MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రూ.2000 జమా.. పూర్తి వివరాలు ఇవే

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రూ.2000 జమా.. పూర్తి వివరాలు ఇవే

PM Kisan 24th Installment: పీఎం కిసాన్ 24వ విడత సొమ్ము అక్టోబర్ 30న విడుదల కానుంది. 9.34 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో రూ.2000 జమ కానున్నాయి. పూర్తి వివరాలు ఇవే..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 29 2026, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రైతుల ఖాతాల్లోకి రూ.2000.. పీఎం కిసాన్ 24వ విడత రిలీజ్
Image Credit : gemini

రైతుల ఖాతాల్లోకి రూ.2000.. పీఎం కిసాన్ 24వ విడత రిలీజ్

దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు చెప్పింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PMKSNY) 24వ విడత సొమ్ము విడుదలకు ముహూర్తం ఖరారైంది.

కేవలం 24 గంటల వ్యవధిలోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు వచ్చి చేరనున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు అవసరమైన పెట్టుబడి సాయం చేతికి అందుతుండడంతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గుజరాత్ లో ప్రధాని మోదీ చేతుల మీదుగా పంపిణీ
Image Credit : chatgpt

గుజరాత్ లో ప్రధాని మోదీ చేతుల మీదుగా పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని బనాస్ కాంతా జిల్లా నుంచి స్వయంగా ప్రారంభించనున్నారు. అక్టోబర్ 30న భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ప్రత్యేక సందర్భంలో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.2000 చొప్పున జమ చేయనున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 23 విడతలను పూర్తి చేసింది. ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) విధానం ద్వారా ప్రతీ ఏటా రైతులకు రూ.6000 ఆర్థిక సాయం అందిస్తున్నారు.

35
9.34 కోట్లకు పైగా రైతులకు ₹18,680 కోట్ల లబ్ధి
Image Credit : AI

9.34 కోట్లకు పైగా రైతులకు ₹18,680 కోట్ల లబ్ధి

ఈసారి 24వ విడత కింద దేశవ్యాప్తంగా సుమారు 9.34 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ. 18,680 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని విడుదల చేస్తోంది.

గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి జీతూ వాఘాణీ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఒక్క గుజరాత్ రాష్ట్రంలోనే సుమారు 52.33 లక్షలకు పైగా రైతు కుటుంబాల ఖాతాల్లో రూ. 1,051 కోట్లకు పైగా నగదు జమ కానుంది.

45
ఈ తప్పు చేస్తే రూ. 2000 పడవు
Image Credit : Getty

ఈ తప్పు చేస్తే రూ. 2000 పడవు

పీఎం కిసాన్ పథకంలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కొందరు అర్హత లేకపోయినా తప్పుడు సమాచారంతో రిజిస్ట్రేషన్ చేసుకుని లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, అసలైన అన్నదాతలకే ప్రయోజనం చేకూరేలా ఈకేవైసీని కేంద్రం తప్పనిసరి చేసింది. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈకేవైసీ పూర్తి చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడవు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవడం కూడా నిర్బంధంగా మారింది.

55
పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
Image Credit : pixabay

పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

రైతులు తమ వివరాలను అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్ లో సులభంగా సరిచూసుకోవచ్చు. పోర్టల్‌లోకి వెళ్లి 'Farmers Corner' విభాగంలో మీ ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయడం ద్వారా లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో క్షణాల్లో తెలుసుకోవచ్చు.

ఈ పథకం ద్వారా లభించే పెట్టుబడి సాయం చిన్న, సన్నకారు రైతులకు పంట సాగు ఖర్చుల కోసం ఎంతో ఊరటనిస్తోంది. మీ ఈకేవైసీ ప్రక్రియ పూర్తికాకపోతే వెంటనే సంబంధిత మీసేవ లేదా పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా పూర్తి చేసుకోవడం మంచిది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యవసాయం (Vyavasayam)
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Lunch
SASA
329
AUSAUS
(117.0 ov)411/8
Day 3 - Session 1
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
FD Interest Rates: డిపాజిటర్లకు పండుగే పండుగ.. ఆ స్పెషల్ ఎఫ్‌డీలపై పెరిగిన వడ్డీ
Recommended image2
Gold Silver Rates: హౌతీల దాడుల వేళ మార్కెట్‌లో గందరగోళం.. రూ.2లక్షలకు పడిపోతున్న వెండి
Recommended image3
Best 5G Phones: రూ.12,000 బడ్జెట్‌లో 3 సూపర్ 5G ఫోన్లు.. దీపావళికి భారీ తగ్గింపు ధరలు
Related Stories
Recommended image1
DA Hike: ఉద్యోగులకు దీపావళి కానుక.. 3 శాతం డిఏ పెంపు.. జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Recommended image2
Most Expensive Areas in Hyderabad: హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాలు ఇవే.. కోట్లు పెట్టినా ఇల్లు కొనడం కష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved