MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • FD Interest Rates: డిపాజిటర్లకు పండుగే పండుగ.. ఆ స్పెషల్ ఎఫ్‌డీలపై పెరిగిన వడ్డీ

FD Interest Rates: డిపాజిటర్లకు పండుగే పండుగ.. ఆ స్పెషల్ ఎఫ్‌డీలపై పెరిగిన వడ్డీ

FD Interest Rates: ఇండియన్ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్. 555, 777 రోజుల స్పెషల్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 0.15% బ్యాంకు పెంచింది. సీనియర్ సిటిజన్లకు 7.55% వరకు వడ్డీ లభించనుంది. పూర్తి వివరాలు ఇవే.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 29 2026, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎఫ్‌డీ డిపాజిటర్లకు ఇండియన్ బ్యాంక్ బంపర్ ఆఫర్
Image Credit : Chatgpt

ఎఫ్‌డీ డిపాజిటర్లకు ఇండియన్ బ్యాంక్ బంపర్ ఆఫర్

మీరు మీ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్ డీ)లో దాచుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్ తన ఖాతాదారులకు పెద్ద ఊరటనిచ్చింది. బ్యాంక్ తన రెండు స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌ల వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పండగ వాతావరణంలో డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకునేవారికి ఇది నిజంగా మంచి అవకాశం అని చెప్పవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
555, 777 రోజుల స్పెషల్ స్కీమ్‌లు
Image Credit : magnific

555, 777 రోజుల స్పెషల్ స్కీమ్‌లు

ఇండియన్ బ్యాంక్ ముఖ్యంగా 555 రోజులు, 777 రోజుల వ్యవధి కలిగిన ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలపై వడ్డీ రేట్లను 0.15 శాతం మేర పెంచింది. ఈ పెంచిన కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 23 నుంచే అమల్లోకి వచ్చాయి.

• Ind Grow FD (555 రోజులు): గతంలో ఈ పథకంపై ఏడాదికి 6.65% వడ్డీ లభించేది. ఇప్పుడు దానిని 6.80% కి పెంచారు.

• Ind Prosper FD (777 రోజులు): ఈ స్కీమ్‌పై ఇంతకుముందు 6.60% వడ్డీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇది 6.75% కి పెరిగింది.

ఈ కొత్త రేట్లు రూ. 3 కోట్లలోపు ఉన్న రిటైల్ డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి.

35
సీనియర్ సిటిజన్లకు బంపర్ బెనిఫిట్స్
Image Credit : ChatGPT

సీనియర్ సిటిజన్లకు బంపర్ బెనిఫిట్స్

ఈ ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌ల ద్వారా వయోవృద్ధులకు బ్యాంక్ మరింత ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తోంది. సాధారణ డిపాజిటర్ల కంటే సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది.

• 60 ఏళ్లు దాటిన వారికి: 555 రోజుల ఎఫ్‌డీపై 7.30%, 777 రోజుల ఎఫ్‌డీపై 7.25% వార్షిక వడ్డీ అందుతుంది.

• 80 ఏళ్లు దాటిన సూపర్ సీనియర్లకు: 555 రోజుల ఎఫ్‌డీపై గరిష్ఠంగా 7.55%, 777 రోజుల ఎఫ్‌డీపై 7.50% వడ్డీ లభిస్తుంది.

కాబట్టి మీ ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వారి పేరిట డిపాజిట్ చేయడం వల్ల ఎక్కువ లాభం పొందవచ్చు.

45
ఇతర వ్యవధుల ఎఫ్‌డీ రేట్లు ఇలా ఉన్నాయి
Image Credit : Asianet News

ఇతర వ్యవధుల ఎఫ్‌డీ రేట్లు ఇలా ఉన్నాయి

ఈ రెండు స్పెషల్ ఎఫ్‌డీలు మినహా, మిగిలిన వ్యవధుల డిపాజిట్ల వడ్డీ రేట్లలో బ్యాంక్ ఎటువంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఉన్న ఇతర రేట్ల వివరాలు చూస్తే:

• 7 నుండి 14 రోజులు: 2.80%

• 30 నుండి 45 రోజులు: 3.00%

• 46 నుండి 90 రోజులు: 3.25%

• 91 నుండి 120 రోజులు: 3.50%

• 121 నుండి 180 రోజులు: 3.85%

• 181 రోజుల నుండి 9 నెలల కంటే తక్కువ: 4.50%

• 9 నెలల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ: 4.75%

• 1 సంవత్సరం: 6.10%

• 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ: 6.20%

• 500 రోజుల Ind Green FD: 6.40%

• 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ: 6.15%

• 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ: 6.05%

• 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ: 6.00%

55
డిపాజిట్ చేసేముందు ఇవి గుర్తుంచుకోండి
Image Credit : magnific

డిపాజిట్ చేసేముందు ఇవి గుర్తుంచుకోండి

మీరు ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఎఫ్‌డీ వ్యవధి ఎంత? మెచ్యూరిటీ కంటే ముందే డబ్బు ఉపసంహరించుకుంటే ఉండే నిబంధనలు ఏమిటి? అనేవి సరిచూసుకోవాలి. అలాగే ఎఫ్‌డీ ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం మీ ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను పరిధిలోకి వస్తుంది. ఈ కొత్తగా పెరిగిన వడ్డీ రేట్లు కొత్తగా చేసే డిపాజిట్లకు, అలాగే మెచ్యూరిటీ అయ్యాక రీన్యూవల్ చేసుకునే ఎఫ్‌డీలకు మాత్రమే వర్తిస్తాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Live
SASA
329
AUSAUS
(112.4 ov)405/8
Day 3 - Session 1
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Silver Rates: హౌతీల దాడుల వేళ మార్కెట్‌లో గందరగోళం.. రూ.2లక్షలకు పడిపోతున్న వెండి
Recommended image2
Best 5G Phones: రూ.12,000 బడ్జెట్‌లో 3 సూపర్ 5G ఫోన్లు.. దీపావళికి భారీ తగ్గింపు ధరలు
Recommended image3
DA Hike: ఉద్యోగులకు దీపావళి కానుక.. 3 శాతం డిఏ పెంపు.. జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Related Stories
Recommended image1
Aadhaar Card: కేవలం 1 నిమిషంలో సులభంగా ఆధార్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా?
Recommended image2
Most Expensive Areas in Hyderabad: హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాలు ఇవే.. కోట్లు పెట్టినా ఇల్లు కొనడం కష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved