MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • stock market: రూ.14 నుంచి రూ.1400 కోట్లకు అధిపతి అయ్యాడు.. స్టాక్ మార్కెట్ కింగ్ సక్సెస్ స్టోరీ

stock market: రూ.14 నుంచి రూ.1400 కోట్లకు అధిపతి అయ్యాడు.. స్టాక్ మార్కెట్ కింగ్ సక్సెస్ స్టోరీ

Stock market motivational story: జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కష్టాలు అందరికీ వస్తాయి. కొందరు వాటికి భయపడి వెనక్కి తగ్గుతారు, కానీ కొందరు వాటిలో అవకాశాలను వెతుక్కుంటారు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన విజయ్ కెడియా కథ కూడా అలాంటిదే. రూ.14 నుంచి నేడు ఆయన 1,400 కోట్లకు అధిపతి అయ్యాడు. స్టార్ మార్కెట్ కింగ్ గా ఎదిగాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 05 2025, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

విజయ్ కెడియా మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి స్టాక్ బ్రోకర్. విజయ్ 10వ తరగతి చదువుతున్నప్పుడు, తండ్రి అకస్మాత్తుగా మరణించారు. దీంతో ఇంట్లో ఆదాయానికి మార్గం లేకుండా పోయింది. ఈ కష్టకాలంలోనే విజయ్ తన చదువు పూర్తి చేశాడు, కానీ కుటుంబ పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఆయన ఏదో ఒకటి చేయాల్సి వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
షేర్ మార్కెట్ లోకి అడుగులు

షేర్ మార్కెట్ లోకి అడుగులు

కుటుంబ పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి విజయ్ దగ్గర ఎక్కువ మార్గాలు లేవు. షేర్ మార్కెట్ (Share Market) లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, వెనక్కి తగ్గలేదు. క్రమంగా షేర్ ట్రేడింగ్ లో కొంత విజయం సాధించడం ప్రారంభించారు, ఆయన జీవితం మారడం మొదలైంది.

35
14 రూపాయలు కూడా లేని స్థితిలో విజయ్ కేడియా

14 రూపాయలు కూడా లేని స్థితిలో విజయ్ కేడియా

విజయ్ కేడియా జీవితంలో ఒక సమయంలో పాల ప్యాకెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు ఆయన బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే, భార్య పాలు తెమ్మని అడిగింది. కానీ విజయ్ దగ్గర రూ.14 పాల ప్యాకెట్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఈ సంఘటన ఆయనను కుదిపేసింది. దాన్ని తన బలహీనతగా భావించకుండా మళ్ళీ కష్టపడటం మొదలుపెట్టాడు.

45
బుల్ రన్ తో మారిన అదృష్టం

బుల్ రన్ తో మారిన అదృష్టం

1990ల ప్రారంభంలో విజయ్ కలకత్తా వదిలి ముంబై వెళ్లారు. అక్కడ ఆయన అదృష్టం కలిసొచ్చింది. 1992లో షేర్ మార్కెట్ లో బుల్ రన్ వచ్చినప్పుడు, విజయ్ కేడియా బాగా డబ్బు సంపాదించారు. ఆయన కలకత్తా నుండి పంజాబ్ ట్రాక్టర్స్ షేర్లు ₹35,000 కి కొనుగోలు చేశారు. బుల్ రన్ సమయంలో ఈ షేర్ల ధర ఐదు రెట్లు పెరిగింది. వాటిని అమ్మి ACC షేర్లు కొన్నారు, ఈ పెట్టుబడి కూడా ఆయనకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో ఆయన ఆర్థిక పరిస్థితి మారిపోయింది, ఆత్మవిశ్వాసం పెరిగింది.

55
విజయ్ కేడియా పోర్ట్‌ఫోలియో

విజయ్ కేడియా పోర్ట్‌ఫోలియో

2009లో విజయ్ తన భార్యకు ఒక పాల కంపెనీ షేర్లు బహుమతిగా ఇచ్చాడు. అది ఆ రూ.14 కి సమాధానం. నేడు ఆయన పేరు దిగ్గజ పెట్టుబడిదారుల్లో ఒకటి. ఆయన కేడియా సెక్యూరిటీస్ వ్యవస్థాపకుడు కూడా. నివేదికల ప్రకారం, డిసెంబర్ 2024 నాటికి ఆయన నికర ఆస్తి ₹1,396.9 కోట్లు, అంటే దాదాపు ₹1,400 కోట్లు. ఆయన పోర్ట్‌ఫోలియోలో తేజస్ నెట్‌వర్క్స్, అతుల్ ఆటో వంటి కంపెనీల స్టాక్స్ ఉన్నాయి.

గమనిక: ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు మీ మార్కెట్ నిపుణుల సలహా తీసుకోండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
పర్సనల్ పైనాన్స్
స్టాక్ మార్కెట్
జీవనశైలి
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Recommended image2
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image3
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Gold : బంగారం వినియోగంలో టాప్-10 దేశాలు.. భారత్ ర్యాంకు ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved