MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Custom Duty Cut : గుడ్ న్యూస్.. షాంపూ నుండి మందుల దాకా.. ఇవన్నీ చవకమ్మ చవక !

Custom Duty Cut : గుడ్ న్యూస్.. షాంపూ నుండి మందుల దాకా.. ఇవన్నీ చవకమ్మ చవక !

Custom Duty Cut : పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీని రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో షాంపూ, మందుల ధరలు తగ్గనున్నాయి. ఇంకా ఏఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 02 2026, 05:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేంద్రం నిర్ణయంతో భారీగా తగ్గనున్న నిత్యావసరాల ధరలు
Image Credit : Gemini

కేంద్రం నిర్ణయంతో భారీగా తగ్గనున్న నిత్యావసరాల ధరలు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, 41 అత్యవసర పెట్రోకెమికల్ వస్తువులపై కస్టమ్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేసింది. ఏప్రిల్ 2 నుండి అమలులోకి వచ్చే ఈ రాయితీ జూన్ 30, 2026 వరకు కొనసాగుతుంది. ఈ నిర్ణయం వల్ల సామాన్యుడిపై పెరుగుతున్న ద్రవ్యోల్బణ భారం తగ్గడమే కాకుండా, తయారీ రంగంలో ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సరఫరా వ్యవస్థపై ప్రపంచ సంక్షోభం ప్రభావం
Image Credit : X-@BJP4India

సరఫరా వ్యవస్థపై ప్రపంచ సంక్షోభం ప్రభావం

మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్, ఎల్‌పీజీ సరఫరా తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో ముడి చమురు ధర రికార్డు స్థాయిలో బ్యారెల్ కు 122 డాలర్లకు చేరుకుంది. ముడి చమురు ధరలు పెరగడంతో చమురు కంపెనీల వ్యయం భారీగా పెరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్‌పై జరిపిన దాడులు, ఆపై ఇరాన్ ప్రతిదాడులతో చమురు ధరలు 50 శాతానికి పైగా ఎగబాకాయి. భారత్ తన అవసరాల కోసం 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న తరుణంలో ఈ పరిస్థితి ఆందోళన కలిగించింది.

Related Articles

Related image1
Raghav Chadha: పదవి పోయింది.. నోరు మూయించారు.. రాఘవ్ చద్దా ఏం చేశారు? ఆప్ కక్షగట్టిందా?
Related image2
57 వేల కోట్ల అప్పుల దివాలా కంపెనీ కోసం అదానీ, వేదాంత ఎందుకు ఫైట్ చేస్తున్నాయి?
35
ఏయే రంగాలు లాభపడనున్నాయి?
Image Credit : Freepik

ఏయే రంగాలు లాభపడనున్నాయి?

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశీయ పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకు అతి తక్కువ ధరకే లభించనుంది. దీనివల్ల ప్లాస్టిక్, ప్యాకేజింగ్, టెక్స్‌టైల్, ఫార్మాస్యూటికల్, కెమికల్, ఆటోమోటివ్ విడిభాగాలు, ఇతర తయారీ రంగాలు భారీగా లాభపడనున్నాయి. రోజువారీ వాడే వస్తువుల ఉత్పత్తి వ్యయం తగ్గడం వల్ల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించే అవకాశం ఉంది. ఫలితంగా సామాన్యులకు షాంపూ నుండి నిత్యావసర వస్తువుల వరకు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయి.

45
కస్టమ్ డ్యూటీ రద్దు చేసిన 40 వస్తువుల జాబితా ఇదే
Image Credit : ChatGPT & X

కస్టమ్ డ్యూటీ రద్దు చేసిన 40 వస్తువుల జాబితా ఇదే

ప్రభుత్వం సుంకాన్ని సున్నా చేసిన వస్తువులలో మేథనాల్, టోల్యున్, స్టైరిన్, వినైల్ క్లోరైడ్ మోనోమర్, మోనో ఇథిలీన్ గ్లైకాల్ (MEG), ఫినాల్, ఎసిటిక్ యాసిడ్, ప్యూరిఫైడ్ టెరెఫ్తాలిక్ యాసిడ్ (PTA) ఉన్నాయి. వీటితో పాటు పాలిథిలిన్, పాలిప్రొఫైలిన్, పాలిస్టైరిన్, పాలీ వినైల్ క్లోరైడ్ (PVC), పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (PET), ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ వంటి ఆక్రిలోనిట్రైల్-బ్యూటాడైన్-స్టైరిన్ (ABS), పాలికార్బోనేట్ వంటి కీలక ఉత్పత్తులపై జూన్ 30 వరకు ఎటువంటి పన్ను ఉండదు.

55
వస్తువుల తయారీలో వీటి పాత్ర ఇదే !
Image Credit : Pinterest

వస్తువుల తయారీలో వీటి పాత్ర ఇదే !

ఈ పెట్రోకెమికల్స్ మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి..

  • మేథనాల్: ప్లైవుడ్, పెయింట్స్, కోటింగ్స్, మందుల తయారీలో వాడతారు.
  • టోల్యున్: గ్లూ (జిగురు), ప్రింటింగ్ ఇంక్, రబ్బరు, ఆటో పార్ట్స్ తయారీలో అవసరం.
  • పాలిస్టైరిన్: డిస్పోజబుల్ ప్లేట్లు, కప్పులు, ఫుడ్ కంటైనర్లు, ఐస్ క్రీం కప్పుల తయారీకి వాడతారు.
  • వినైల్ క్లోరైడ్ మోనోమర్: మెడికల్ ట్యూబ్స్, బ్లడ్ బ్యాగులు, బొమ్మలు, క్రెడిట్ కార్డుల తయారీలో కీలకం.
  • మోనో ఇథిలీన్ గ్లైకాల్ (MEG): వాటర్ బాటిళ్లు, కోల్డ్ డ్రింక్ బాటిళ్లు, షాంపూ బాటిళ్లు, బట్టల తయారీలో ఉపయోగిస్తారు.
  • పాలిథిలిన్: పాలు/జ్యూస్ బాటిళ్లు, షాపింగ్ బ్యాగులు, ఫుడ్ ర్యాప్స్, డిస్పోజబుల్ గ్లౌజుల తయారీలో వాడతారు.

ప్రభుత్వం గత వారమే పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు 10 రూపాయల మేర తగ్గించింది. ఇప్పుడు పెట్రోకెమికల్ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపుతో సామాన్యుడి పై మరింత భారం తగ్గనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత దేశం
హైదరాబాద్
స్టాక్ మార్కెట్
పర్సనల్ పైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Raghav Chadha: పదవి పోయింది.. నోరు మూయించారు.. రాఘవ్ చద్దా ఏం చేశారు? ఆప్ కక్షగట్టిందా?
Recommended image2
57 వేల కోట్ల అప్పుల దివాలా కంపెనీ కోసం అదానీ, వేదాంత ఎందుకు ఫైట్ చేస్తున్నాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved