MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Gold Price Hike: బ్రేకుల్లేకుండా పసిడి ధరలకు రెక్కలు..అమెరికా-ఇరాన్ ఎఫెక్ట్ తో పైపైకి

Gold Price Hike: బ్రేకుల్లేకుండా పసిడి ధరలకు రెక్కలు..అమెరికా-ఇరాన్ ఎఫెక్ట్ తో పైపైకి

Gold Price Hike: బంగారం కొందామని అనుకుంటున్నారా? ఒక్కరోజులోనే పసిడి ధర ఏకంగా రూ.3 వేలకు పైగా పెరిగింది.. వెండి అయితే కిలోకు రూ.10 వేలు ఎగబాకింది. ఇంత భారీగా ధరలు ఎందుకు పెరిగాయి? అమెరికా–ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలకు బంగారం ధరలకు సంబంధం ఏంటి?

2 Min read
Author : Nandini Arava
Published : Aug 11 2026, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భారీగా దూసుకెళ్తున్న గోల్డ్, సిల్వర్
Image Credit : chatgpt

భారీగా దూసుకెళ్తున్న గోల్డ్, సిల్వర్

బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా పైపైకి కదులుతున్న పసిడి రేట్లు.. ఇప్పుడు ఒక్కసారిగా భారీ జంప్ చేశాయి. ఒకేరోజులోనే 10 గ్రాముల బంగారం ధర రూ.3 వేలకు పైగా పెరగడంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. మరోవైపు వెండి ధర కూడా కిలోకు ఏకంగా రూ.10 వేలు పెరిగింది.

దేశీయ బులియన్ మార్కెట్లో మంగళవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,130కి చేరింది. సోమవారంతో పోలిస్తే ఏకంగా రూ.3,160 పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,42,200గా నమోదైంది. ఈ ధరలోనూ ఒక్కరోజులో రూ.2,900 పెరుగుదల కనిపించింది.

బంగారం మాత్రమే కాదు.. వెండి కూడా భారీగా దూసుకెళ్లింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర నిన్న రూ.2.50 లక్షలుగా ఉండగా.. మంగళవారం నాటికి రూ.2.60 లక్షలకు చేరింది. అంటే ఒక్కరోజులోనే రూ.10 వేల పెరుగుదల నమోదైంది. చెన్నైలో కిలో వెండి రూ.2.60 లక్షలు, బెంగళూరులో రూ.2.55 లక్షల వద్ద కొనసాగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బంగారానికి డిమాండ్
Image Credit : Getty

బంగారానికి డిమాండ్

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలే దేశీయంగా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఆంక్షలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి అంశాలు ఇన్వెస్టర్లను సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నాయి. దీంతో సాధారణంగా సేఫ్ హెవెన్‌గా భావించే బంగారానికి డిమాండ్ పెరుగుతోంది.

34
జనవరిలో గరిష్ఠాలను తాకిన ధరలు
Image Credit : iSTOCK

జనవరిలో గరిష్ఠాలను తాకిన ధరలు

ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో పసిడి ధరలు జీవితకాల గరిష్ఠాలను తాకాయి. ఆ తర్వాత కొంతకాలం ఒడిదుడుకులకు లోనైనప్పటికీ.. ఇటీవల మళ్లీ రేట్లు వేగంగా పెరుగుతున్నాయి. త్వరలో పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారం ధరలు ఇలా పెరగడం వినియోగదారుల్లో ఆందోళన పెంచుతోంది. ఇక అంతర్జాతీయ పరిణామాల్లోకి వెళ్తే.. అమెరికా విధిస్తున్న ఆంక్షలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ దేశంపై ఆంక్షలు విధించడం అమెరికాకు అలవాటుగా మారిందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ విమర్శించారు.

44
ఇరాన్ సైన్యంలో కీలక మార్పులు
Image Credit : x.com/IDF

ఇరాన్ సైన్యంలో కీలక మార్పులు

దౌత్యపరమైన మార్గాల్లో లక్ష్యాలను సాధించలేనప్పుడు అమెరికా ఆంక్షలను ఆశ్రయిస్తోందని ఆయన ఆరోపించారు. అవి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోతే మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో ఇరాన్‌ను లొంగదీసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్.. ఇరాన్ ప్రభుత్వం డిజిటల్ ఆస్తులు, రహస్య బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఇరాన్‌కు చెందిన అక్రమ ఆర్థిక వ్యవస్థలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేస్తామని హెచ్చరించారు.

ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య ఆంక్షలు, ఉద్రిక్తతలు కొనసాగుతుంటే.. మరోవైపు ఇరాన్ సైన్యంలో కీలక మార్పులు జరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొంటున్న ఈ అనిశ్చిత పరిస్థితులు మార్కెట్లపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఒక్కరోజులోనే పసిడి రూ.3 వేలకు పైగా, వెండి రూ.10 వేలు పెరగడంతో.. రాబోయే రోజుల్లో ధరల కదలిక ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
Gold Price Today: గోల్డ్ రేటు దిగొచ్చింది.. కానీ మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందా?
Recommended image2
Gold Price Hike: ఆగస్టులో ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. కొద్దిరేజులుగా బేజారెత్తిపోతున్న కొనుగోలుదారులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved