MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Gold Price : తులం బంగారం అక్షరాల లక్ష రూపాయలు

Gold Price : తులం బంగారం అక్షరాల లక్ష రూపాయలు

సోమవారం సాయంత్రానికి బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరింది. ఈ ఏడాది ఆరంభంనుండి రోజురోజుకు వందలు, వేలలో పెరుగుతూ వచ్చిన బంగారం ఇవాళ లక్ష రూపాయల మార్కును దాటింది. హైదరాబాద్ లో ప్రస్తుతం తులం బంగారం ధర ఎంతో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 21 2025, 06:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Gold Price

Gold Price

Gold Price : అందరూ అనుకుంటున్నట్లే జరిగింది... కొద్దిరోజులుగా జెట్ స్పీడులో పెరుగుతున్న బంగారం ఆల్ టైమ్ హైకి చేరింది. తులం (10 గ్రాములు) బంగారం ధర అక్షరాలా లక్ష రూపాయలు చేరింది. దీంతో సామాన్యుడు బంగారం కొనడం కాదు పేరు వింటేనే బెంబేలెత్తిపోయేలా ఉన్నాడు.  

అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల కారణంగా బంగారానికి రెక్కలొచ్చాయి. బంగారంపై పెట్టుబడే సురక్షితమని అందరూ నమ్ముతుండటంతో ఇటీవల కాలంలో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ఇలా రోజురోజుకు పెరుగుతూవచ్చిన గోల్డ్ ఇవాళ ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది. సోమవారం సాయంత్రానికి  24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,016 కు చేరుకుంది. దేశంలో ఒక్కో నగరంలో ఒక్కోలా బంగారం ధరలు ఉంటాయి... కొన్ని నగరాల్లో ఇప్పటికే తులం బంగారం లక్షకు చేరితే మరికొన్నినగరాల్లో రేపు ఈ మార్క్ దాటే అవకాశం ఉంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Gold Price in Hyderabad

Gold Price in Hyderabad

హైదరాబాద్ లో బంగారం ధర ఎంత?

తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు దిగువనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం 98,350 గా ఉంది. మరో రూ.1,650 పెరిగితే ఇక్కడ కూడా లక్ష రూపాయలకు టచ్ అవుతుంది. అయితే ఇది ఎంతో దూరం లేదని... ఒకటిరెండు రోజుల్లో హైదరాబాద్ లో కూడా బంగారం లక్ష రూపాయల మార్కును దాటడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. 

అయితే లక్ష రూపాయలతో బంగారం ధర ఆగిపోదని... మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.  ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది... కాబట్టి బంగారంకు అధిక డిమాండ్ ఉంది. ధర ఎంత పెరిగినా బంగారం కొనేవారు మాత్రం తగ్గడంలేదు. అలాగే  అక్షయ తృతీయ దగ్గర పడుతోంది. ఈరోజు కనీసం గ్రాము బంగారమైనా కొనాలని చాలామంది నమ్ముతారు. ఇలా బంగారం కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు కాబట్టి ధర మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

బంగారం ధర ఇదే స్థాయిలో పెరుగుతూ పోతుంటే తులం ధర రూ.1,30,000 ఈ ఏడాదిలోనే చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం తులం బంగారం అంటేనే నోరెళ్లబెడుతున్న సామాన్యులు ఏడాది చివర్లో బంగారం ధరను చూసి ఎలా రియాక్ట్ అవుతారో. మొత్తంగా బంగారం అనేది ధనవంతుల వస్తువుగా మారిపోతోంది... పేదవాడు ఆ పేరు ఎత్తే పరిస్థితులు మెళ్లిగా దూరమవుతున్నాయి. 
 

33
Gold Price

Gold Price

ఈ నాలుగు నెలల్లోనే బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా? 

ఈ ఏడాది ఆరంభంలో తులం బంగారం ధర రూ.80 వేలు ఉంది... కానీ ఈ మూడునాలుగు నెలల్లోనే లక్ష రూపాయలకు చేరుకుంది. అంటే అతి తక్కువ సమయంలో ఏకంగా రూ.20 వేలు పెరిగింది... అంటే ఇది 26 శాతం పెరుగుదల. మొత్తంగా గత ఐదేళ్లలో బంగారం ధరం 110 శాతం కంటే ఎక్కువగానే పెరిగింది. 

నాలుగేళ్ల కింద అంటే 2020 లో తులం బంగారం ధర కేవలం 45 వేలే. అక్కడినుండి జెట్ స్పీడ్ తో పెరిగిన బంగారం ధర ఇప్పుడు లక్షకు చేరింది. అంతర్జాతీయ స్థాయిలో అలజడి తగ్గేవరకు బంగారం ధర ఇలాగే పెరుగుతుందని అంటున్నారు. అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ బంగారం ధరపై భారీ ప్రభావం చూపిస్తోంది. 

కేవలం బంగారమే కాదు వెండి ధర కూడా చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం కిలో వెండి కూడా రూ.99 వేలకు పైగా ధర పలుకుతోంది. అంటే ఇదికూడా రేపో మాపో లక్ష రూపాయల మార్కును దాటవచ్చు. ఇలా బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరుకుని సామాన్యులకు దూరంగా వెళుతున్నాయి. డబ్బులు బడాబాబులు తప్ప సామాన్యులు బంగారంవైపు కన్నెత్తిచూసే పరిస్థితులు లేవు. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బంగారం
జీవనశైలి
మహిళలు
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image2
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Recommended image3
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved