్.. ఈపీఎఫ్‌ఓ 5 కొత్త రూల్స్ ఇవే
Related image2
Most Liveable Cities 2026: వరల్డ్ బెస్ట్ సిటీ ఏదో తెలుసా? ఇండియా, పాకిస్థాన్‌ నగరాల ర్యాంకులు ఇవే
36
హిడెన్ ఛార్జీలు, అసలు ఖర్చులు
Image Credit : Asianet News

హిడెన్ ఛార్జీలు, అసలు ఖర్చులు

చాలామంది గోల్డ్ లోన్ అనగానే కేవలం వడ్డీ రేట్లను మాత్రమే చూస్తారు. కానీ దాని వెనుక చాలా రకాల ఖర్చులు దాగి ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజులు, అప్రైజల్ ఛార్జీలు, ఫోర్‌క్లోజర్ ఛార్జీలు, ఆలస్యంగా చెల్లిస్తే పడే పెనాల్టీలు వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.

అలాగే స్థానిక జ్యువెలర్స్ వద్ద కాకుండా ఆర్బీఐ ద్వారా గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా మంచి ఎన్బీఎఫ్‌సీల లో మాత్రమే లోన్ తీసుకోవడం మంచిది. ఇక్కడ మీ బంగారానికి సురక్షితమైన వాల్ట్ స్టోరేజ్, ఇన్సూరెన్స్ లభిస్తాయి.

46
గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..
Image Credit : Chatgpt

గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..

  • మీ అసలు అవసరానికి మాత్రమే రుణం తీసుకోండి.
  • 18 నుండి 22 క్యారెట్ల బంగారానికి మాత్రమే లోన్ వస్తుంది.
  • నగల్లోని రాళ్ళు, రత్నాల బరువును మినహాయించే ప్యూర్ గోల్డ్ వెయిట్ నే లెక్కిస్తారు.
  • వడ్డీతో పాటు ప్రాసెసింగ్, ప్రాసెసింగ్ ఫీజులను సరిచూసుకోండి.
56
బంగారం ధరలు తగ్గితే మార్జిన్ కాల్స్ రిస్క్
Image Credit : Asianet News

బంగారం ధరలు తగ్గితే మార్జిన్ కాల్స్ రిస్క్

మార్కెట్‌లో బంగారం ధరలు అనూహ్యంగా తగ్గితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన లోన్ టు వాల్యూ (LTV) నిష్పత్తి మారిపోతుంది. అంటే మీ బంగారం విలువ తగ్గినప్పుడు, మీరు తీసుకున్న లోన్ మొత్తం బ్యాంకుకి రిస్క్‌గా మారుతుంది.

ఇలాంటి సమయంలో బ్యాంకులు మార్జిన్ కాల్స్ ఇస్తాయి. అంటే వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి అదనపు డబ్బులు చెల్లించమని లేదా మరికొంత బంగారం తాకట్టు పెట్టమని కోరతాయి. బుల్లెట్ రీపేమెంట్ ఎంచుకున్న వారికి ఈ రిస్క్ మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే క్రమం తప్పకుండా ఈఎమ్‌ఐ పద్ధతిలో చెల్లించడం వల్ల లోన్ భారం క్రమంగా తగ్గుతుంది.

66
రీపేమెంట్ ఆప్షన్లు, కాలపరిమితి అర్థం చేసుకోండి
Image Credit : our own

రీపేమెంట్ ఆప్షన్లు, కాలపరిమితి అర్థం చేసుకోండి

గోల్డ్ లోన్లు సాధారణంగా 3 నెలల నుండి 12 నెలల స్వల్పకాలిక వ్యవధికి ఇస్తారు. బ్యాంకులు ప్రధానంగా నాలుగు రకాల రీపేమెంట్ ఆప్షన్లను ఇస్తాయి:

• పాక్షిక వాయిదాలు

• నెలకు కేవలం వడ్డీ చెల్లించి, చివర్లో అసలు ఇవ్వడం

• బుల్లెట్ రీపేమెంట్

• రెగ్యులర్ నెలవారీ ఈఎమ్‌ఐ

మీ ఆదాయం, క్యాష్ ఫ్లో ఆధారంగా మీకు సరిపోయే పద్ధతిని ఎంచుకోవాలి. బ్యాంకు నుండి ఎలాంటి సమాచారం వచ్చినా వెంటనే స్పందిస్తే మీ తాకట్టు బంగారం వేలానికి వెళ్లకుండా సురక్షితంగా ఉంటుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
బంగారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image2
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Recommended image3
తెలియ‌కుండానే వంట నూనె ఎక్కువ‌గా వాడుతున్నారా.? ఈ ప్రొడ‌క్ట్ ఉంటే స‌మ‌స్య‌కు చెక్
Related Stories
Recommended image1
EPFO New Rules 2026: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి జాక్‌పాట్.. ఈపీఎఫ్‌ఓ 5 కొత్త రూల్స్ ఇవే
Recommended image2
Most Liveable Cities 2026: వరల్డ్ బెస్ట్ సిటీ ఏదో తెలుసా? ఇండియా, పాకిస్థాన్‌ నగరాల ర్యాంకులు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved