MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Petrol Price: మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి? హోర్ముజ్ వివాదంతో ఊహించని షాక్

Petrol Price: మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి? హోర్ముజ్ వివాదంతో ఊహించని షాక్

Petrol Diesel Rates: హోర్ముజ్ జలసంధి ప్లాన్స్ పై అనిశ్చితితో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ ప్రభావంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పై ప్రభావం పడుతోంది. హోర్ముజ్ సంక్షోభంతో ఇండియాలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా మారబోతున్నాయి?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 10 2026, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్రూడ్ ఆయిల్ ధరకు మళ్లీ రెక్కలు.. మన దగ్గర పెట్రోల్, డీజిల్ రేట్ల సంగతేంటి?
Image Credit : Getty

క్రూడ్ ఆయిల్ ధరకు మళ్లీ రెక్కలు.. మన దగ్గర పెట్రోల్, డీజిల్ రేట్ల సంగతేంటి?

అమెరికా, ఇరాన్ మధ్య దాదాపు ఆరు నెలలుగా సాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇటీవల ఒమన్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల నడుమ చర్చలు జరుగుతున్నాయనే వార్తలు రాగానే, గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు కాస్త తగ్గాయి. అయితే, ఈ హెచ్చుతగ్గుల మధ్య వారంలో మొదటి రోజే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పైకి లేచాయి. దీనికి ప్రధాన కారణం ప్రసిద్ధ 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' ను తిరిగి తెరిచే విషయంలో ఉన్న అయోమయమే.

ఇరాన్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కొత్త సముద్ర మార్గాన్ని ఖరారు చేసేందుకు ఒమన్‌తో ఒప్పందం చివరి దశలో ఉంది. కానీ, అమెరికా ముందుగా తమ మిగిలిన షరతులను నెరవేర్చాలని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ పరిణామాల మధ్య అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 91 సెంట్లు అంటే 1.09 శాతం పెరిగి బ్యారెల్‌కు 84.46 డాలర్లకు చేరుకుంది. అలాగే, అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 61 సెంట్లు అంటే 0.78 శాతం పెరిగి బ్యారెల్‌కు 78.79 డాలర్లుగా నమోదైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గత వారంలో 7 శాతానికి పైగా తగ్గిన ధరలు
Image Credit : chatgpt

గత వారంలో 7 శాతానికి పైగా తగ్గిన ధరలు

గత వారం ఇరాన్, ఒమన్ మధ్య ఒప్పందం కుదిరిందనే వార్తల తర్వాత ఆయిల్ ధరలు ఏకంగా 7 శాతానికి పైగా పడిపోయాయి. ఆ సమయంలో హోర్ముజ్ జలసంధి త్వరలోనే తెరుచుకుంటుందని అంతా భావించారు. సాధారణంగా, యుద్ధ పరిస్థితులకు ముందు ప్రపంచవ్యాప్త చమురు అవసరాలలో దాదాపు 20 శాతం ముడి చమురు ఈ హోర్ముజ్ మార్గం ద్వారానే రవాణా అయ్యేది. అయితే, ఆ తర్వాత ఇరాన్ ఇచ్చిన ఒక కొత్త ప్రకటన మార్కెట్ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. జూన్ దాడి వల్ల జరిగిన నష్టానికి అమెరికా పరిహారం చెల్లించడంతో పాటు, తమ మిగిలిన షరతులన్నింటినీ పాటిస్తేనే హోర్ముజ్‌ను తెరుస్తామని ఇరాన్ కుండబద్దలు కొట్టింది.

35
ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గడం లేదు
Image Credit : Getty

ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గడం లేదు

ప్రస్తుతం మార్కెట్ విశ్లేషకులు, వ్యాపారులు కేవలం ప్రకటనలను నమ్మడం లేదు. ట్యాంకర్ల అసలు రాకపోకలు ప్రారంభం కావడం లేదా అధికారిక ఒప్పందం జరగడం వంటి బలమైన ఆధారాల కోసం వారు ఎదురుచూస్తున్నారు. మరోవైపు, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మాట్లాడూ, జూన్‌లో జరిగిన తాత్కాలిక ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘిస్తున్నంత వరకు వాషింగ్టన్‌తో ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు. దీనికి తోడు, యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరామ్‌కోకు చెందిన జాతాన్ రిఫైనరీపై దాడి చేసినట్లు ప్రకటించారు. సౌదీ అరేబియా ఇటీవల టర్కీ, పాకిస్తాన్‌లతో రక్షణ ఒప్పందంపై సంతకం చేసిన సరిగ్గా రెండు రోజులకే ఈ దాడి జరగడం గమనార్హం.

45
దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు
Image Credit : Gemini AI

దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు

గ్లోబల్ మార్కెట్‌లో ఇటీవల తగ్గిన ఆయిల్ ధరలు మళ్లీ పుంజుకోవడం ప్రారంభించాయి. అయితే, గత వారం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఓవరాల్‌గా ధరలలో తగ్గుదలే కనిపించింది. దీంతో అంతర్జాతీయంగా తగ్గిన ధరల ప్రయోజనం భారతదేశంలో సామాన్య ప్రజలకు అందుతుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై కేంద్ర పెట్రోలియం మంత్రి స్పందిస్తూ, మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగకుండా స్థిరంగా ఉంచగలిగామని ముందే స్పష్టం చేశారు.

55
భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
Image Credit : Getty

భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

ఈ పరిణామాల మధ్య సోమవారం ఉదయం దేశీయ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. ధరలను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 102.12 వద్ద నిలకడగా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ. 95.20 వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను భారతీయ చమురు కంపెనీలు నిశితంగా గమనిస్తున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gautam Adani Success Story: రైలు ఫ్లోర్‌పై నిద్రించిన 21 ఏళ్ల యువకుడు.. రూ.10.45 లక్షల కోట్లకు అధిపతిగా ఎలా మారాడు?
Recommended image2
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు ధరల పెరుగుదల చూస్తే షాకే
Recommended image3
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే ఉచితంగా రూ. 10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ ఉన్న‌ట్లే. ఎలాగంటే.?
Related Stories
Recommended image1
FCRA Amendment Bill 2026: ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లు లో ఏముంది? పార్లమెంట్ లో ఎందుకు దీనిపై రగడ?
Recommended image2
తెలంగాణ మాల్దీవులు: హైదరాబాద్‌కు దగ్గర్లోనే.. ఈ హిడెన్ ఐలాండ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved